News


2020లో ఆర్థిక సంక్షోభం

Friday 14th September 2018
Markets_main1536920588.png-20255

  • జేపీ మోర్గాన్‌ అంచనా

దశాబ్ద కాలం కిందటి లెహ్‌మాన్‌ బ్రదర్స్‌ సంక్షోభం గుర్తుందా? అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు పేకమేడళ్ల కూలిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు కకావికలం అయ్యాయి. అలనాటి సంక్షోభ ఛాయలు మళ్లీ కనిపిస్తున్నాయని, అప్పటి పరిస్థితుల ఆధారంగా చూస్తే 2020లో మరోమారు ఆర్థిక సంక్షోభం రావొచ్చని అంచనా వేస్తోంది దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ జేపీ మోర్గాన్‌ చేజ్‌ అండ్‌ కో. ఇక్కడ మంచి విషయం ఏంటంటే.. గతంలో మాదిరిగా భయానక వాతావరణం ఉండకపోవచ్చని సంస్థ అనలిస్ట్‌లు పేర్కొంటున్నారు. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత స్టాక్‌ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గిందన్నారు. మళ్లీ ఆర్థిక సంక్షోభం వస్తే అప్పుడు ఈ లిక్విడిటీ పెరుగుతుందా? లేక మరింత తగ్గుతుందా? అని అంచనా వేయడం కష్టమని, ఇది చెడు వార్త అని తెలిపారు. 
ఆర్థిక వ్యవస్థ విస్తరణ, తదుపరి మాంద్యం సంభావ్య వ్యవధి, రుణాలు, ఆస్తి ధర విలువ, సంక్షోభానికి ముందు సడలింపులు, ఆర్థిక సంస్కరణలు వంటి అంశాల ఆధారంగా మాంద్యం ఫలితాలుంటాయని పేర్కొంది. ఆర్థిక సంక్షోభం వస్తే..
-అమెరికా స్టాక్‌ మార్కెట్‌ దాదాపు 20 శాతం పతనమౌతుంది.
-అమెరికా కార్పొరేట్‌ బాండ్‌ ఈల్డ్‌ ప్రీమియం దాదాపు 1.15 శాతం పాయింట్లు పెరుగుతాయి.
-ఎనర్జీ ధరలు 35 శాతం తగ్గుతాయి.బేస్‌ మెటల్స్‌ ధరలు 29 శాతం క్షీణిస్తాయి.
-ఎమర్జింగ్‌ మార్కెట్‌ స్టాక్స్‌ 48 శాతంమేర పతనమౌతాయి. వర్ధమాన దేశాల కరెన్సీలు 14.4 శాతంమేర క్షీణిస్తాయి. 

2008 మాంద్యంలో ఎస్‌అండ్‌పీ 500 తన గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 54 శాతంమర పతనమౌందని జేపీ మోర్గాన్‌ తెలిపింది. ప్రస్తుతం ఇండెక్స్‌ ఫండ్స్‌, ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌, క్వాంటిటేటివ్‌ ట్రేడింగ్‌ స్ట్రాటజీస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంది. ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఇన్వెస్టర్లు యాక్టివ్‌ అసెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు దూరంగా వెళ్తున్నారని తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీలు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నా కూడా ఇన్వెస్టర్లు వీటిల్లో ఇన్వెస్ట్‌చేయడం లేదని, ఇండెక్స్‌ ఫండ్స్‌/ఈటీఎఫ్‌లవైపు వెళ్తున్నారని పేర్కొంది. అందువల్ల భవిష్యత్‌లో స్టాక్‌ మార్కెట్‌కు పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించింది. యాక్టివ్‌ నుంచి పాసివ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌కు మారడం, ప్రత్యేకించి యాక్టివ్‌ వ్యాల్యు ఇన్వెస్టర్ల సంఖ్య తగ్గిపోవడం వల్ల మార్కెట్‌ భారీగా పతనమైనప్పుడు, ఆ క్షీణతను అడ్డుకొని, మళ్లీ పుంజుకునే సత్తా తగ్గిందని పేర్కొంది. వర్ధమాన మార్కెట్లు ఇటీవల కాలంలో కొంత కరెక‌్షన్‌కు గురయ్యాయని, అందువల్ల సంక్షోభం వచ్చినప్పుడు ఇవి తక్కువగా పడతాయని తెలిపింది. ఇకపోతే రానున్న ఆర్థిక సంక్షోభం ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం కష్టమని, ఎక్కువ కాలం కొనసాగితే మార్కెట్లు కోలుకోలేవని నొమురా పేర్కొంది. You may be interested

11500 పైన నిఫ్టీ

Friday 14th September 2018

38వేల పైన సెన్సెక్స్‌ రాణించిన బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా షేర్లు మార్కెట్‌  వారంతపు రోజైన శుక్రవారం లాభంతో ముగిసింది. రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల దిగిరావడంతో పాటు టోకు ద్రవ్యోల్బణ సూచీ 4నెలల కనిష్టానికి చేరుకుందనే వార్తలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. బ్యాంకింగ్‌, అటోమొబైల్‌, మెటల్‌, ఫార్మా రంగ షేర్లలో కొనుగోలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 38వేల స్థాయిని, నిఫ్టీ 11500 మార్కును అందుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 373 పాయింట్ల లాభంతో 38090

బ్యాంక్‌ చీఫ్‌కు మార్జిన్‌ కాల్‌..

Friday 14th September 2018

2 లక్షల షేర్లు అమ్మేసిన ఫెడరల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అయిన శ్యామ్‌ శ్రీనివాసన్‌ షేర్లను ఫెడరల్‌ బ్యాంక్‌ విక్రయించింది. బ్యాంకులు షేర్లను తనఖా పెట్టుకొని రుణాలను అందిస్తుంటాయి. ఈ విధంగానే శ్యామ్‌ శ్రీనివాసన్‌ తన ఈసాప్స్‌ను ఫెడరల్‌ బ్యాంక్‌లో తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. షేర్ల విలువ తగ్గినప్పుడు సదురు బ్యాంక్‌.. కొంత మార్జిన్‌ చెల్లించాలని కోరుతుంది. మార్జిన్‌ చెల్లిస్తే ఈ స్టాక్స్‌ను అలాగే

Most from this category