News


ఎల్‌ అండ్‌ టీ 2 % అప్‌

Thursday 24th October 2019
Markets_main1571891535.png-29103

నిర్మాణ, ఇంజినీరింగ్‌ దిగ్గజ కంపెనీ లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో 13 శాతం పెరిగి రూ. 2,527 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ.2,230 కోట్లుగా ఉంది. అంతేకాకుండా కంపెనీ ఆదాయం కూడా ఈ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన రూ. 31,087 కోట్ల నుంచి రూ. 35,925 కోట్లకు పెరిగింది. కంపెనీ నిర్వహణ లాభం రూ.4,021 కోట్లుగా నమోదైంది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు బాగుండడంతో గురువారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు విలువ ర్యాలీ చేస్తోంది. ఉదయం 9.56 సమయానికి ఎల్‌ అండ్‌ టీ షేరు విలువ 1.23 శాతం లాభపడి రూ. 1,449.45 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ. 1,431.80 వద్ద ముగిసిన ఈ షేరు, గురువారం ట్రేడింగ్‌లో 2 శాతం లాభంతో రూ. 1,460.00 వద్ద ప్రారంభమైంది.



You may be interested

పెరిగిన పసిడి

Thursday 24th October 2019

అంతర్జాతీయంగా గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో 8 డాలర్లకుపైగా పెరిగిన పసిడి గురువారం ఆసియా ట్రేడింగ్‌లో సైతం దాదాపు అదేస్థాయి వద్ద  ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1,495 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. పసిడి ధరను  ప్రభావితం చేయగల బ్రెగ్జిట్‌ అంశం, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు సమావేశాలు లాంటి కీలక పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. బ్రిటన్‌ బ్రెగ్జిట్‌కు 3నెలల

హెచ్‌సీఎల్‌ టెక్‌ ర్యాలీ..3.4% అప్‌

Thursday 24th October 2019

ఐటీ దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికర లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో  7 శాతం పెరిగి(ఏడాది ప్రాతిపదికన) రూ. 2,711 కోట్లుగా నమోదైంది. కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 2,534 కోట్లుగా ఉంది. అంతేకాకుండా కంపెనీ ఆదాయం కూడా 18 శాతం పెరిగింది. వీటితో పాటు కంపెనీ షేరుపై 1:1 నిష్పత్తిలో బోనస్‌ను ఇవ్వడంతో పాటు, షేరుకు రూ. 2 డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో ఈ

Most from this category