News


జీఎస్‌పీఎల్‌ షేర్లకు ఫలితాల షాక్‌

Wednesday 22nd May 2019
Markets_main1558512466.png-25885

గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు నిరుత్సాహపరచడంతో జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్లో  9శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌లో కంపెనీ షేర్లు రూ.154.9ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీలు ఫలితాలను విడుదల చేసింది. క్యూ4 రూ. 2146 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 308 కోట్ల నష్టాలు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం పెరిగి రూ. 10,159 కోట్లను తాకింది. ఇబిటా 14 శాతం క్షీణించి రూ. 1845 కోట్లకు పరిమితమైంది. మార్జిన్లు 24.8 శాతం నుంచి 18.2 శాతానికి బలహీనపడ్డాయి. ఈ త్రైమాసికంలో రూ. 1734 కోట్లమేర అనుకోని నష్టాలు వాటిల్లినట్లు కంపెనీ తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో నేడు బీఎస్‌ఈలో జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ షేరు 12శాతం పతనమై రూ. 143.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం. 1:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.163.15)తో పోలిస్తే 9శాతం నష్టంతో రూ.148.6ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.123.3, రూ.250.6లుగా నమోదయ్యాయి. 



You may be interested

టెక్‌ మహీంద్రా షేరును ఏం చేద్దాం?

Wednesday 22nd May 2019

మార్చి త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా నికర లాభం దాదాపు 9 శాతం క్షీణించింది. కానీ ప్రముఖ బ్రోకరేజ్‌లు కంపెనీ షేరుపై పాజిటివ్‌గానే ఉన్నాయి.  1. క్రెడిట్‌ సూసీ: అవుట్‌ పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 950 నుంచి రూ. 910కి తగ్గించింది. క్యు4 ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. టెలికం వ్యాపారం బాగుంది. హువావేపై నిషేధం కంపెనీపై తక్షణ ప్రభావమేమీ చూపకపోవచ్చు. ఈపీఎస్‌ అంచనాలు 3 శాతం మేర తగ్గింపు.  2. సీఎల్‌ఎస్‌ఏ: అవుట్‌పెర్ఫామ్‌

బలమైన ప్రభుత్వం వస్తే 13వేలకు నిఫ్టీ!

Wednesday 22nd May 2019

ప్రభుదాస్‌ లీలాధర్‌ అంచనా కేంద్రంలో బలమైన ఎన్‌డీఏ ప్రభుత్వం వస్తే ఈ ఏడాదిలోనే నిఫ్టీ 13000 పాయింట్లను తాకుతుందని ప్రభుదాస్‌ లీలాధర్‌ రిటైల్‌ సీఈఓ సందీప్‌ రైచూర అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మార్కెట్లకు దిశానిర్ధేశం జరుగుతుందన్నారు. కేంద్రంలో బలమైన ఎన్‌డీఏ ‍ప్రభుత్వం లేదా కాంగ్రెస్‌ దన్నుతో బలమైన యూపీఏ ప్రభుత్వం వస్తే మార్కెట్లో భారీ ర్యాలీ ఉంటుందని అంచనా వేశారు. అయితే కాంగ్రెస్‌ మద్దతుతో థర్డ్‌ఫ్రంట్‌

Most from this category