News


స్వల్పకాలంలో రాబడులిచ్చే షేర్లివే...

Monday 21st October 2019
Markets_main1571646995.png-29029

ఆర్థిక రంగ షేర్లు భారీగా ర్యాలీ చేయడంతో  శుక్రవారం బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 3.07శాతం లాభపడగా, నిఫ్టీ 3.20శాతం ర్యాలీ చేసింది. మార్చి 26తో ముగిసిన వారం తరువాత ఒక వారంలో జరిగిన అది పెద్ద ర్యాలీ ఇదేకావడం విశేషం. నిఫ్టీ స్వల్పకాలిక ట్రెండ్‌ పాజిటివ్‌గా ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషకుడు నాగరాజ్‌ శెట్టి అంచనా వేస్తున్నారు. వచ్చే రెండు వారాల్లో నిఫ్టీ ఇండెక్స్ 11,800-850 రేంజ్‌లో కీలక నిరోదాన్ని ఎదుర్కోనుంది. గరిష్టాల నుంచి డౌన్‌ట్రెండ్‌ కరెక‌్షన్స్‌ గురి అయ్యేందుకు ఎక్కువగా అవకాశం ఉందని ఆయన తెలిపారు. వివిధ బ్రోకరేజ్ సిఫార్సుల ఆధారంగా, రాబోయే కొన్ని వారాల్లో లాభాలను అందించగల 12 స్టాక్లు వివరాలివి...

వైశాలి పరేష్‌, సీనియర్‌ సాంకేతిక విశ్లేషకుడు, ప్రభుధాస్‌ లిల్లాధర్‌ 
షేరు:- ఎల్‌ అండ్‌ టీ
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.1,580
స్టాప్‌ లాస్‌:- 1,390
విశ్లేషణ:- ఈ స్టాక్ డైలీ చార్టులో 200 డీఎంఏ స్థాయికి సమీపంలో రూ.1, 390 వద్ద బలమైన మద్దతుని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పతనం అనంతరం పుల్‌బ్యాక్‌ ర్యాలీ చేసేందుకు, రానున్న రోజుల్లో అప్‌ ట్రెండ్‌ మరింత కొనసాగే అవకాశాలున్న చార్టు సూచిస్తుంది. రెలిటివ్‌ స్ట్రెంత్‌ ఇండెక్స్‌(ఆర్ఎస్‌ఐ) పాజిటివ్‌గా ఉంది. ట్రేడింగ్‌ పరిమాణం బావుంది.
షేరు :- హావెల్స్‌ 
రేటింగ్‌:- కొనొచ్చు
స్టాప్‌ లాస్‌:- రూ.660

టార్గెట్‌: రూ.740
విశ్లేషణ:- ఈ షేరు డైలీ ఛార్టులో డౌన్‌ట్రెండ్‌లో రూ. 650 స్థాయిలో కీలక నిరోధాన్ని ఏర్పాటు చేసుకుంది. పతనం అనంతరం రివకరీ, అప్‌ట్రెండ్‌ మరింత కొనసాగడానికి మూమెంటం ఉన్నట్లు చార్ట్‌లో సంకేతాలు తెలుపుతున్నాయి. ఆర్‌ఎస్‌ఐ ఇండెక్స్‌ కూడా కొనుగోలు సంకేతాల్ని సూచిస్తుంది. 

 

జై థక్కర్‌,  సాంకేతిక, డెరివేటివ్స్‌ నిపుణుడు, అనంద్‌ రాఠి షే‍ర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌
షేరు :- బజాజ్‌ ఫిన్‌సర్వీసెస్‌
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.8,550
స్టాప్‌ లాస్‌:- రూ.8,100
విశ్లేషణ:- ఈ స్టాక్ వీక్లీ చార్టులలో దాని మొమెంటం సూచికలలో స్పష్టమైన కొనుగోలు క్రాస్ ఓవర్‌తో పాటు డౌన్‌ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ నుండి బ్రేక్ అవుట్ చూసింది. ఈ బ్రేక్ అవుట్ తో డైలీ చార్టులలో వేవ్ 4 ముగిసినట్లు అయింది. వేవ్ 5 అప్ ప్రారంభమైనట్లు అనిపిస్తుంది.
షేరు :- బాటా 
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.1,853 
స్టాప్‌ లాస్‌:-
రూ.1733
విశ్లేషణ:- ఈ స్టాక్ డైలీ చార్టులలో దాని వేవ్ 4లో ఏర్పడిన పతనం ఛానెల్ నుండి బ్రేక్ అవుట్ను అందించింది. మొమెంటం ఇండికేటర్ ఎంఏసీడీ అన్ని కోణాల వద్ద కొనుగోలు మోడ్‌లో బాగానే ఉంది.
అజిత్‌ మిశ్రా, సీనియర్‌ సాంకేతిక విశ్లేషకుడు, రిలిగేర్‌ బ్రోకింగ్‌
షేరు :- హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.1,150
స్టాప్‌ లాస్‌:- రూ.1,060
విశ్లేషణ:- ఈ షేరు వీక్లీ చార్టులో అప్‌ట్రెండ్ ట్రెండింగ్ ఛానెల్‌లో ట్రేడవుతోంది. ఇటీవల అదే దిగువ బ్యాండ్‌ను పరీక్షించింది. ఇది ఇప్పుడు క్రమంగా పుంజుకుంటుంది.
షేరు :- టాటా కెమికల్స్‌
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.660
స్టాప్‌ లాస్‌:- రూ.598
విశ్లేషణ:- టాటా కెమికల్స్ గత తొమ్మిది నెలలుగా బోర్డర్‌ రేంజ్‌లో ట్రేడవుతోంది, ఇప్పుడు బ్రేక్అవుట్ అంచున ట్రేడవుతోంది. చార్ట్‌ ప్యాట్రన్‌, సపోర్టింగ్‌ ఇండికేటర్స్‌ పొజిషన్లు స్థిరత్వాన్ని జతచేస్తున్నాయి. 
షేరు :- కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.1,710
స్టాప్‌ లాస్‌:- రూ.1575
విశ్లేషణ:- కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ప్రధానమైంది. ప్రస్తుతం ఈ బ్యాంక్‌ షేర్లు రికార్డు స్థాయికి చేరువులో ట్రేడ్‌ అవుతున్నాయి. సమీప భవిష్యత్తులో అదే స్థాయి నుండి మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా, రూ .1,540 ధర కీలక మద్దతు ఉనికి.. షేరుకు మరింత సానుకూలతను పెంచుతోంది. 
వికాస్‌ జైన్‌, సీనియర్‌ రీసెర్చ్‌ విశ్లేషకుడు, రిలయన్స్‌ సెక్యూరిటీస్‌
షేరు పేరు:- ఐటీసీ
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ. 275
స్టాప్‌ లాస్‌:- రూ. 230
విశ్లేషణ:- నెలవారీ క్యాండిల్స్‌ ఇన్‌సైడ్‌ శ్రేణిని నమోదు చేసింది. ఇది బలమైన బ్రేక్‌ అవుట్‌ను సూచిస్తుంది. ఈరంగంలో మూమెంటం ఊపందుకోవడంతో షేర్లు అవుట్‌ ఫెర్‌ఫార్మ్‌ చేసేందుకు దోహదపడవచ్చు. ఆర్‌ఎస్‌ఐలో బుల్లిష్ క్రాస్ఓవర్ ఏర్పడటం స్టాకులో టర్న్‌ ఎరౌండ్‌కు సంకేతాలిస్తాయి. స్టాక్ త్వరలో తన నార్త్‌వర్డ్‌ జర్నీని తిరిగి ప్రారంభిస్తుంది. 
షేరు :- ఇంజనీర్స్‌ ఇండియా
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.125
స్టాప్‌ లాస్‌:- రూ.102 
విశ్లేషణ:- షేరు ప్రస్తుతం బాండ్‌ ఆఫ్‌ యావరేజెస్‌లో ట్రేడ్‌ అవుతోంది. షార్ట్ టు మీడియం టర్మ్ యావరేజ్ క్రాస్ఓవర్‌కావడం  తాజా బ్రేక్ అవుట్ ఇస్తుంది. భారీ క్షీణతను చూసిన తరువాత ఈ స్టాక్ కనిష్టస్థాయి వద్ద స్థిరపడటం అమ్మకాల ఆసక్తి లేకపోవడాన్ని సూచిస్తుంది. ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీలు సానుకూలంగా వున్నాయి.
ముస్తాఫా నదీం, ఏపిక్‌ రీసెర్చ్‌ సీఈవో
షేరు :- ఎస్కార్ట్స్‌
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.720
స్టాప్‌ లాస్‌:- రూ.620
విశ్లేషణ:- ఈ స్టాక్ ఇటీవల రూ.500 దిగువ స్థాయిల నుండి చాలా బలంగా రివకరీ అయ్యింది. అలాగే పెన్నెంట్ ప్యాట్రన్‌ నమోదు చేసింది. అదే ప్యాట్రన్‌ నుండి తాజా బ్రేక్అవుట్ కనిపిస్తుంది, ఇది బుల్లిష్ కొనసాగింపు ప్యాట్రన్‌, ధరలో మరింత విస్తృత ర్యాలీని చూడవచ్చు.
షేరు:- బాలక్రిష్ణ ఇండస్ట్రీస్‌
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.720
స్టాప్‌ లాస్‌:- రూ.620
విశ్లేషణ:- ఈ స్టాక్ రూ.800-700 మధ్య కదులుతూ దీర్ఘచతురస్ర నమూనా నుండి తాజా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆర్‌ఎస్‌ఐ రోజువారీ స్థాయిలో 70 కన్నా ఎక్కువ స్ట్రెంత్‌ చూపుతోంది.You may be interested

అల్ట్రాటెక్‌ నికర లాభం 72 శాతం వృద్ధి

Monday 21st October 2019

 ఆదిత్యా బిర్లా గ్రూప్‌ దిగ్గజం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ నికరలాభం స్టాండెలోన్‌ ప్రాతిపదికన ఈ ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో 72 శాతం పెరిగింది. గతేడాది ఇదేకాలంలో నమోదైన రూ. 371 కోట్ల నికరలాభంతో పోలిస్తే, ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 639 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ. 8710 కోట్ల నుంచి రూ. 9129 కోట్లకు వృద్ధిచెందినట్లు కంపెనీ సోమవారం వెల్లడించిన ఫలితాల ప్రకటనలో పేర్కొంది. ఇబిటా 29

తప్పుడు లాభాలు, మార్జిన్‌లు..ఇన్ఫోసిస్‌పై ఉద్యోగుల ఫిర్యాదు

Monday 21st October 2019

కంపెనీ బోర్డుకు, యుఎస్‌ నియంత్రణ సంస్థకు లేఖ   ఇన్ఫోసిస్‌ స్వల్ప కాలంలో లాభాలు, ఆదాయాలు పెంచుకోడానికి అనైతిక పద్ధతులను అనుసరిస్తోందని, కంపెనీలో ‘నైతికమైన ఉద్యోగులు’గా తమను తాము పిలుచుకునే ఓ గ్రూప్‌, కంపెనీ బోర్డుకు, యుఎస్‌ సెక్యురిటీస్‌, ఎక్సేంజ్‌ కమిషన్‌(ఎస్‌ఈసీ-సెక్‌)కి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఈ ఆరోపణలను బలపరిచే ఈ మెయిల్స్‌, వాయిస్‌ రికార్డింగులున్నాయని పేర్కొంది. ఇన్ఫోసిస్‌ బోర్డుకు, సెక్‌కు పంపిన లేఖ కాపీలను ఫిర్యాదుదారులు ఆంగ్ల మీడియా ఎకనామిక్‌టైమ్స్‌తో

Most from this category