News


కార్వీ ట్రేడింగ్‌ లైసెన్స్ సస్పెన్షన్‌

Monday 2nd December 2019
Markets_main1575276726.png-30003

 కార్వీ స్టాక్‌ బ్రోరింగ్‌ లిమిటెడ్‌ తన సొంత ఖాతాదారులకు చెందిన రూ.2300 కోట్ల ధనాన్ని దుర్వినియోగంపై ఎక్చ్సేంజీలు ఘాటుగా స్పందించాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు సోమవారం కార్వీ ట్రేడింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేశాయి. సెబీ నియమాలను ఉల్లఘించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్చ్సేంజీలు తెలిపాయి. ఈక్విటీ, డెరివేటివ్స్‌, కమోడిటీలకు కూడా ఈ రద్దు వర్తిస్తుంది. తదుపరి ఎంసీఎక్స్‌ కూడా కార్వీ సభ్యత్వాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నవంబర్‌ 22న ఖాతాదారుల సెక్యూరిటీలను ఈ బ్రోకరేజి సంస్థ ఇతర అవసరాలకు వినియోగించి దుర్వినియోగం చేసినట్లు సెబీ గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా 1096 కోట్ల రూపాయలను తన గ్రూప్‌ కంపెనీ కార్వీ రియాల్టీకి 2016 నుంచి 2019 వరకు బదిలీ చేసిందని గుర్తించింది. అంతేకాకుండా తొమ్మిది మంది క్లయింట్లకు చెందిన సెక్యూరిటీలను విక్రయించినట్లు, ఆరుగురికి సంబంధించిన సెక్యూరిటీలను బదిలీ చేసినట్లు సెబీ గుర్తించింది. ఇప్పటికే సెబీ కొత్త క్లైయింట్లను తీసుకోకుండా ఆంక్షలు విధించడంతో పాటు ఖాతాదారులకు సంబంధిచిన పవర్‌ ఆఫ్‌ అటార్నీపై కూడా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 



You may be interested

32,000పైకి వెళ్లి, కిందకు దిగిన బ్యాంక్‌ నిఫ్టీ

Monday 2nd December 2019

సూచీలు ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం మిడ్‌సెషన్‌ కల్లా 32,000 మార్కును కోల్పోయింది. నేడు ఈ ఇండెక్స్‌ క్రితం ముగింపు(31946.10)తో పోలిస్తే 62 పాయింట్ల లాభంతో 32వేల పైన ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం సెషన్‌లో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో 178 పాయింట్లు(0.25శాతం) పెరిగి 32024.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అనంతరం మార్కెట్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడికి కారణంగా

తగ్గిన పసిడి.!

Monday 2nd December 2019

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో  6డాలర్లు నష్టపోయింది. నేటి ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 6డాలర్లు నష్టంతో 1,464 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం, చైనా ఫ్యాకర్టీ సెక్టార్‌ గణాంకాలు మార్కెట్‌ అంచనాలను మించిన నమోదుకావడం పసిడి పతనానికి కారణమయ్యాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక దేశంగా పిలువబడే చైనా నవంబర్‌ ఫ్యాక్టరీ యాక్టివిటీ గణాంకాలు

Most from this category