News


సుప్రీం తీర్పుతో జైప్రకాష్‌ ఆసోసియేట్స్‌ జూమ్‌

Friday 13th October 2017
Markets_main1507888966.png-9902

ముంబై:- జైప్రకాష్‌ ఆసోసియేట్స్‌ షేరు శుక్రవారం బీఎస్‌ఈ ఇంట్రాడేలో దాదాపు 6శాతానికి పైగా లాభపడింది. గతంలో సుప్రీం కోర్టు ఒక దివాలా కేసులో అక్టోబర్‌ 27నాటికి రిజిస్ట్రీ వద్ద రూ.2,000 కోట్లు డిపాజిట్‌ చేయమని జేపీ అసోసియేట్స్‌ను ఆదేశించింది. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థ జైపీఅసోసియేట్స్‌కు అనుబంధ సంస్థ.  డిపాజిట్‌ డబ్బు చెల్లించడానికి జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన గౌతమి ఎక్స్‌ప్రెస్‌ హైవేలో కొంత వాటాను విక్రయించడానికి అనుమతులు కోరుతూ జైపీ అసోసియేట్స్‌ పిటిషన్‌ ధాఖలు చేసింది. నేడు ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వాటా విక్రయించేందుకు అనుమతినిస్తూ తీర్పు వెల్లడించింది. తీర్పు అనుకూలంగా రావడంతో నేటి బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో  జైప్రకాష్‌ ఆసోసియేట్స్‌ దాదాపు 6శాతానికి పైగా లాభపడి రూ.20.25 ఇంట్రాడే గరిష్టస్థాయిని తాకింది. మార్కెట్‌ ముగిసే సమయానికి షేరు 3శాతం లాభంతో రూ.20ల వద్ద ముగిసింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.6.71లు, రూ.30.71లుగా ఉన్నాయి.



You may be interested

రియల్టీ కంపెనీల ఫలితాలు ఇలా ఉండొచ్చు...

Friday 13th October 2017

సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి రియల్టీ రంగానికి చెందిన కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంటోంది. ముగింపు దశలో ఉన్న ప్రాజెక్టులపై అధిక వ్యయాల భారం, పండుగల ఆఫర్లతో ధరల తగ్గింపుల కారణంగా లాభాలపై ప్రభావం పడుతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. అధిక రుణాలతో వడ్డీ చెల్లింపుల రూపంలో లాభాలు తగ్గుతాయన్నది సంస్థ విశ్లేషణ. ఫలితాలకు ముందు రియల్టీ రంగ కంపెనీలకు సంబంధించి అంచనాలతో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

భారతీ ఎయిర్‌టెల్‌ షేరుపై బ్రోకింగ్‌ హౌస్‌ల రేటింగ్స్‌

Friday 13th October 2017

ముంబై: రుణభారంతో కుంగుతున్న టాటా టెలీసర్వీసెస్‌ మొబైల్ వ్యాపార కార్యకలాపాలను విలీనం చేసుకోనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం కంపెనీ షేరు ధర 9 శాతం లాభపడింది. 52 వారాల గరిష్టస్థాయికి సమీపించింది. ఈ సంస్థల కొనుగోలు కోసం ఎయిర్‌టెల్‌ ఎలాంటి నగదును కానీ, వాటాలను కాని ఇవ్వకపోవడంతో షేరు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యింది. గురువారం మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.400 వద్ద ట్రేడింగ్‌ ముగించిన భారతీ ఎయిర్‌టెల్‌.. శుక్రవారం

Most from this category