News


ఈ వారం టాప్‌-3 బెట్స్‌: కునాల్‌ బోత్రా

Sunday 8th September 2019
Markets_main1567967293.png-28257

ఈ వారం నిఫ్టీ 11,200 వరకు ర్యాలీ చేయవచ్చన్న అంచనాను ప్రముఖ మార్కెట్‌ అనలిస్ట్‌ కునాల్‌ బోత్రా వ్యక్తం చేశారు. ఈ వారం ట్రేడింగ్‌ పరంగా అనుకూలంగా ఉండే మూడు స్టాక్స్‌ను కూడా ఆయన సూచించారు. 

 

నిఫ్టీ గత వారం కనిష్ట స్థాయిల నుంచి 100-150 పాయింట్ల మేర రికవరీ అయిందని, మరీ ముఖ్యమైన అంశం.. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ తిరిగి పెరిగేందుకు ప్రయత్నించడమన్నారు. అలాగే, మార్కెట్‌ బ్రెడ్త్‌ (లాభ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి) చెప్పుకోతగ్గంత మెరుగుపడిందని, ముఖ్యంగా వారం ద్వితీయ భాగంలో ఇది జరగడం చాలా సానుకూల సంకేతంగా కునాల్‌ బోత్రా పేర్కొన్నారు. ‘‘ఐటీ, ఎఫ్‌ఎంసీజీ వంటి సురక్షిత రంగాలు బలంగా నిలబడగా, వారం రెండో భాగంలో కొంత కరెక్షన్‌ ఎదుర్కొన్నాయి. అయితే అధిక బీటా స్టాక్స్‌కు మళ్లీ డిమాండ్‌ నెలకొంది. ఆటో స్టాక్స్‌ మళ్లీ పెరిగేందుకు ప్రయత్నించాయి. మెటల్‌ ఇండెక్స్‌ కూడా తిరిగి ర్యాలీ బాట పట్టింది. బ్యాంకు నిఫ్టీ కూడా మొత్తం మీద తిరిగి వచ్చేందుకు ప్రయత్నించింది. ఈ తరహా ప్యాటర్న్‌ను చూసినప్పుడు సురక్షిత రంగాలు కరెక్షన్‌ను చవిచూడడం అన్నది మార్కెట్‌ మరింత రిస్క్‌ మోడ్‌లోకి వెళుతున్నట్టు. అంటే కొత్త ట్రెండ్‌ ఏర్పడుతుందని అర్థం. మొత్తం మీద నిఫ్టీ ఈ వారంలో 11,200 వరకు ర్యాలీ చేస్తుంది’’ అని కునాల్‌ బోత్రా వివరించారు. 

 

మెటల్స్‌ ర్యాలీ గురించి మాట్లాడుతూ... ఈ విభాగంలో టాటా స్టీల్‌కు ఆయన ఓటేశారు. వేదాంత, జిందాల్‌ స్టీల్‌ అన్నవి అధిక బీటా స్టాక్స్‌ అని, టాటా స్టీల్‌ స్టాక్‌ ధర పరంగా దృఢంగా ఉంటుందన్నారు. మార్కెట్లు పడిపోతుంటే, కీలక మద్దతు స్థాయిలు కోల్పోతుంటే, ఎక్కువ అమ్మకాలు ఎదుర్కొనేది మెటల్స్‌ స్టాక్‌లేనన్నారు. మెటల్స్‌లో చాలా స్టాక్స్‌ బుల్లిష్‌ సంకేతాలు చూపిస్తున్నాయని, స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి ధరల పరంగా కనిష్ట స్థాయిలకు దగ్గరగా ఉన్నట్టు చెప్పారు. ఇది దీర్ఘకాల చార్ట్‌లోనూ కనిపిస్తే.. మెటల్స్‌ స్టాక్స్‌ స్వల్ప కాల ర్యాలీయే కాక దీర్ఘకాల ర్యాలీకి అవకాశాలు ఉంటాయన్నారు. ఈ వారం బజాజ్‌ ఫైనాన్స్‌ స్టాక్‌ను రూ.3,500 టార్గెట్‌తో కొనుగోలు చేసుకోవచ్చని, రూ.3,300 స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని కునాల్‌ బోత్రా సూచించారు. అలాగే, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ స్టాక్‌ను రూ.330 టార్గెట్‌తో కొనుగోలు చేసుకోవచ్చని, రూ.298 స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలన్నారు. ఇక అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్‌ను రూ.144 టార్గెట్‌తో కొనుగోలు చేసుకోవచ్చని, రూ.133 స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని సూచించారు.You may be interested

స్వల్పనష్టాలతో ప్రారంభం

Monday 9th September 2019

 ఆగస్టు నెలలో చైనా ఎగుమతులు క్షీణించాయన్న వార్తలతో నిస్తేజంగా ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లకు అనుగుణంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 13 పాయింట్ల నష్టంతో 36,969 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 10,937 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఆటోమొబైల్‌ షేర్లు నష్టాలకు లోనయ్యాయి. టాటా మోటార్స్‌, మారుతి, ఐషర్‌ మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, హీరో మోటో, బజాజ్‌

వెండిలో ఇన్వెస్ట్‌ చేసే ఈటీఎఫ్‌లు ఆకర్షణీయం

Sunday 8th September 2019

బంగారం ర్యాలీని వెండి కూడా అందుకుని పరుగులు తీస్తోంది. లండన్‌ మార్కెట్‌లో సిల్వర్‌ స్పాట్‌ ధరలు ఔన్స్‌కు 19.64 డాలర్లకు చేరి మూడేళ్ల గరిష్ట స్థాయికి వెళ్లాయి. 2013 అక్టోబర్‌ తర్వాత ఈ స్థాయి ధరకు చేరడం మళ్లీ ఇదే. నిజానికి చారిత్రకంగా చూస్తే బంగారం ర్యాలీ చేసినప్పుడల్లా వెండి కూడా మంచి ప్రదర్శనే చూపుతోంది. ఈ నేపథ్యంలో వెండిలో ఇన్వె‍స్ట్‌ చేసే ఈటీఎఫ్‌లు పెట్టుబడులకు ఆకర్షణీయమని జియోజిత్‌ ఫైనాన్షియల్‌

Most from this category