News


రికార్డుస్థాయికి కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

Thursday 12th December 2019
Markets_main1576144329.png-30193

కోటక్‌ మహీంద్రా బ్యాంకు షేరు గురువారం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. నేడు ఈ బ్యాంకు షేరు రూ.1689.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రైవేట్‌ రంగ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతులో భాగంగా షేరు ఒక దశలో 1.75శాతం పెరిగి రూ.1714.75ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధరకు షేరుకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం.తద్వారా నేటి బ్యాంకింగ్‌ రంగ షేర్లలో జీవితకాల గరిష్టాన్ని అందుకున్న ఏకైక షేరుగా నిలిచింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు క్రితం ముగింపు(రూ.1686.05)తో పోలిస్తే 1.66శాతం లాభంతో రూ.1714.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1198.65, రూ. 1715.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

రెండోరోజూ అదే జోరు

Thursday 12th December 2019

11950 పైన ముగిసిన నిఫ్టీ  169  పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల జోరు రెండోరోజూ కొనసాగింది. సెన్సెక్స్‌ 169 పాయింట్లు పెరిగి 40582 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 11950పై 11,972 వద్ద ముగిసింది. రూపాయి బలపడటంతో ఒక్క ఐటీ రంగ షేర్లకు తప్ప మిగిలిన​అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్‌ షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్‌

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం అప్‌

Thursday 12th December 2019

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి బ్యాంకింగ్‌ రంగ షేర్ల జోరు కొనసాగుతుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 31,356.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు డిమాండ్‌ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ.., మిడ్‌సెషన్‌ కల్లా కొనుగోళ్ల జోరు పెరిగింది. దీంతో ఇండెక్స్‌ ఒక దశలో 1శాతం ర్యాలీ చేసి

Most from this category