News


ఆదాయాలపై కోటక్‌ ఈక్విటీస్‌ ప్రివ్యూ

Wednesday 10th July 2019
Markets_main1562752450.png-26956

ఇయర్‌ ఆన్‌ ఇయర్‌(వై ఓ వై) ప్రకారం ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1 త్రైమాసికంలో కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటిస్‌(కేఐఈ) నికర ఆదాయం 1.3 శాతంపెరగనుందని కేఐఈ అంచనా వేసింది. ఈ పెరుగుదలలో బ్యాంకింగ్‌ సెక్టార్‌ పాత్ర కీలకంగా ఉండనుందని తెలిపింది. ‘‘తక్కువ బేస్‌ కారణంగా బ్యాంకింగ్‌ సెక్టార్‌ అధిక ఆదాయవృద్ధిని ప్రకటించే అవకాశం ఉంది. బ్యాంకింగ్‌ సెక్టార్‌ను పక్కన పెడితే నికర ఆదాయంలో  6.7 శాతం(వై ఓ వై ఆదారంగా) తగ్గుదలను అంచనా వేశాం. క్యూఓక్యూ మందగమనంతో రుణాల వృద్ధి తగ్గినప్పటికి నిలకడైన కార్యచరణ ప్రదర్శన వలన బ్యాంకుల నికర ఆదాయం పెరగగలదు. దీనితో పాటు తక్కువ పరిమాణాలపై  రియలైజేషన్‌ను పెంచడంతో నిర్మణ రంగాల నికర ఆదాయం, ఎల్‌ అండ్‌ టీ నుంచే వచ్చే ఆర్డర్ల అమలును పెంచడంతో క్యాపిటల్‌ గూడ్స్‌ రంగంలో నికర ఆదాయం పెరగనుందని అంచనా వేస్తున్నాం’’ అని వివరించింది.  అంతేకాకుండా కొన్ని విభాగాలలో నికర ఆదాయం తగ్గనుందని తెలిపింది. ‘‘అమ్మకాల పరిమాణం తగ్గడంతో పాటు రాయితీలు పెరగడంతో ఆటోమొబైల్స్‌ నికర ఆదాయం తగ్గనుంది. రియలైజేషన్‌లు తగ్గడంతో లోహాలు, మైనింగ్‌ సెక్టార్‌లో, రిఫైనింగ్‌ మార్జిన్లు తగ్గడంతో ఆయిల్‌, గ్యాస్‌, వినియోగ ఇందనాల సెక్టార్‌లో నికర ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నాం’’ అని వివరించింది.  వై ఓ వై ప్రకారం బీఎస్‌ఈ 30 ఇండెక్స్‌ నికర ఆదాయం 13.2 శాతం, నిఫ్టీ 50 ఇండెక్స్‌ నికర ఆదాయం 1.3 శాతం పెరగనుందని అంచనా వేసింది. బీఎస్‌ఈ 30 ఈపీఎస్‌ ఆర్థిక సంవత్సరం 2020లో రూ.1,975 గా, 2021లో రూ. 2,353 గా ఉటుందని తెలిపింది. అదే విధంగా నిఫ్టీ 50 ఈపీఎస్‌ ఆర్థిక సంవత్సరం 2020లో రూ. 614, 2021లో రూ.725 గా అంచనా వేసింది. 


 



You may be interested

నష్టాల ముగింపు

Wednesday 10th July 2019

11500 దిగువకు నిఫ్టీ 174 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ ఒకరోజు విరామం తరువాత మార్కెట్లో మళ్లీ అమ్మకాల పర్వం కొనసాగింది. గత ట్రేడింగ్‌లో మిశ్రమంగా ముగిసిన సూచీలు బుధవారం భారీ నష్టాలను చవిచూసాయి. సెన్సెక్స్‌ 174 పాయింట్లు కోల్పోయి 38,557 వద్ద స్ధిరపడింది. నిఫ్టీ 57పాయింట్లను నష్టపోయి 11500 స్థాయి దిగువున 11,498.90 ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలు, పెరిగిన ముడిచమురు ధరలతో పాటు దేశీయ మార్కెట్లో బడ్జెట్‌ ప్రతిపాదన

టాటా గ్రూప్‌ షేర్ల పతనం

Wednesday 10th July 2019

5నెలల కనిష్టానికి టాటా మోటర్స్‌ షేర్లు 4.50శాతం పతనమైన టాటా స్టీల్‌ 5వ రోజూ కొనసాగుతున్న టాటా పవర్‌, టాటా ఎలాక్సీ షేర్ల పతనం టాటా గ్రూప్‌ కంపెనీ షేర్లు బుధవారం భారీగా నష్టపోయాయి. ఈ గ్రూప్‌నకు చెందిన టాటా మోటర్స్‌ షేర్లు 5నెలల కనిష్టానికి పతనమైంది. టాటా స్టీల్‌ షేర్లు 4.50శాతం నష్టపోయింది. టాటా ఎలక్సీ లిమిటెడ్‌, టాటా పవర్‌ షేర్లు వరుసగా ఐదో రోజూ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ గ్రూప్‌లో

Most from this category