News


పాక్‌ మార్కెట్‌ 1500 పాయింట్లు క్రాష్‌

Wednesday 27th February 2019
Markets_main1551256156.png-24359

భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్ పాకిస్థాన్‌ స్టాక్‌ మార్కెట్‌ను భారీగా అతలాకుతలం చేశాయి. ఈ దేశ స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌ ప్రధాన సూచీ కరాచీ 100 నేటి ట్రేడింగ్‌లో ఏకంగా 1500 పాయింట్లను నష్టపోయింది. పుల్వామా ఉగ్రదాడి ప్రతీకారంలో భాగంగా బుధవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని బాలాకోట్, ముజఫరాబాద్, చకోటీ ప్రాంతాల్లో భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ ఘటనలో సుమారు 350 మంది టెర్రరిస్టులు చనిపోయినట్టు అంచనా. దీంతో కరాచీ 100 సూచీ నిన్నటి ట్రేడింగ్‌లో 785 పాయింట్లు నష్టపోయి 38,821 వద్ద ముగిశాయి. ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో నేడు పాక్‌ ఇండెక్స్‌ మరింత నష్టాల బాట పట్టింది. ఇంట్రాడేలో 1500 పాయింట్లును నష్టపోయి 37321 స్థాయికి చేరుకుంది. జూలై 11 2017 తరువాత పాకిస్థాన్‌ మార్కెట్‌ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(38,821)తో పోలిస్తే 1,476 పాయింట్ల నష్టంతో 37,345 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫిబ్రవరి 14న ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు పాక్‌ మార్కెట్‌ 6 శాతం నష్టపోయిగా భారత్‌ ప్రతిఘటన జరిగిన రెండు రోజుల్లో ఏకంగా 2285 పాయింట్లను కోల్పోయింది.



You may be interested

విప్రోకు డౌన్‌గ్రేడ్‌ షాక్‌

Wednesday 27th February 2019

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ విప్రో షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 3.50 శాతం నష్టపోయాయి. ఈ కంపెనీ షేరును గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం క్రెడిట్‌ సూసీ డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో విప్రో షేర్లు రూ.380.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రానున్న రోజుల్లో కంపెనీ మార్జిన్లతో పాటు ఆదాయాలు సైతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ విశ్లేషకులు అంచనావేశారు. దీంతో బ్రోకరేజ్‌ సంస్థ షేరు రేటింగ్‌ను ‘‘అవుట్‌ ఫెర్మామింగ్‌ నుంచి

భారత్‌ భూభాగంలోకి పాక్‌ జెట్‌..మార్కెట్‌ వెనక్కి!

Wednesday 27th February 2019

గరిష్టస్థాయిల నుంచి వెనక్కి... జమ్మూ&కాశ్మీర్‌ సరిహద్దు ప్రాంతంలోని నౌషెరా సెక్టార్‌ భారత గగనతలంలోకి పాకిస్థాన్‌ జెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు చొచ్చుకొచ్చే ప్రయత్నాలను భారత వాయుసేవ తిప్పికొట్టిందని పీటీఐ వార్తలు వెలువడ్డా‍యి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చని ఆందోళనతో ఇన్వెస్టర్లు మార్కెట్‌లోంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా సూచీలు గరిష్టస్థాయిల నుంచి వేగంగా వెనక్కివస్తున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో దాదాపు 400 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ 300 పాయింట్లను, అలాగే 100 పాయింట్లు

Most from this category