News


లార్జ్‌క్యాప్‌లో వ్యాల్యూ స్టాక్స్‌

Monday 24th June 2019
Markets_main1561400723.png-26539

సెన్సెక్స్‌, నిఫ్టీ వ్యాల్యూషన్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. సెన్సెక్స్‌ ఐదేళ్ల సగటు పీఈ 21 అయితే, ప్రస్తుత పీఈ 28. అయితే, అలా అని ప్రధాన సూచీల్లోని స్టాక్స్‌ అన్నింటిలోనూ వ్యాల్యూషన్లు అధికంగా ఏమీ లేవు. కొన్ని అయితే, చాలా తక్కువ వ్యాల్యూషన్‌కే అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో విలువ ఆధారిత రెండు స్టాక్స్‌ను వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ సూచించింది.

 

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌
సుభాచ్‌ చంద్ర ఆధ్వర్యంలోని ఎస్సెల్‌ గ్రూపు ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ ఇది. దేశంలో తొలి శాటిలైట్‌ టెలివిజన్‌ చానల్‌. 1992లో జీటీవీని ఆరంభించింది. ఆ తర్వాత మొదటి ‍ప్రైవేటు వార్తా చానల్‌ జీన్యూస్‌ను కూడా ఈ సంస్థే ప్రారంభించింది. ప్రస్తుతం 10 భాషల్లో 41 చానళ్లను నిర్వహిస్తోంది. దేశంలో 20 శాతం మార్కెట్‌ వాటా ఈ సంస్థ సొంతం. మరాఠి, బంగ్లా, కర్ణాటక ఎంటర్‌టైన్‌మెంట్‌ మార్కెట్లలో జీ నంబర్‌ 1గా ఉంది. ప్రధానంగా ఈ సంస్థ ఆదాయంలో 63.5 శాతం ప్రకటనల రూపంలోనే వస్తోంది. చందాల రూపంలో మరో 29 శాతం ఆదాయం సమకూరుతోంది. సంస్థ ఆదాయంలో విదేశీ వాటా 10 శాతం. 170 దేశాల్లో జీ ప్రసారాలు కొనసాగుతున్నాయి. చివరి త్రైమాసికంలో ప్రకటనల ఆదాయం, చందాల ఆదాయంపై ప్రభావం పడింది. ట్రాయ్‌ తీసుకొచ్చిన నూతన వీక్షణ నిబంధనలే ఇందుకు కారణం. దీనికింద ప్రేక్షకులు తమకు అవసరమైన చానళ్లనే ఎంచుకోవచ్చు. ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5ను 2018లో ప్రారంభించింది. వీడియో ఆన్‌ డిమాండ్‌ సేవలను దీని ద్వారా అందిస్తోంది. దేశంలో యూజర్ల బేస్‌ పరంగా ఇది ఆరో స్థానంలో ఉంది. 6.15 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. హాట్‌స్టార్‌ మొదటి స్థానంలో ఉంది. సినిమా నిర్మాణ వ్యాపారంలోకీ కూడా అడుగు పెడుతోంది. ఏడాదిలో 10-12 సినిమాలను నిర్మించాలనేది ప్రణాళిక. ప్రస్తుతం జీ గ్రూపు భారీ రుణ భారాన్ని తీర్చడానికి నిధుల కటకటను ఎదుర్కొంటోంది. దీంతో ఈ స్టాక్‌ ఏడాదిలో 30 శాతం పడిపోయింది. కానీ, షేరువారీ ఆర్జన గత ఏడాది కాలంలో ఏడు శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఈ స్టాక్‌ 21 పీఈ వద్ద ట్రేడవుతోంది. 

 

ఐచర్‌ మోటార్స్‌
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల మాతృ సంస్థ ఐచర్‌ మోటార్స్‌. 250సీసీ సామర్థ్యం పైన మోటారు సైకిళ్ల మార్కెట్లో అగ్ర స్థానం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌దే. ఎనిమిది లక్షల మోటారు సైకిళ్లను ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ సంస్థ విక్రయించింది. 50కుపైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వాణిజ్య వాహనాల వ్యాపారాన్ని స్వీడన్‌కు చెందిన ఏబీవోల్వోతో కలసి జాయింట్‌ వెంచర్‌ రూపంలో నిర్వహిస్తోంది. ఆటోమొబైల్‌ రంగం గడ్డుకాలం నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మంచి పనితీరును చూపలేకపోయింది. ముఖ్యంగా కేరళలో భారీ వరదలు రావడం, కేరళ పెద్ద మార్కెట్‌ కావడం కంపెనీపై ప్రభావం చూపించాయి. నూతన భద్రతా ప్రమాణాలు రావడం వల్ల పెరిగిన తయారీ వ్యయాన్ని కస్టమర్లకు బదలాయించాల్సి ఉంది. చెన్నై ప్లాంట్‌లో కార్మికుల సమ్మె ప్రభావం కూడా పడింది. ఇవన్నీ కలసి కంపెనీ వృద్ధిని పరిశ్రమ కంటే తక్కువకు పడిపోయేలా చేశాయి. 650సీసీ మోడళ్లు రెండింటిని విడుదల చేయడం, థాయిలాండ్లో కొత్త కర్మాగారం ఏర్పాటు, నూతన మార్కెట్లలోకి ప్రవేశించడం కంపెనీకి రానున్న కాలంలో వృద్ధి అవకాశాలను తెచ్చిపెట్టేవే. ప్రస్తుతం ఈ స్టాక్‌ 24పీఈ వద్ద ట్రేడవుతోంది. పోటీ సంస్థలతో పోలిస్తే కొంచెం అధికమే అయినప్పటికీ, ఐదేళ్ల సగటు పీఈ 46.6తో పోలిస్తే సగానికి దిగొచ్చింది. You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 25th June 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా మంగ‌ళ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఎల్ అండ్ టెక్నాల‌జీస్ స‌ర్వీసెస్:-  త‌న మాత్రు సంస్థ ఎల్ అండ్ టీ టెక్నాల‌జీస్ ఆఫ‌ర్ ఫ‌ర్ షేర్ ప‌ద్ధతిలో 2ల‌క్షల ఈక్విటీ షేర్లను విక్రయించ‌నుంది.  ఇందుకు ఫ్లోర్ ధ‌రను రూ. 1,650లుగా నిర్ణయించింది. రేప‌టి(జూన్ 25)తో ప్రారంభం కానున్న ఇష్యూ 26వ తేదితో ముగిస్తుంది.  ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌:- బీఎన్‌బీ పారీబీ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ జూన్‌ 25, 26 తేదీల్లో

ఆరు నెలల్లో ఎక్కువ లాభాలు తినిపించాయ్‌...

Monday 24th June 2019

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు కొత్త రికార్డు స్థాయిలను నమోదు చేయడంతోపాటు కన్సాలిడేషన్‌ దశలో ఉన్నాయి. జూలై 5న కేంద్ర బడ్జెట్‌ సమీప కాలంలో మార్కెట్ల దిశను నిర్ణయిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సెన్సెక్స్‌ 40,312, నిఫ్టీ 12,103 స్థాయిలను నమోదు చేశాయి. అయితే, ఇదే ఆరు నెలల కాలంలో ఇన్వెస్టర్ల సంపద నికరంగా రూ.6 లక్షల కోట్ల మేర పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. బీఎస్‌ఈ లిస్టెడ్‌

Most from this category