తొందరొద్దు.. చేతిలో కొంత నగదు ఉంచుకోండి: దీపక్ షెనాయ్
By Sakshi

మార్కెట్లకు ఇదే బోటమ్ (కనిష్టం)గా భావించి కొనుగోళ్లకు దిగొద్దని క్యాపిటల్ మైండ్ వ్యవస్థాపకుడు దీపక్ షెనాయ్ సూచించారు. రానున్న నెలల్లో ఇన్వెస్టర్లకు బోలెడన్ని పెట్టుబడుల అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. చేతిలో నగదు ఉంచుకునేందుకు వెనుకాడవద్దని, అలాగే, పోర్ట్‌ఫోలియోలో కొన్ని స్టాక్స్‌ను విక్రయించి నగదు నిల్వలతో ఉండడం మంచిదేనని దీపక్ షెనాయ్ సూచించారు. ఆందోళనతో జరుగుతున్న విక్రయాలతో కొన్ని స్టాక్స్ చాలా తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తాయని, కోరుకున్న స్టాక్‌ను చాలా తక్కువ ధరల వద్దే కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఆర్థిక రంగంలో మందగమనం అన్నది ప్రభుత్వం వృద్ధిని ప్రోత్సహించే విధానాలను తీసుకురాలేకపోవడం వల్లేనన్నారు. వృద్ధి నిదానించిన దశలో ఉన్నామని లేదా మందగమనంలో ఉన్నామని అభిప్రాయపడ్డారు. దీంతో ఎన్నో స్టాక్స్‌కు ఇంతకంటే ఎక్కువ డౌన్సైడ్కు అవకాశం ఉందన్నారు. కనుక తగిన పోర్ట్‌ఫోలియో రూపొందించుకోవడం, కొంత మేర నగదును కలిగి ఉండడం లేదా పోర్ట్‌ఫోలియోను కొంత నగదుగా మార్చుకోవడం చేయాలని సూచించారు. దీంతో మార్కెట్లు భారీగా పడిపోయిన సందర్భంలో కంపెనీల్లో వాటాలను పెంచుకోవచ్చన్నారు. మార్కెట్లకు ఇదే కనిష్టమని భావించి కొనుగోళ్లకు దిగకుండా, కనీసం కొంత మేర నగదు నిల్వలను ఉంచుకోవాలన్నారు. నగదు నిల్వలు కొందరికి 5-10 శాతం, కొందరికి 40-50 శాతంగా ఉంచుకోచ్చన్నారు. తమకు సౌకర్యవంతమైన స్థాయిలో నగదును కలిగి ఉండాలని సూచించారు. బ్యారెల్‌తో బాతులను వేటాడుతుంటే వేచి చూడక్కర్లేదని, ఆ తరహా అవకాశాలు రానున్న కాలంలో అందుబాటులోకి వస్తాయన్నారు. అయితే, నగదు నిల్వలు పెంచుకునేందుకు ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో ఎక్కడ విక్రయాలు చేయవచ్చన్న దానికి సూచనలు కూడా చేశారు. గతంలో 25 శాతం చేసిన కేటాయింపులు, కొన్ని స్టాక్స్ వ్యాల్యూషన్ పెరిగిపోవడం వల్ల అవి ఇప్పుడు 40 శాతానికి చేరి ఉండొచ్చని, తిరిగి 25 శాతానికి వాటిల్లో వాటాలు తగ్గించుకోవచ్చని షెనాయ్ పేర్కొన్నారు. పోర్ట్‌ఫోలియో నిర్మాణం చాలా క్లిష్టమైనదని, అందరికీ ఒకటే సైజు సరిపోదన్నారు. ఇన్వెస్టర్ వారి వారి లక్ష్యాలు, కాల వ్యవధులకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.
You may be interested
ప్రమోటర్ల వాటాల తనఖాల్లో భారీ మార్పులు
Tuesday 30th July 2019వాటాలను తనఖా ఉంచి రుణాలు తీసుకుంటే ఏం జరుగుతుంది...? మార్కెట్ పతనాల్లో పెద్ద ఉపద్రవమే వచ్చి పడుతుంది. తాజా మార్కెట్ క్రాష్‌లో ఇది ఇన్వెస్టర్లతోపాటు ప్రమోటర్లకూ అవగతం అవుతూనే ఉంది. షేర్లను తనఖా ఉంచి రుణాలు తీసుకున్న వారు, హామీగా ఉంచిన షేర్ల ధరల విలువ పడిపోతుంటే... తిరిగి ఆ మేర అదనపు విలువకు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే రుణమిచ్చిన సంస్థలు వాటాలను నిలువునా మార్కెట్లో విక్రయించేస్తాయి. దీంతో
యాక్సిస్ బ్యాంక్ క్యూ1... అంచనాలు మిస్..!
Tuesday 30th July 2019ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికపు అంచనాలను ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు అందుకోలేకపోయింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంకు ఈ క్యూ1లో రూ.1,370 కోట్ల నికరలాబాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ1లో కంపెనీ ఆర్జించిన రూ.701 కోట్ల నికరలాభాంతో పోలిస్తే ఇది 95శాతం అధికం. అయితే విశ్లేషకులు మాత్రం బ్యాంకు ఈ త్రైమాసికంలో రూ.1,850 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనావేశారు. నికర వడ్డీ ఆదాయం13శాతం వృద్ధి