News


ఎల్‌అండ్‌టీ డీలా- కేపిటల్‌ గూడ్స్‌ వీక్‌

Wednesday 25th March 2020
Markets_main1585120913.png-32670

కేపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 6 ఏళ్ల కనిష్టం
రెండు నెలల్లో ఎల్‌అండ్‌టీ 46 డౌన్‌
57-40 శాతం మధ్య పలు కౌంటర్లు బోర్లా

మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో కదులుతున్నప్పటికీ కేపిటల్‌ గూడ్స్‌, ఇంజినీరింగ్‌ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో బీఎస్ఈలో కేపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ ఆరేళ్ల కనిష్టాన్ని తాకింది. కరోనా కల్లోలం కారణంగా 2008లో వెలుగుచూసిన సంక్షోభాన్ని మించి మౌలిక సదుపాయాల రంగం పెట్టుబడుల క్షీణతను చవిచూడనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో బీఎస్‌ఈలో కేపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ ఉదయం సెషన్‌లో 9500 దిగువకు చేరింది. వెరసి 2014 ఫిబ్రవరి 18 తదుపరి కనిష్టాన్ని తాకింది. 

నేలచూపులో
గత రెండు నెలలుగా కేపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ నీరసంగా కదులుతోంది. ఫలితంగా 46 శాతం క్షీణతను చవిచూసింది. ఇదే సమయంలో మార్కెట్లు 36 శాతం తిరోగమించాయి. ఇండెక్సులో భాగమైన దిగ్గజం ఎల్‌అండ్‌టీ షేరు 46 శాతం వెనకడుగు వేసింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 682 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 661 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది.

57-36 శాతం డౌన్‌
ఎల్‌అండ్‌టీ బాటలో ఇతర కౌంటర్లు గ్రాఫైట్‌ ఇండియా, హెచ్‌ఈజీ, కల్పతరు పవర్‌, ఫినొలెక్స్‌ కేబుల్స్‌, భారత్‌ ఫోర్జ్‌, ఎన్‌బీసీసీ, భెల్‌, హనీవెల్‌ ఆటోమేషన్‌, లక్ష్మీ మెషీన్‌ వర్క్స్‌ 57-36 శాతం మధ్య దిగజారాయి. 

ఇతర కౌంటర్లు సైతం
కేపిటల్‌ గూడ్స్‌ విభాగంలోని ఇతర కౌంటర్లలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, హింద్‌ ఏరోనాటిక్స్‌, ఎస్‌కేఎఫ్‌ ఇండియా, గ్రైండ్‌వెల్‌ నార్టన్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, థెర్మక్స్‌, సీమెన్స్‌, వీగార్డ్‌, హావెల్స్‌, ఏఐఏ ఇంజినీరింగ్ 39-25 శాతం మధ్య నష్టపోయాయి. You may be interested

ఏడాది కనిష్టానికి 548 షేర్లు

Wednesday 25th March 2020

బుధవారం ఎన్‌ఎస్‌ఈలో 548 షేర్లు 52 వారాలకనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో 21 ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్, 3ఐ ఇన్ఫోటెక్, 3 ఎం ఇండియా, 63 మూన్స్‌ టెక్నాలజీస్, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్, ఆవాస్‌ ఫైనాన్సియర్స్, అబాన్‌ ఆఫ్‌షోర్స్, ఏబీబీ ఇండియా, ఏసీసీ, అదానీ గ్యాస్, ఆధునిక్‌ ఇండస్ట్రీస్, అడోర్‌ వెల్డింగ్, అద్వాని హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా, ఏజీస్‌ లాజిస్టిక్స్, అగ్రీటెక్‌ ఇండియా,ఆగ్రోఫోస్‌ ఇండియా,మొనెట్‌ఇస్పాట్‌ అండ్‌ ఎనర్జి, అశోక్‌

రూ.41వేల పైకి బంగారం ధర

Wednesday 25th March 2020

బంగారం ధర వరుసగా మూడో రోజూ పెరిగింది. గత వారంలో భారీగా పడిపోయిన బంగారం ధర వరుస 3రోజుల ర్యాలీతో తిరిగి రూ.41వేల మార్కును అందుకుంది. కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తూ ఆర్థిక వ్యస్థలను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థనలు బలోపేతం చేసేందుకు అమెరికాతో పాటు వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు ఉద్దీపనలు ప్రకటింస్తుండటంతో బంగారం «ధర బుధవారం లాభపడింది. దేశీయం మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్నటి

Most from this category