News


క్రూడ్‌, ఎన్నికలే మార్కెట్లకు ముప్పు

Thursday 27th September 2018
Markets_main1538035717.png-20643

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు గత రెండు వారాల నుంచి కన్సాలిడేట్‌ అవుతూ వస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల్లో లిక్విడిటీ ఆందోళనలు, రూపాయి ఒడిదుడుకులు, క్రూడ్‌ ధరల పెరుగుదల కారణంగా అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. క్రూడ్‌ ధరలు మూడంకెల స్థాయికి చేరితే, ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వెలువడితే అప్పుడు మార్కెట్లకు ప్రస్తుత స్థాయిలే గరిష్టమని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ ఎండీ నిలేశ్‌ షా తెలిపారు. 
ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 82 డాలర్ల వద్ద కదలాడుతోంది. క్రూడ్‌ ధర ఈ ఏడాది ఇప్పటి దాకా 25 శాతానికిపైగా పెరిగింది. గత ఏడాది కాలంలో 45 శాతంమేర ఎగసింది.
అంతర్జాతీయంగా ఫెడ్‌ రేట్ల పెంపు, అమెరికా-చైనా టారిఫ్‌ వార్‌ ప్రతికూల అంశాలని నిలేశ్‌ షా తెలిపారు. ట్రేడ్‌వార్‌ వల్ల ఇండియా లబ్ధి పొంది.. మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా అవతరిస్తే అప్పుడు మార్కెట్లు పెద్ద ర్యాలీ చేయవచ్చని అంచనా వేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

ఎన్నికలు
2019లో ఎన్నికలు రానున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, మిజోరం ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం కష్టమని తెలిపారు. అయితే దీర్ఘకాలంలో పోర్ట్‌ఫోలియోలపై ఎన్నికలు కానీ, ప్రభుత్వం కానీ ప్రభావం చూపలేవని పేర్కొన్నారు. 

బ్లూచిప్స్‌
జూలై, ఆగస్ట్‌ నెలల్లో​బ్లూచిప్స్‌, హెవీవెయిట్‌ స్టాక్స్‌ ఇండెక్స్‌లను 10 శాతంపైకి తీసుకెళ్లాయి. బ్లూచిప్స్‌ కరెక‌్షన్‌కు గరయ్యాయి. ఈ కరెక‌్షన్‌ కొనుగోలు అవకాశాలను అందిస్తున్నాయి.

ఎన్‌బీఎఫ్‌సీలకు గడ్డుకాలం పోయిందా?
ఎన్‌బీఎఫ్‌సీలలో బలమైన వృద్ధి నమోదయ్యింది. అయితే పరిస్థితులు ప్రతిలకూముగా మారాయి. వృద్ధి ఆందోళనలు కొనసాగే అవకాశముంది. నిధుల సమీకరణ ఆధారంగా వృద్ధి రీరేటింగ్‌ ఉంటుంది. 

ఐటీ రంగం
ఐటీ స్టాక్స్‌ బైబ్యాక్స్‌ వల్ల ఇప్పటికీ మద్దతు పొందుతున్నాయి. రూపాయి క్షీణత ప్రతిసారీ ఐటీ స్టాక్స్‌కు లబ్ది చేకూర్చదు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి కొత్త ఏరియాల నుంచి ఐటీ కంపెనీలకు విలువ చేకూరుతుంది. You may be interested

నాలుగు ఎన్‌బీఎఫ్‌సీలపై ఐఐఎఫ్‌ఎల్‌ బుల్లిష్‌

Thursday 27th September 2018

సాధారణంగా మార్కెట్లో అందరూ భయపడే వేళ కొనుగోళ్లకు మంచి తరుణమని నిపుణుల సూచిస్తుంటారు. అయితే నిప్పు లేనిదే పొగరాదని, అందువల్ల ఇటీవల నెగిటివ్‌ వార్తలతో క్రాష్‌ అయిన కంపెనీల జోలికి పోకపోవడం మంచిదని ఐఐఎఫ్‌ఎల్‌ సూచిస్తోంది. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీల్లో భారీగా పతనమైన కంపెనీల షేర్లను వదిలి బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఈక్విటాస్‌ షేర్లను ఎంచుకోవాలని సూచించింది. ఈ నాలుగూ బాగా స్థిరమైన ప్రదర్శన చూపే సత్తా

ఫెడ్‌ నిర్ణయం: వీటిని గమనించారా?

Thursday 27th September 2018

అమెరికా ఫెడరల్‌ రిజర్వు అంచనాలకు అనుగుణంగానే బుధవారం వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు (పావు శాతం) పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 2-2.5 శాతానికి చేరాయి. అలాగే డిసెంబర్‌లోనూ మరోదఫా రేట్ల పెంపు ఉండొచ్చని సాంకేతాలిచ్చింది. తన పాలసీ స్టేట్‌మెంట్‌ నుంచి ‘అకామోడేటివ్‌’ అనే పదాన్ని తొలగించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై వడ్డీ రేట్ల పెంపు ప్రభావం లేనంత వరకు రేట్లను క్రమంగా పెంచుకుంటూ వెళ్తామని పరోక్షంగా

Most from this category