News


కొటక్‌ మహీంద్రా, యాంబర్‌.. జోరు

Friday 31st January 2020
Markets_main1580448922.png-31367

52 వారాల గరిష్టాన్ని తాకిన యాంబర్‌
4 శాతం జంప్‌చేసిన కొటక్‌ మహీంద్రా

కొద్ది సమయంలో ఆర్థిక సర్వే వెలువడనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. ఉదయం 10.50 ప్రాంతంలో సెన్సెక్స్‌ 2 పాయింట్ల నామమాత్ర లాభంతో 40,915కు చేరగా.. నిఫ్టీ 11 పాయింట్లు తక్కువగా 12,025 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, వైట్‌గూడ్స్‌ కాంట్రాక్ట్‌ తయారీ కంపెనీ యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌
ప్రమోటర్ల వోటింగ్‌ హక్కులను 2020 మార్చివరకూ 20 శాతానికి పరిమితం చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ మందస్తు అనుమతిని ఇచ్చినట్లు వెల్లడించడంతో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. వోటింగ్‌ రైట్స్‌గల ఈక్విటీలో ప్రమోటర్ల వాటా 2020 ఏప్రిల్‌ నుంచి 15 శాతానికి పరిమితంకానున్నట్లు కొటక్‌ మహీంద్రా తెలియజేసింది. ఆర్‌బీఐ నుంచి తుది అనుమతి లభించాక ప్రమోటర్ల వాటాను 26 శాతానికి తగ్గించుకోవలసి ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేరు 4.2 శాతం జంప్‌చేసి రూ. 1696 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1729 వరకూ జంప్‌చేసింది. 

యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం ఆరు రెట్లు ఎగసి రూ. 25 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 52 శాతం జంప్‌చేసి రూ. 518 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం రెట్టింపై రూ. 52 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 1.6 శాతం బలపడి 6.6 శాతానికి చేరాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 2.4 శాతం పుంజుకుని రూ. 1534 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 9 శాతం దూసుకెళ్లి రూ. 1635కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం!

 



You may be interested

పీఎస్‌యూ షేర్లకు అమ్మకాల షాక్‌

Friday 31st January 2020

డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యంపై అంచనాల ఎఫెక్ట్‌ 8 శాతం పతనమైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ సాధారణ వార్షిక బడ్జెట్‌ విడుదలకు ముందురోజు ఉన్నట్టుండి ప్రభుత్వ రంగ కంపెనీల కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొన్ని కౌంటర్లలో భారీ అమ్మకాలకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ కంపెనీలతో కూడిన నిఫ్టీ సీపీఎస్‌ఈ ఇండెక్స్‌ దాదాపు 3 శాతం క్షీణించింది. వెరసి 2016 ఫిబ్రవరి తదుపరి కనిష్టానికి చేరింది. మధ్యాహ్నం 12 ప్రాంతంలో 1724 వద్ద ట్రేడవుతోంది. ఇంతక్రితం నిఫ్టీ

నేటి వార్తల్లోని షేర్లు

Friday 31st January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు హెచ్‌ఏఎల్‌: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో 15 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఖజానాకు రూ.4,000 కోట్లను సమకూర్చవచ్చని కేం‍ద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌: ఈ కంపెనీ డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో  కన్సాలిడేటెడ్‌ నికర లాభం 23 శాతం పెరిగి రూ.798.7 కోట్లకు చేరింది. యస్‌బ్యాంక్‌, సికాల్‌ లాజిస్టిక్స్‌: సికాల్‌ లాజిస్టిక్స్‌లోని 2.68 శాతం వాటా కలిగిన 15

Most from this category