ఎల్అండ్టీ ...బ్రోకరేజ్‌లు పాజిటివ్
By Sakshi

రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అధిగమించడంతో ఎల్అండ్టీ షేర్లు గురువారం బీఎస్ఈల ట్రేడింగ్‌లో 2.50శాతం పెరిగి రూ.1466.00 స్థాయిని తాకాయి. ఆశాజనక ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో ఎల్ అండ్ టీ షేర్లపై పలు బ్రోకరేజ్ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేర్లకు టార్గెట్ ధరను పెంచాయి. మధ్యాహ్నం గం.1:20లకు షేరు క్రితంముగింపు(రూ.1430.95)తో పోలిస్తే 1శాతం లాభంతో రూ.1430.95 వద్ద ట్రేడ్ అవుతోంది.
నోమురా బ్రోకరేజ్
రేటింగ్:- కొనవచ్చు
టార్గెట్ ధర:- రూ.1,725 నుంచి రూ.1,730
విశ్లేషణ:- రెండో త్రైమాసిక కాలంలో ఆర్థిక వ్యవస్థ మందగమనం ఉన్నప్పటికీ కంపెనీ బలమైన ఆర్డర్లను దక్కించుకుంది. అయితే, వర్కింగ్ క్యాపిటల్ లెవల్స్ మాత్రం ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్నాయి. పన్ను రేటు తగ్గింపు కారణంతో వచ్చే ఆర్థిక సంవత్సరపు ఈపీఎస్ అంచనాల్ని 12-14శాతం వరకు పెంచింది.
మెక్వ్యరీ బ్రోకరేజ్
రేటింగ్:- కొనవచ్చు
టార్గెట్ ధర:- రూ.1936
అంచనా:- ఇంజనీరింగ్, నిర్మాణం ఆర్డర్ల ఇన్‌ఫ్లో, మార్జిన్‌పై బలమైన పనితీరు ఉంది. ప్రస్తుత మార్కెట్ అస్థిరత మధ్య ఈ షేర్లను ఇన్వెస్టర్లు తమ పోర్టు ఫోలియోలో జోడించుకునేందుకు కావల్సిన అర్హతలు ఉన్నాయి.
మోర్గాన్ స్లాన్లీ:-
రేటింగ్:- ఓవర్‌వెయిట్
టార్గెట్ ధర:- రూ.1753
విశ్లేషణ:- కోర్ రెవెన్యూ వృద్ధి 8శాతం పెరిగింది. ఇన్ఫ్రా మార్జిన్, ఆర్ఓఈలు కూడా వృద్ధి సాధించడం కలిసొచ్చే అంశాలు. దేశీయ ఆర్డర్ల వాయిదా, పెరిగిన మూలధనం తదితర అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి.
You may be interested
మారుతీ సుజుకీ లాభంలో 39 శాతం క్షీణత
Thursday 24th October 2019సెప్టెంబర్ త్రైమాసికానికి మారుతీ సుజుకీ రూ. 1358.60 కోట్ల నికరలాభం ప్రకటించింది. గతేడాది క్యు2తో పోలిస్తే ఇది 39.35 శాతం తక్కువ. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 2240 కోట్ల లాభం నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ తక్కువ లాభం నమోదు చేసినా, అనలిస్టుల అంచనాలను మాత్రం దాటేసింది. అనలిస్టుల్లో ఎక్కువమంది కంపెనీ రూ. 950 కోట్ల లాభం ఆర్జిస్తుందని అంచనా వేశారు. తాజా సమీక్షా కాలంలో
అనూహ్య అమ్మకాలు: ఎస్బీఐ 9.50శాతం పతనం
Thursday 24th October 2019లాభాల్లో నుంచి నష్టాల్లోకి మళ్లిన మార్కెట్లో ఎస్బీఐ షేర్లు మిడ్‌సెషన్ సమయంలో ఒక్కసారిగా భారీ పతనాన్ని చవిచూశాయి. నేడు బీఎస్ఈలో ఈ బ్యాంక్ షేర్లు రూ.277.00 వద్ద ట్రేడింగ్ వద్ద ప్రారంభించాయి. మిడ్‌సెషన్‌లో ఈ షేర్లలో ఒక్కసారిగా అమ్మకాల తీవ్ర మొదలైంది. మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో కేవలం 10 నిముషాల్లో ఎస్బీఐ దాదాపు 9.50శాతం క్షీణించి రూ.248.80 వద్ద ఇంట్రాడే కనిష్టానికి తాకింది. అనంతరం క్షణాల్లో రూ. 266 సమీపానికి రికవరీ