News


కునాల్‌ బోత్రా నుంచి టాప్‌ రికమెండేషన్లు

Saturday 22nd February 2020
Markets_main1582361893.png-32009

మైండ్‌ ట్రీ
మైండ్‌ట్రీలోని చార్ట్ సెటప్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో బలమైన షేరు యాక్షన్‌ చూస్తున్న కొన్ని రంగాల్లో ఐటీ సెక్టార్‌ ప్రధానమైంది. ఈ రంగంలోని మైండ్‌ట్రీ కంపెనీ మధ్యస్థాయి ఐనప్పటీకీ.., ప్రైజ్‌ యాక్షన్‌ దృష్ట్యా ఐటీ రంగానికి నాయకత్వం వహిస్తుంది. మైండ్‌ ట్రీ తరువాత ఎన్‌ఐఐటీ టెక్‌ షేరులో మంచి యాక‌్షన్ కన్పిస్తుంది. గత 10 - 12 వారాలలో మైండ్‌ట్రీ  స్థిరత్వమైన ర్యాలీ షేరు ధర నాలుగు అంకెలు స్థాయిని దాటడానికి సహాయపడింది. వారం చివరిలో రూ .1,000-1,040 స్థాయిల్లోకి ట్రేడైంది. ఈ స్థాయి మైండ్‌ట్రీలోకి వచ్చిన కొనుగోళ్ల స్థిరత్వాన్ని చూపుతుంది. ప్రస్తుతానికి, సిగ్నల్స్ చార్టులలో మొమెంటమ్స్‌ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అందువల్ల, మైండ్‌ట్రీ షేర్ల ర్యాలీ మరింత ముందుకు సాగుతుందని ఎవరైనా ఆశించవచ్చు. కాబట్టి స్వల్ప కాలానికి ఈ షేరును రూ.1020 స్టాఫ్‌లాస్‌తో రూ.1,075 - రూ. 1,100 రేంజ్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఆర్తి ఇండస్ట్రీస్‌ 
చైనా నుంచి దిగుమతుల క్షీణతతో లాభపడుతున్న కొన్ని ప్రత్యేకమైన షేర్లలో ఆర్తి ఇండస్ట్రీస్‌ ఒకటి. ముడి పదార్థాల ధరలు పెరిగిన్పటికీ, అది వారికి నిజంగా సమస్య కాదని,  వారు దానిని తుది వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాస్‌ ఆన్‌ చేస్తామని ఛైర్మన్‌ ఇటీవల తెలిపారు. చార్ట్ చాలా ఆకర్షణీయంగా ఉంది. తాజా బ్రేక్అవుట్ సంకేతాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్‌ చాలా సులభంగా రూ.1,100 స్థాయికి చేరుకునేందుకు అవకాశాలు ఎ‍క్కువగా ఉన్నాయి. స్వల్పకాలానికి రూ.1,020ల స్టాప్‌లాస్‌తో ఈ షేరును కొనుగోలు చేయవచ్చు. You may be interested

కెమికల్‌, ఫార్మా రంగంలో గుడ్‌ బెట్స్‌!

Saturday 22nd February 2020

కరోనాతో దేశీ కంపెనీలకు లబ్ది  మ్యాక్స్‌ డీల్‌తో యాక్సిస్‌ బ్యాంక్‌కు జోష్‌ నోసిల్‌, ఆర్తి, యూపీఎల్‌, నాట్కో, అరబిందో భేష్‌ - సుదీప్‌ బంద్యోపాధ్యాయ్‌, ఇండిట్రేడ్‌ కేపిటల్‌ ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలతను ప్రదర్శించాయని సుదీప్‌ బంద్యోపాధ్యాయ్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ స్థాయిలో నిరుత్సాహకర వాతావరణం నెలకొన్నప్పటికీ దేశీయంగా సెంటిమెంటు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు తెలియజేశారు. అయితే వేగంగా విస్తరిస్తున్న కరోనా నేపథ్యంలో తలెత్తనున్న సమస్యలు,

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో.. బ్లాక్‌బస్టర్‌!?

Saturday 22nd February 2020

పబ్లిక్‌ ఇష్యూపట్ల ఇన్వెస్టర్ల ఆసక్తి  అనధికార మార్కెట్లో భారీ ప్రీమియం ఐపీవో ధర అంచనా రూ. 750-755! రూ. 1100-1300 మధ్య లిస్టింగ్‌ చాన్స్‌? బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం​స్టేట్‌బ్యాంక్‌ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూపట్ల ఇన్వెస్టర్లలో అత్యంత ఆసక్తి నెలకొన్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అనధికార(గ్రే) మార్కెట్‌లో ఇష్యూకి 40 శాతం అధిక ధర(ప్రీమియం) పలుకుతున్నట్లు చెబుతున్నారు. ఇష్యూ మార్చి 2న ప్రారంభమై 5న ముగియనుంది. నిజానికి ఇష్యూకి ఎస్‌బీఐ ధరను

Most from this category