News


బడా బ్యాంకుల్లో మరింత పతనం!

Wednesday 24th July 2019
Markets_main1563964250.png-27289

గౌతమ్‌ షా అంచనా
దేశీయ ఈక్విటీ మార్కెట్‌ కోలుకోవాలన్నా, పతనం కావాలన్నా బ్యాంకు నిఫ్టీయే కారణమవుతుందని, బ్యాంకునిఫ్టీ కదలికలే ప్రధాన మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని జేఎం ఫైనాన్షియల్స్‌ అనలిస్టు గౌతం షా అభిప్రాయపడ్డారు. బ్యాంకు నిఫ్టీ సరిగా లేకుంటే ప్రధాన సూచీలు ఒత్తిడిలోకి జారుకుంటాయని, గత రెండువారాలుగా ఈ ధోరణిని మనం గమనించవచ్చని చెప్పారు. దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో బడా బ్యాంకుల షేర్లు మరింత పతనమయ్యే ఛాన్సులు ఎక్కువని అంచన వేశారు. గత 12- 18 నెలల్లో బ్యాంకు షేర్లు భారీగా లాభపడ్డాయని, అందువల్ల వీటిలో పతనానికి ఎంతో అవకాశం ఉందని వివరించారు. బ్యాంకు నిఫ్టీ త్వరలో 28వేల పాయింట్లకు చేరవచ్చని, అక్కడ నుంచి క్రమంగా 26,500 పాయింట్లను తాకినా ఆశ్చర్యం లేదని తెలిపారు. 
నిఫ్టీలో ఇప్పట్లో బాటమ్‌ అవుట్‌ ఛాన్సులు కనిపించడంలేదని గౌతం తెలిపారు. ప్రస్తుత అమ్మకాల ఒత్తిడి నిఫ్టీని 10,600 పాయింట్ల వరకు తీసుకుపోతుందని అంచనా వేశారు. నిఫ్టీ ఈ నెల్లో దాదాపు 5 శాతం పతనమైంది. ప్రస్తుతం నిఫ్టీ తన కీలక ట్రెండ్‌ లైన్‌కు దిగువకు చేరింది. పలు స్టాకుల్లో కొనసాగుతున్న పతనం సూచీలు కోలుకునే అవకాశం ఇవ్వడంలేదు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త స్టాకులు పతనం పార్టీలో పాలుపంచుకోవడం మంచి సంకేతం కాదని షా చెప్పారు. నిఫ్టీపై ఫైనాన్షియల్స్‌ ఎక్కువ ఒత్తిడి తెస్తున్నాయని, వీటి వెయిటేజ్‌ ఎక్కువ కావడంతో వీటిలో క్షీణత సూచీలను ఎక్కువగా కుంగదీస్తోందని వివరించారు. 



You may be interested

ఫలితాల ఎఫెక్ట్‌: మహింద్రా ఫైనాన్స్‌ 10 శాతం డౌన్‌

Wednesday 24th July 2019

జూన్‌ త్రైమాసిక ఫలితాలలో మహింద్రా అండ్‌ మహింద్రా నికర లాభం 66 శాతం పడిపోవడంతో మహింద్రా ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ షేరు విలువ బుధవారం ట్రేడింగ్‌లో 10.52 శాతం నష్టపోయి రూ. 304.45 వద్ద ముగిసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.322 కోట్ల నికర లాభం నమోదవ్వగా ఈ త్రైమాసికంలో అది రూ.108 కోట్లకు పడిపోయింది. మహింద్రా ఫైనాన్స్‌ షేరు విలువ గత సెషన్‌లో రూ.340.15 వద్ద ముగియగా బుధవారం

మోతీలాల్‌ఓస్వాల్‌ నుంచి టాప్‌ కాంట్రాబెట్స్‌

Wednesday 24th July 2019

 ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాబయింగ్‌, కాంట్రా సెల్లింగ్‌ మాత్రమే మంచి ఫలితాలిస్తాయని మోతీలాల్‌ఓస్వాల్‌ అభిప్రాయపడింది.(కాంట్రా ఇన్వెస్ట్‌మెంట్‌ అంటే బాగా క్షీణించిన స్టాకులను ఎంచుకొని పెట్టుబడి పెట్టడం).  - తమ ఏడాది గరిష్ఠాల నుంచి  దాదాపు 20 శాతం వరకు పతనమైన కొన్ని స్టాకులను కొనొచ్చని బ్రోకరేజ్‌ సంస్థ రికమండ్‌ చేస్తోంది. ఇందులో బీఓబీ, సీమెన్స్‌, ఎన్‌టీపీసీ, ఎన్‌ఎండీసీ, ఐటీసీ ఉన్నాయి.  - మరోవైపు తమ ఏడాది కనిష్ఠాల నుంచి దాదాపు 60 శాతం లాభపడిన

Most from this category