News


మా మనసంతా మైండ్‌ట్రీ మీదే

Monday 20th May 2019
Markets_main1558341724.png-25840

  • మరోసారి స్పష్టం చేసిన ఎల్‌అండ్‌టీ నాయక్‌ 
  • పెద్ద ఐటీ సంస్థగా మారుస్తామని ప్రకటన

న్యూఢిల్లీ: మైండ్‌ట్రీ కొనుగోలు అన్నది తమకు అత్యంత ముఖ్యమైనదిగా ఎల్‌అండ్‌టీ గ్రూపు చైర్మన్‌ ఏఎం నాయక్‌ పేర్కొన్నారు. మైండ్‌ట్రీలో ఎల్‌అండ్‌టీ వాటా 26 శాతానికి చేరిందని, అదనపు వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ మరో పది రోజుల్లో ప్రారంభం అవుతుందని తెలిపారు. ‘‘అవకాశాల కోసం ఎప్పుడూ చూస్తుంటాం. అయితే, ప్రస్తుతానికి మా మనసంతా మైండ్‌ట్రీపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ కంపెనీని పెద్ద కంపెనీ స్థాయికి తీసుకెళతామన్న నమ్మకం నాకు ఉంది. మైండ్‌ట్రీలో 26 శాతం వాటాను సొంతం చేసుకున్నాం. 51 శాతం చేరే వరకూ వేచి చూస్తాం. ఓపెన్‌ ఆఫర్‌ 10-12 రోజుల్లో ప్రారంభం అవుతుంది’’ అని నాయక్‌ పేర్కొన్నారు. మైండ్‌ట్రీ ప్రమోటర్లు ఎల్‌అండ్‌టీ స్వాధీన యత్నాలకు వ్యతిరేకంగా ఉండడంపై నాయక్‌ స్పందిస్తూ... కంపెనీతో వారు పెనవేసుకుపోయారని, అయితే ఎల్‌అండ్‌టీ కూడా ఉద్యోగి ఆధారిత సంస్థ అన్న విషయాన్ని వారు అర్థం చేసుకోవడం మొదలైందని చెప్పారు. ‘‘మైండ్‌ట్రీ ప్రమోటర్లు సహజంగానే కంపెనీతో అనుసంధామై ఉన్నారు. కనుక వారు అంత సులభంగా విడిచి పెట్టేందుకు ఇష్టపడరు. కానీ, ఎల్‌అండ్‌టీ ఉత్తమమైన కంపెనీ అని, తమ ఉద్యోగులకూ ఇది మంచిదే అవుతుందన్న విషయాన్ని వారు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు. నిదానంగా అయినా వారు (ప్రమోటర్లు) మొత్తం మీద తమ వాటాలను అమ్మేయాలనుకుంటారు. వారి వాటా ఇంచుమించుగా 12 శాతం ఉంటుంది. అమ్మేసి వెళ్లిపోవాలని వారికి మేం చెప్పడం లేదు. కానీ, వారు ఎప్పుడైనా విక్రయించాలనుకుంటే, మేం కొనుగోలు చేస్తాం’’అని నాయక్‌ వివరించారు. ఐటీలో భారీ వృద్ధి అవకాశాలున్నట్టు నాయక్‌ చెప్పారు. మైండ్‌ట్రీ కొనుగోలు పూర్తయితే 3 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటుందని, మూడు నుంచి నాలుగేళ్లలో 5 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లాలన్నది తమ లక్ష్యంగా పేర్కొన్నారు. 



You may be interested

స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో నిఘా, పర్యవేక్షణ పెంపు

Monday 20th May 2019

న్యూఢిల్లీ: ఈ వారంలోనే ఎ‍న్నికల ఫలితాలు రానున్నందున స్టాక్స్‌ ధరల్లో తీవ్ర ఆటుపోట్లకు అవకాశాల నేపథ్యంలో సెబీ, స్టాక్‌ ఎక్సేంజ్‌లు తమ నిఘా చర్యలను పటిష్టం చేశాయి. ‘‘ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత మొదటి ట్రేడింగ్‌ సెషన్‌ అయిన సోమవారం కోసం అత్యంత నిఘా, పర్యవేక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. గురువారం నాటికి మరింత పెంచుతాం’’ అని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. పోల్‌ ఫలితాలు మార్కెట్లపై ప్రభావం చూపించే అవకాశాలున్నందున,

ఎన్నికల ఫలితాలే దిక్సూచి

Monday 20th May 2019

ప్రథమార్ధంలో ఎగ్జిట్ పోల్స్‌ ప్రభావం మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు ఆర్థిక ఫలితాలు కూడా కీలకం న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్‌, ఎన్నికల ఫలితాలు ఈ వారం దేశీ ఈక్విటీ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. ప్రథమార్ధంలో ఎగ్జిట్ పోల్స్ ప్రభావం చూపనున్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

Most from this category