News


భారత్‌లో వాల్యూషన్లు అధికం: జేపీ మోర్గాన్‌

Friday 24th January 2020
Markets_main1579857933.png-31172

ఇతర వర్ధమాన మార్కెట్లపై  ఓవర్‌వెయిట్‌!
గతేడాది వర్దమాన మార్కెట్ల(ఈఎం)ను నడిపించి ఎర్నింగ్స్‌ బలం ఈ ఏడాది కూడా కొనసాగుతుందని జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ అంచనా వేసింది. ఎస్‌అండ్‌పీ కంపెనీల్లో దాదాపు 80 శాతం కంపెనీలు అంచనాలను మించిన ఫలితాలు ఇస్తున్నాయని, గత 30ఏళ్లలో ఈ స్థాయి ప్రదర్శన చూడలేదని జేపీ మోర్గాన్‌ అనలిస్టు జేమ్స్‌ సల్లివాన్‌ చెప్పారు. ఈ బలంతో ఈక్విటీ మార్కెట్ల పరుగు కొనసాగుతుందన్నారు. వాల్యూ స్టాకుల్లోకి పెట్టుబడులు పెరగడం మరింతగా పెరుగుతుందని చెప్పారు. ఈవిధంగా వాల్యూస్టాకుల వైపు పెట్టుబడుల మొగ్గు పెరగడం ఈఎం ఈక్విటీలకు చాలా మంచిదని విశ్లేషించారు. అందువల్ల అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్ల కన్నా వర్ధమాన మార్కెట్లపై తాము ఎక్కువ ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు తెలిపారు. యూఎస్‌ ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్లతో పోలిస్తే ఈఎం మార్కెట్ల మధ్య గ్రోత్‌గ్యాప్‌ తగ్గుతోందన్నారు. చైనా లాంటి దేశాల ఎకనమిక్‌ డేటా పురోగామి పథంలో ఉందని, డిమాండ్‌ పెరుగుతున్న సంకేతాలున్నాయని సల్లివాన్‌ చెప్పారు. 
భారత్‌ విషయానికి వస్తే కేవలం ఏడాదికేడాది జీడీపీ గణాంకాలతో పోలిస్తే పప్పులో కాలేసినట్లేనని, త్రైమాసికానంతర త్రైమాసిక గణాంకాలు పరిశీలిస్తే బాటమింగ్‌అవుట్‌ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయని చెప్పారు. గత చరిత్ర పరిశీలించినా వర్దమాన మార్కెట్లే అభివృద్ది చెందిన మార్కెట్లకన్నా ఎక్కువ వేగంగా వృద్ధి చెందినట్లు గమనించవచ్చన్నారు. అందువల్ల ఈఎంల్లోకి అధిక నిధులు వస్తుంటాయన్నారు. అయితే ఇండియాపై మాత్రం ఇంకా ఓవర్‌వెయిట్‌గా లేమని చెప్పారు. ఇండియాలో వాల్యూషన్లు ఎక్కువగా ఉన్నాయని, ఎఫ్‌పీఐల పెట్టుబడులు అధికంగా ఉన్నాయని చెప్పారు. అందువల్ల ఇండియా మార్కెట్ల పరుగులు కొనసాగుతాయని నమ్మకంగా చెప్పలేమన్నారు. అయితే రంగాలవారీగా మంచి స్టాకులు ఎంచుకోవచ్చని సూచించారు. దివాలా చట్టం తదితర సంస్కరణల నేపథ్యంలో ఫైనాన్షియల్‌ రంగ స్టాకులపై పాజిటివ్‌గా ఉన్నామని చెప్పారు. వీటితో పాటు యుటిలిటీస్‌, మెటీరియల్స్‌ రంగాలపై కూడా బుల్లిష్‌గా ఉన్నామని, టెలికంపై మాత్రం అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారు. 



You may be interested

Q3 జోష్‌- ఈ 3 మిడ్‌ క్యాప్స్‌ జోరు

Friday 24th January 2020

వరుసగా రెండో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 272 పాయింట్లు జంప్‌చేసి 41,658ను తాకగా.. నిఫ్టీ 84 పాయింట్ల ఎగసి 12,264 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మూడు మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఈఐహెచ్‌ అసోసియేటెడ్‌ హోటల్స్‌, అతుల్‌ లిమిటెడ్‌, వెస్ట్‌లైఫ్‌

అల్ట్రాటెక్‌ నికర లాభం హైజంప్‌

Friday 24th January 2020

మొత్తం ఆదాయం ఫ్లాట్‌ షేరు 1.5 శాతం ప్లస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 49 శాతం ఎగసి రూ. 643 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన గతేడాది(2018-19) క్యూ3లో రూ. 433 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 9982 కోట్లకు చేరింది. ఈ ఏడాది

Most from this category