News


జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ జూమ్‌

Tuesday 18th February 2020
Markets_main1582003989.png-31887

నష్టాల మార్కెట్లోనూ షేరు  5 శాతం ప్లస్‌
జీఎంఆర్‌ కమలంగ ఎనర్జీ(జీఈఎల్‌)లో పూర్తి వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో ప్రయివేట్‌ రంగ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ షేరు లాభాలతో కళకళలాడుతోంది. ఉదయం 10.45 ప్రాంతంలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4.5 శాతం జంప్‌చేసి రూ. 66 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 68.4 వరకూ ఎగసింది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కంపెనీలో ప్రమోటర్లకు 74.89 శాతం వాటా ఉంది.


100 శాతం వాటా 
జీఈఎల్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 5321 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. అనుబంధ సంస్థ జీకేఈఎల్‌ ద్వారా ఒడిషాలో 1050 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంటును జీఈఎల్‌ నిర్వహిస్తోంది. ఈ కొనుగోలు తదుపరి జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ మొత్తం విద్యుదుత్పాదన స్థాపిత సామర్థ్యం 5609 మెగావాట్లకు చేరనుంది. తద్వారా దేశ తూర్పు ప్రాంతం‍లోనూ కార్యకలాపాలు విస్తరించనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ  పేర్కొంది. 
బయ్‌ రేటింగ్‌
జీఈఎల్‌లో 100 శాతం వాటా కొనుగోలు నేపథ్యంలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేరు కొనుగోలుకి విదేశీ రీసెర్చ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సిఫారసు చేసింది. రూ. 85 టార్గెట్‌ ధరను ప్రకటించింది. రానున్న మూడు- ఐదేళ్ల కాలంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపునకు పెంచుకునే బాటలో కంపెనీ సాగుతున్నట్లు ఈ సందర్భంగా సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. రీప్లేస్‌మెంట్‌ వ్యయాలతో పోలిస్తే కమలంగలో వాటాను 20 శాతం తక్కువకే సొంతం చేసుకున్నట్లు అభిప్రాయపడింది. తద్వారా లాభాల్లో వృద్ధిని సాధించనున్నట్లు అంచనా వేసింది.You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 18th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు వొడాఫోన్‌ఐడియా: రూ.2500 కోట్లు ఏజీఆర్‌ బకాయిలు చెల్లించన వొడాఫోన్‌ఐడియా కంపెనీ ఈ వారంతంలోపు మరో రూ.1000 కోట్లు కట్టడానికి బోర్డు అనుమతించిందని వెల్లడించిం‍ది. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌:  ముంబై కేంద్రంగా పనిచేస్తున్న గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌.. రైల్వే ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి భూమిని కొనుగోలు చేయనుంది. దీనిలో భాగంగా ఢిల్లీలోని అశోక్‌ విహార్‌ ప్రాంతంలో ఉన్న 26.58 ఎకరాల భూమిని రూ.1,359 కోట్లకు

ఎంఏసీడీ ప్రకారం ఈ షేర్లలో బుల్లిష్‌ సంకేతాలు!

Tuesday 18th February 2020

సోమవారం ముగింపు ప్రకారం దేశీయ సూచీల్లో  24 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ముత్తూట్‌ ఫైనాన్స్‌; టొరెంట్‌ పవర్‌, బీజీఆర్‌ ఎనర్జీ, లుపిన్‌, మయూర్‌ యూనికోటర్స్‌, గ్రీవ్స్‌ కాటన్‌, ఏసియన్‌ హోటల్స్‌-వెస్ట్‌, నీల్‌కమల్‌, బ్లుడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, టీటీకే ప్రెస్టేజ్‌, శక్తి సుగర్స్‌, హుమ్‌టమకీ పీపీఎల్‌

Most from this category