STOCKS

News


ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకుంటున్నారు!

Saturday 16th November 2019
Markets_main1573898654.png-29646

బ్యాంకు షేర్ల జోరుతో నిఫ్టీ బ్రేకవుట్‌ సాధ్యం
మెటల్స్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ షేర్లు ర్యాలీ జరపడం, అదే సమయంలో ఎఫ్‌ఎంసీజీ షేర్లు మందకొడిగా ఉండడం లాంటివి రిస్క్‌-ఆన్‌ ట్రేడింగ్‌ పెరుగుతుందనేందుకు నిదర్శనాలని ప్రముఖ అనలిస్టు కునాల్‌ బోత్రా చెప్పారు. ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకొనేందుకు ఎక్కువ సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని రిస్క్‌-ఆన్‌ ట్రేడింగ్‌ అని, రిస్క్‌కు వెరసి రక్షణాత్మకంగా వ్యవహరించడాన్ని రిస్క్‌-ఆఫ్‌ ట్రేడింగ్‌ అని అంటారు. ఎకానమీపై నమ్మకం పెరిగే సమయంలో రిస్క్‌-ఆన్‌ ట్రేడింగ్‌, ఎకానమీపై భయం పెరిగే సందర్భాల్లో రిస్క్‌-ఆఫ్‌ ట్రేడింగ్‌ ఎక్కువవుతుంటాయి. ప్రస్తుతం లార్జ్‌క్యాప్స్‌లో రిస్క్‌-ఆన్‌ ట్రేడింగ్‌ బాగా కనిపిస్తోందని కునాల్‌ చెప్పారు. కాంట్రేరియన్‌ బెట్స్‌ను వెతకడం లాంటివి కాకుండా ప్రస్తుతం రిస్క్‌ తీసుకొని వాల్యూషన్లు పెరిగిన స్టాకుల్లో మరింత పెట్టుబడులు పెడుతున్నారని, కొన్ని నెలలుగా ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో ర్యాలీ కొనసాగడం గమనించవచ్చని తెలిపారు. మిగిలిన రంగాలు కూడా ర్యాలీలో పాల్గొంటున్నా ఫైనాన్షియల్స్‌ అధిక లాభాలు ఇస్తున్నాయన్నారు. బ్యాంకు నిఫ్టీ ఫ్యూచర్స్‌లో లాంగ్‌ బిల్డప్‌ గతవారం కనిపించింది. పైన చెప్పిన ప్రైవేట్‌ బ్యాంకులు వచ్చేవారం కూడా జోరు చూపితే అది బ్యాంకు నిఫ్టీలో ర్యాలీకి అంతిమంగా నిఫ్టీలో పాజిటివ్‌ బ్రేకవుట్‌కు దారితీస్తుందని వివరించారు. 
ఎయిర్‌టెల్‌, మెటల్స్‌ రంగంపై..
గతవారం ఎయిర్‌టెల్‌ మరోమారు తన సత్తా చూపిందని కునాల్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా శుక్రవారం నెగిటివ్‌ నుంచి భారీ లాభాల్లోకి మరలడం చాలా పాజిటివ్‌ పరిణామమన్నారు. షేరు పాజిటివ్‌ టర్నెరౌండ్‌ చూపడం, దాదాపు డే హై వద్ద క్లోజవడం, కీలక స్థాయి రూ.360ని తాకి పైకిరావడం లాంటివి షేరులో మరింత ర్యాలీ ఉందని సంకేతాలని కునాల్‌ చెప్పారు. ప్రస్తుతం షేరు చాలా రోజులుగా సతాయిస్తున్న రూ. 400 అడ్డంకి వద్ద ఉందని, దీన్ని దాటితే పెద్ద బ్రేకవుట్‌ సాధించినట్లేనని తెలిపారు. దీనిపైన రూ. 440- 460 స్థాయిలు కూడా తాకవచ్చన్నారు. మెటల్స్‌ రంగంలో ఎంపిక చేసిన స్టాకులను పరిశీలించడం మంచిది. మిడ్‌క్యాప్‌ స్టాకు జిందాల్‌ స్టీల్‌ నెలన్నరలో దాదాపు 50 శాతం ర్యాలీ జరిపింది. ఇతర స్టాకులు ఇంత సత్తా చూపలేకపోయాయి. హిందాల్కో ర్యాలీ సూచనలు చూపి ఫలితాల అనంతరం నెగిటివ్‌ జోన్‌లోకి మారింది. వేదాంత స్టాకు మెటల్స్‌ను వెనక్కు లాగుతోంది. ఇదే ధోరణి మరికొంత కాలం కొనసాగవచ్చు. వేదాంత, హిందాల్కోలు మెటల్‌ ఇండెక్స్‌ను ముందుకు సాగకుండా అడ్డుపడవచ్చు. టాటాస్టీల్‌ షేరు దశల వారీ ర్యాలీ జరుపుతోంది. ప్రస్తుత స్థాయిల నుంచి టాటాస్టీల్‌ 4-5 శాతం దిగువన లభిస్తే కొనుగోళ్లను పరిశీలించవచ్చు. ఆ స్థాయి వద్ద 1:2 రిస్కురివార్డు నిష్పత్తిని ఆశించవచ్చు. 
వచ్చే వారానికి టాప్‌ 3 రికమండేషన్లు
1. స్ట్రైడ్స్‌ షాసున్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 395. స్టాప్‌లాస్‌ రూ. 364. చార్టుల్లో బలంగా కనిపిస్తోంది. ఇండికేటర్లు ఓవర్‌సోల్డ్‌గా ఉండి బలమైన బౌన్స్‌ను సూచిస్తున్నాయి. 
2. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 230. స్టాప్‌లాస్‌ రూ. 200. చాలావారాలుగా 200 డీఎంఏ పైన కన్సాలిడేట్‌ అవుతోంది. త్వరలో బలమైన బ్రేకవుట్‌ జరిపే బలమైన సంకేతాలు తాజాగా ఇస్తోంది. 
3. కోటక్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1680. స్టాప్‌లాస్‌ రూ. 1580. ఈ షేరు కన్సాలిడేషన్‌ బ్రేకవుట్‌ దిశగా పయనిస్తోంది. You may be interested

రాబోయే 3వారాలకు 3 స్టాక్‌ సిఫార్సులు

Saturday 16th November 2019

సాంకేతిక అంశాలను పరిశీలిస్తే రానున్న 3వారాల్లో జస్ట్‌ డయల్‌, ఇండిగో షేర్లు స్థిరమైన రాబడుల్ని ఇవ్వచ్చని ఇండియానిశీష్‌ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణుడు ముహుల్‌ కొఠారి అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే కాలవ్యవధితో జీ ఎంటర్‌టైన్‌ షేరును విక్రయించమని ఆయన సలహానిస్తున్నారు. ఇప్పుడు ఈ 3 షేర్లపై కొఠారి విశ్లేషణలను చూద్దాం. షేరు పేరు:- జస్ట్‌ డయల్‌ టార్గెట్‌ ధర:- రూ.560లు స్టాప్‌ లాస్‌:- రూ.480లు అప్‌సైడ్‌:- 8-9శాతం  కాల పరిమితి:-  1 నుంచి 3వారాలు విశ్లేషణ:- జస్ట్‌ డయల్‌ షేరు జూన్‌

ఎస్సార్‌ స్టీల్‌..ఏయే బ్యాంకులకు ఎంతొస్తుంది?

Saturday 16th November 2019

సుప్రీం కోర్టు తీర్పు వలన ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు దాఖలైన రూ. 42,000 కోట్ల బిడ్‌లో సుమారుగా 92 శాతం వాటాను, ఈ కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకులు పొందనున్నాయి. ఎస్సార్‌ స్టీల్‌కు రుణాలిచ్చిన ఆపరేషనల్‌ రుణ దాతలు రూ. 1,196 కోట్లను పంచుకోనున్నారు. ఫలితంగా బ్యాంకుల డిసెంబర్‌ క్వార్టర్‌ లాభాల దృక్పథం మెరుగవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా అనేక దివాలా కేసులను తొందరగా పరిష్కారించేందుకు వీలు కుదిరిందని తెలిపారు.    

Most from this category