News


2020 డిసెంబర్‌ కల్లా సెన్సెక్స్‌ 45,500

Saturday 7th December 2019
Markets_main1575709596.png-30109

వచ్చే ఏడాది డిసెంబర్‌ చివరినాటికి నిఫ్టీ 13, 400 స్థాయిని నమోదు చేస్తుందని కోటక్‌ సెక్యూరిటీ అంచనా వేస్తుంది. సెన్సెక్స్‌ సైతం 45,500 స్థాయిని అందుకోగలదని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తుంది. ‘‘నిఫ్టీ-50 ఇండెక్స్‌లోని కార్పొరేట్ల లాభాలు ఆర్థిక సంవత్సరం 2019-20లో 10శాతం, ఆర్థిక సంవత్సరం 2020-21లో 27శాతం చొప్పున పెరుగుతాయి. గడిచిన మూడేళ్లలో నిఫ్టీ-50 సీఏజీఆర్‌ 8శాతంగా నమోదైన నేపథ్యంలో వచ్చే మూడేళ్ల కాలానికి సీఏజీఆర్‌ 18శాతం వృద్ధిని ఆశిస్తున్నాము.’’ అని కోటక్‌ సెక్యూరిటి తెలిపింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రతికూల రాబడినిచ్చిన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచికలతో విస్తృత మార్కెట్ ఇప్పటికీ ఒత్తిడికి లోనవుతోందని బ్రోకరేజ్ సంస్థ పేర్కోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటి జీడీపీ వృద్ధి 4.7శాతంగా నమోదవుతుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. 

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్లో దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు 20బిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టారు. మ్యూచువల్ ఫండ్లలోకి నెలవారీ సగటు సిప్‌ ప్రవాహాలు రూ.8230 కోట్లుగా ఉన్నాయి. ఈ రెండు అంశాలు నిఫ్టీ-50 ఇండెక్స్‌ పెరిగేందుకు దోహదపడ్డాయని కోటక్‌ పేర్కోంది. ఈ ఏడాదిలో రుతుపవనాల వర్షపాతం గత 25 ఏళ్లలో అత్యధికంగా నమోదుకావడంతో రబీ పంట ఉత్పత్తికి, గ్రామీణ ప్రజల అధిక ఆదాయ వృద్ధికి మార్గం సుగమం చేసింది.

లార్జ్‌ క్యాప్‌లో పాటు మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు అత్యుత్తమ ప్రదర్శన కొనసాగించాలంటే మెరుగైన రుణ వితరణ, పారిశ్రామిక ఉత్పత్తి, జీడీపీ వృద్ధి రాణింపుతో పాటు ఆర్థిక వ్యవస్థలో విస్తృత పునరుద్ధరణ అవసరం. ఒకవేళ రాబోయే కేంద్ర బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు, ఇన్వెస్టర్లకు కొన్ని ప్రోత్సాహకాలను అందిస్తే అప్పుడు మార్కెట్లో విస్తృత ర్యాలీని చూడవచ్చు. అది మిడ్ స్మాల్ క్యాప్‌ షేర్లలో ర్యాలీకి తోడ్పాటునిస్తుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జైదీప్‌ హన్స్‌రాజ్‌ అభిప్రాయపడ్డారు. 

ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ చివరి నాటికి సెన్సెక్స్‌ 13శాతం, నిఫ్టీ 11శాతం ర్యాలీ చేశాయి. ఈ క్యాలెండర్‌ ఏడాదిలో ఇప్పటి వరకు మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 3.7శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 7.8శాతం క్షీణించాయి. ఇవే ఇండెక్స్‌లు 2018లో వరుసగా 16శాతం, 27శాతం చొప్పున పతనమయ్యాయి. 

ర్యాలీకి ప్రధాన అవరోధాలు:- 
ఆర్థిక వ్యవస్థ మందగమనం, అంచనాల మేరకు కార్పొరేట్‌ లాభాలు పెరగకపోవడం... ఈ రెండు అంశాలు సూచీల ర్యాలీకి ప్రధాన అవరోధాలుగా మారవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. అలాగే అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు అలాగే కొనసాగితే... యెన్‌ కరెన్సీ పై ఒత్తిడి కలుగుతుంది. అది డాలర్‌ మారకంలో రూపాయి క్షీణించేందుకు దారీ తీసే అవకాశాన్ని కలిగించవచ్చని కోటక్‌ తెలిపింది. ఈ సంవత్సరం తక్కువ పన్ను ప్రయోజనం పొంది.. పూర్తి పన్ను చెల్లించే సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఆర్థిక గణాంకాలను నమోదు చేయడంలో విఫలమవుతాయి. ఆర్థిక సంవత్సరం 2021 లాభాల అంచనాలు అధికంగా ఉన్నాయి. ఈ అంశాలు ఇండెక్స్‌ల ర్యాలీకి అవరోదాన్ని కలిగించే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తున్నది. 

ఈ రంగాలపై దృష్టిని సారించండి:- 
క్యాలెండర్‌ ఇయర్‌ 2020లో అధిక లాభాల దార్శినికత, మంచి ఆదాయ నిష్పత్తి, 10ఏళ్ల సగటు వాల్యూయేషన్ల దిగువన ట్రేడ్‌ అయ్యే షేర్లను ఎంపిక చేసుకోవాలని బ్రోకరేజ్‌ సంస్థ సలహానిచ్చింది. ఇక రంగాల వారీగా కార్పొరేట్‌ బ్యాంకింగ్‌,  ఎన్‌బీఎఫ్‌సీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, నిర్మాణ, హెల్త్‌కేర్‌, అగ్రోకెమికల్స్‌ రంగాలకు చెందిన షేర్లను కొనుగోలు చేయవచ్చని కోటక్‌ అంటుంది. ‘‘ మంచి ఆర్‌ఓవో ప్రోఫైల్‌, లార్జ్‌ క్యాప్‌ షేర్లతో పోలిస్తే వ్యాల్యూవేషన్‌ తక్కువగా ఉండటం తదితర కారణాలతో సిమెంట్‌, ఫార్మా రంగాలకు చెందిన మిడ్‌ క్యాప్‌ షేర్లను కొనుగోలు చేయవచ్చు’’ అని కోటక్‌ తన నివేదికలో పేర్కోంది. You may be interested

అమెరికా మార్కెట్‌ జోరు... టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ డౌన్‌

Saturday 7th December 2019

అమెరికాలో మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌కు చెందిన అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌)లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. టాటా మోటర్స్‌ అత్యధికంగా 1.81శాతం నష్టపోయింది. విప్రో, ఐసీఐసీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు అరశాతం క్షీణించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ స్వల్పంగా 0.10శాతం నష్టపోయింది. మరోవైపు ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అరశాతం లాభపడింది. వేదాంత 0.37శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ 0.08శాతం లాభాల్లో ముగిశాయి.  భారీ లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు:-  చైనాతో వాణిజ్య ఒప్పంద ఖరారు అశలు, బలమైన

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20పాయింట్లు అప్‌

Saturday 7th December 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి లాభంతో 11,975.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 11955.70 పాయింట్లతో పోలిస్తే 20 పాయింట్ల లాభంతో ఉంది.  నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ లాభంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక నిన్నటి రోజున సూచీలు వరుసగా రెండో నష్టాలపాలయ్యాయి. ఆర్థిక వృద్ధి భయాలు వెంటాడటం, రిజర్వ్‌బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను

Most from this category