నాలుగు అంశాలే నడిపిస్తాయి!
By D Sayee Pramodh

దేశీయ మార్కెట్‌కు ఇవే కీలకం
కేంద్రంలో స్థిర ప్రభుత్వం ఏర్పడడంతో మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్‌గా మారింది. ఏడాది సగానికి గడిచిపోతున్న తరుణంలో ఇకపై సూచీల గమనాన్ని కీలకమైన నాలుగు అంశాలు నిర్ధారిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
1. ఆర్బీఐ రెపోరేటు: ఇప్పటికే ఆర్బీఐ రెపోరేటును 5.75 శాతానికి తగ్గించింది. వృద్ధి మందగమనం, వినిమయం తగ్గడమే రేట్లను తగ్గించేందుకు కారణాలు. రేట్‌కట్‌తో పలు రుణాలు సులభంగా దొరికి ఇన్వెస్టర్ల వినిమయం జోరందుకుంటుందని అంచనా
2. క్రూడ్ ఆయిల్ ధర: గతేడాది క్రూడ్ ధరలు పెరగడంతో ఈక్విటీలు పేలవ ప్రదర్శన చూపాయి. అయితే తాజాగా అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో క్రూడ్ధరలు దిగివస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే ఈ ఏడాది ఈక్విటీలు పాజిటివ్‌గా స్పందిస్తాయి. ఒకవేళ ఉద్రిక్తతలు పెరిగి ధరల్లో పెరుగుదల వస్తే ఈక్విటీలు ఇబ్బంది పడతాయి.
3. డెట్‌మార్కెట్ ప్రదర్శన: దేశీయ రుణమార్కెట్ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం తర్వాత ఇబ్బందుల్లో పడింది. పదేళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్ రెండేళ్ల తర్వాత 7 శాతం దిగువకు వచ్చింది. ఏఎంసీలు సమయానికి ఎఫ్ఎంపీ చెల్లింపులు చేయకపోవడం కూడా డెట్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ సంక్షోభం అంటువ్యాధిలా ఎకానమీలో వ్యాపిస్తుందన్న భయాలున్నాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లలో రిటైలర్లు పెట్టుబడులకు భయపడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోతే ఈక్విటీలు ఎదురుదెబ్బ తినకతప్పదు.
4. బడ్జెట్: కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో చాలా ఆశలున్నాయి. ఈ ఆశలను బడ్జెట్ అందుకోలేకపోతే సెంటిమెంట్ దెబ్బతింటుంది. బడ్జెట్లో మందగమన నివారణకు తగిన చర్యలు ఉంటే ఈక్విటీల్లో హర్షం వస్తుంది. అదేవిధంగా బడ్జెట్లో పేర్కొన్న లోటు టార్గెట్లను దాటకుండా జాగ్రత్త పడకపోతే ఈక్విటీ మార్కెట్లపై నెగిటివ్ ప్రభావం పడుతుంది.
You may be interested
పదేళ్ల తర్వాత లాభాల్లోకి మొబిక్విక్!
Sunday 16th June 2019పేటీఎం మాదిరే మొబైల్ రీచార్జ్ సేవలతో ఆరంభించి, ఆ తర్వాత పేమెంట్ సేవలు, బీమా, ఫండ్స్ ఉత్పత్తులను విక్రయించే రూపంలోకి పరిణామం చెందిన మొబిక్విక్ సంస్థ, 2009లో కార్యకలాపాలు ఆరంభించగా, 2019 మార్చి త్రైమాసికం ఫలితాలతో తొలిసారి లాభాలను ప్రకటించోబోతోంది. అలాగే, 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తిగా లాభాల ప్రయాణం చేయనుంది. త్వరలో ఐపీవోకి రావవాలనుకుంటున్న ఈ సంస్థ దాని కంటే ముందుగా మొబిక్విక్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు
ర్యాలీ..పతనం.. రెండూ ఇష్టం లేవా?
Saturday 15th June 2019ఈ వారం కూడా మార్కెట్ స్వల్పరేంజ్‌లోనే కదలాడాయి. ముఖ్యంగా ఎన్బీఎఫ్సీ రంగంలో తీవ్ర కదలికలు నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ రంగంలో ఇబ్బందులు చివరకు వచ్చినట్లుగా కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. రంగాల వారీగా చూస్తే వారమంతా మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే కదలాడాయి. అయితే మార్కెట్ అంతరదృష్టి నెగిటివ్‌గా కనిపిస్తోంది. రంగాల్లో ఎఫ్ఎంసీజీ కన్సాలిడేషన్ దశలో, ఫార్మా డౌన్‌ట్రెండ్‌లో, ఐటీ టాపింగ్ దశలో, మెటల్స్ బాటమ్ అవుట్లో, చమురు మరియు