News


రాబోయేది ఎఫ్‌ఎంసీజీ రాజ్యమే!

Wednesday 26th February 2020
Markets_main1582704906.png-32106

తర్వాతి బుల్‌రన్‌లో ఈ రంగమే ఛాంపియన్‌ అంటున్న నిపుణులు
వాల్యూ ఇన్వెస్టర్లలో ఎక్కువమందికి కన్జూమర్‌ స్టాకులపై మక్కువ ఎక్కువ. అటు బెంజిమన్‌ గ్రాహమ్‌ నుంచి ఇటు పీటర్‌ లించ్‌ వరకు అనేకమంది కన్జూమర్‌ షేర్లను ఇష్టపడ్డవారే! ఇవి ఎలాంటి ఒడిదుడకులనైనా తట్టుకుంటాయని, భారీ రుణభారాలుండవని, దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్‌ సైకిల్స్‌ ఉండవని నిపుణులు అంచనా వేస్తుంటారు. కానీ ఎక్కువశాతం ఈ స్టాకులు ప్రధాన మార్కెట్‌తో పోలిస్తే వెనుకబడేఉంటుంటాయి. కానీ ఈ ట్రెండ్‌ రివర్సవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ సూచీల ప్రైస్‌ నిష్పత్తి 2.5కు వచ్చింది. ఈ స్థాయికి నిష్పత్తి వచ్చినప్పుడల్లా వినిమయ స్టాకులు భారీ మద్దతు పొంది మంచి ర్యాలీ జరిపినట్లు గత చరిత్ర చెబుతోంది. ఈ స్థాయికి వచ్చిన ప్రతిసారీ ఈ నిష్పత్తి తిరిగి 2.9 స్థాయికి 3-7 నెలల్లో రీబౌండ్‌ కావడం జరుగుతోంది. 2017 మేలో ఈ నిష్పత్తి 2.5కు వచ్చింది. తిరిగి జూలై నాటికి 2.89కి పెరిగింది. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ నిష్పత్తి 2.5కు రావడం త్వరలో ఈ రంగంలో ర్యాలీ ఉంటుందనేందుకు సంకేతమని యాంటిక్‌ బ్రోకింగ్‌ అభిప్రాయపడింది. 

గతేడాది ప్రధాన సూచీ కన్నా ఎఫ్‌ఎంసీజీ సూచీ 13 శాతం వెనుకబడింది. గతేడేళ్లలో ఇంతగా వెనుకపడడం ఇదే తొలిసారి. అయితే మొత్తం పదేళ్ల చరిత్ర చూస్తే ప్రధాన సూచీ కన్నా వినిమయ స్టాక్‌ సూచీ దాదాపు ఏడు మార్లు మంచి లాభాలు ఇచ్చింది. ప్రస్తుతం పైన చెప్పిన నిష్పత్తి దిగిరావడంతో పాటు సీజనల్‌ కారణాలు కూడా వినిమయ స్టాకులకు మద్దతుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మార్చి ఏప్రిల్‌ కాలంలో గత పదేళ్లలో ఎఫ్‌ఎంసీజీ సూచీ దాదాపు 7 శాతం రాబడినివ్వగా, ఇదే సమయంలో నిఫ్టీ సరాసరిన 4.4 శాతం రాబడినిచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే త్వరలో జరిగే ర్యాలీకి ఎఫ్‌ఎంసీజీ స్టాకులు నాయకత్వం వహిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, టాటాగ్లోబల్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌, కోల్‌గేట్‌ షేర్లు ఈ సమయంలో మంచి రాబడులు ఇస్తుంటాయి. You may be interested

కరోనా ప్యాకేజ్‌...హంకాంగ్‌లో ఒక్కో పౌరుడికి 10,000 డాలర్లు

Wednesday 26th February 2020

హాంగ్‌కాంగ్‌ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో కరోనా రిలీప్‌ ఫండ్‌కు 15.4 బిలియన్‌ డాలర్లను కేటాయించింది. ఈ మేరకు బుధవారం హాంగ్‌ కాంగ్‌ ఫైనాన్సియల్‌ సెక్రెటరీ పాల్‌ చాన్‌ 18 ఏళ్లు లేదా 18 ఏళ్లు పైబడిన శాశ్వత నివాసులు ఒక్కోక్కరికి 10,000 హాంగ్‌కాంగ్‌ డాలర్లను (రూ.92,000)ఇస్తున్నట్లుగా ప్రకటించారు.కాగా ఈ ఏడాది ఆర్థిక వృద్ధి క్రితం సంవంత్సరంతో పోలిస్తే 1.2శాతం తగ్గి -1.5శాతం -0.5శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గత

ఈ రెండు షేర్లను కొనొచ్చు!

Wednesday 26th February 2020

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న కరోనా వైరస్‌ వ్యాధి భయాలు దేశీయ ఈక్విటీ మార్కెట్‌ను తాకడంతో ఈ వారంలో బెంచ్‌ మార్క్‌ సూచీలు వరుసగా మూడోరోజూ నష్టాల బాట పట్టాయి. బుధవారం నాటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒకదశలో సెన్సెక్‌ 39వేల మార్కును నిఫ్టీ 12వేల మార్కును కోల్పోయాయి. ఈ నేపథ్యంలో ఇండియానివేశ్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ సాంకేతిక నిపుణుడు మెహుల్‌ కొఠారీ స్వల్పకాలానికి(3నుంచి 4వారాలు) మూడు స్టాక్‌లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం

Most from this category