పతనానికి ప్రధాన కారణాలివే!
By Sakshi

దేశియ ఈక్విటీ మార్కెట్ల పతనం సోమవారం కూడా కొనసాగుతునే ఉంది. నిఫ్టీ కిలకమైన 10,850 స్థాయిని కాపాడుకోలేకపోయింది. ఆసియా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో పాటు, ట్రేడ్ వార్ భయాల వలన చైనా కరెన్సీ యువాన్ డాలర్ మారకంలో బలహీనపడడం ఇండియా మార్కెట్లపై ప్రభావం చూపింది. చైనా పీఎంఐ డేటా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని స్పష్టం చేయడం, గత వారం వెలువడిన ఫెడ్ సమావేశం ఫలితాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నాయి. వీటికి తోడుగా జమ్మూ-కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం రద్ధు చేయడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తను వహించారు. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికానికి గాను కార్పోరేట్ ఆదాయాలు కూడా బలహీనంగా ఉండడం మరింతగా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. మార్కెట్లను ప్రభావితం చేస్తున్న అంశాలు: కశ్మీరీ సమస్య: జమ్మూ-కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విడదీసింది. లడక్‌ను అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా, ఆర్టికల్ 370 ని రద్దు చేస్తు..జమ్మూ-కాశ్మీర్‌ను అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా విడదీసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ చట్టాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టగా పార్లమెంట్లో ఆమోదం లభించడం గమనర్హం. ఈ అంశంతో ఇన్వెస్టరు జాగ్రత్త వహించారు. 11 ఏళ్ల దిగువకు యువాన్: యుఎస్-చైనా ట్రేడ్ వార్ భయాల వలన చైనా కరెన్సీ యువాన్ డాలర్ మారకంలో సోమవారం 1 శాతం బలహీనపడి 11 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఇది ఈ ప్రాంతంలోని ఇతర కరెన్సీల అమ్మకాలకు కారణమయ్యిందని రాయిటర్స్ నివేదించింది. దీంతో ఇండియా రూపీ డాలర్ మారకంలో 80 పైసలు బలహీనపడి 70 మార్కు దిగువకు పడిపోయింది. రూపాయి పతనం కూడా విదేశీ ఇన్వెస్ట్మెంట్లకు అడ్డంకిగా మారింది. ఆదాయాలు తగ్గడం: కార్పొరేట్ల లాభాల్లో వృద్ధిలేకపోవడంతో నిఫ్టీ ఇపిఎస్(ఒక షేరుపై వచ్చే ఆదాయం) పడిపోయింది. ఇప్పటివరకు నిఫ్టీ కంపెనీల ఆదాయాలు (ఇండెక్స్ వెయిటేజీలో మూడింట రెండొంతుల) ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1లో కేవలం 5 శాతం మాత్రమే ఇపిఎస్ వృద్ధిని నమోదు చేశాయని ఎమ్కే గ్లోబల్ ఒక నోట్లో పేర్కొంది. విదేశి నిధుల ఔట్‌ఫ్లో: ఎఫ్‌పిఐ(ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పోర్టుపోలియో)లు విక్రయాలు తీవ్రతరం అయ్యాయి. ఎఫ్‌పిఐలు దేశీయ స్టాక్లను శుక్రవారం రూ .2,888 కోట్ల షేర్లను విక్రయించారు. జూలై నెలలో విదేశి ఇన్వెస్టర్లు రూ. 15,000 కోట్ల విలువ కలిగిన స్టాకులను విక్రయించారని కోటక్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. ‘బిగ్ బ్యాంగ్ సంస్కరణలు లేదా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే ఉద్దీపన చర్యలు బడ్జెట్లో ఉంటాయనుకున్నాం. కానీ దీనికి విరుద్ధంగా, ఆదాయపు పన్ను సర్‌చార్జి పెరుగుదల, పబ్లిక్ షేర్ హోల్డింగ్‌ను పెంచే ప్రతిపాదన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి’ అని ఈ బ్రోకరేజ్ తెలిపింది.
ఆసియా మార్కెట్లలలో అమ్మకాల వెల్లువ: అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆసియా మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. పౌర అశాంతి వలన హాంగ్‌కాంగ్ మార్కెట్ 3 శాతం మేర పతనమవ్వగా, యుఎస్-చైనా ట్రేడ్‌వార్ భయాలు జపాన్ ఎగుమతులను దెబ్బతీయడంతో జపాన్ మార్కెట్ నికాయ్ 2.6 శాతం పడిపోయింది. దక్షిణ కొరియా కొస్పి 2.41 శాతం, చైనా షాంఘై కాంపోసిట్ ఇండెక్స్ 0.8 శాతం మేర నష్టపోయాయి.
మధ్యాహ్నం 2.58 సమయానికి నిఫ్టీ 50 140.90 పాయింట్లు నష్టపోయి 10,856.45 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 442.92 పాయింట్లు పడిపోయి 36,675.31 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.
You may be interested
ఏడాదిన్నర కనిష్టానికి ఐటీసీ
Monday 5th August 2019ఐటీసీ షేర్లు సోమవారం ట్రేడింగ్ సెషన్స్‌లో ఏడాదిన్నర కనిష్టానికి పతనమయ్యాయి. తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేపోవడం, బ్రోకరేజ్ సంస్థలు ఐటీసీ షేర్లపై కొనుగోళ్ల టార్గెట్ ధరను తగ్గించడం ఇందుకు కారణమయ్యాయి. నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.265.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒకదశలో షేరు రూ.2.50శాతం నష్టపోయి రూ.257.60ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.
అమ్మకాల ఒత్తిడిలో రియల్టీ షేర్లు
Monday 5th August 2019మార్కెట్ పతనంతో భాగంగా రియల్టీ రంగ షేర్లు సోమవారం ట్రేడింగ్ కుప్పకూలాయి. ఎన్ఎస్ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ నేడు బీఎస్ఈఓలో 3శాతం క్షీణించింది. నేడు ఇండెక్స్‌లో 258.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి ఈ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్ ఒక దశలో 3శాతం పతనమైన 253.80 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:00లకు ఇండెక్స్