జుబిలంట్ లైఫ్ సైన్సెస్‌పై జున్‌జున్‌వాలాకు ఆసక్తి
By Sakshi

భారత ఈక్విటీ మార్కెట్లలో పాపులర్ ఇన్వెస్టర్‌గా పేరొందిన రాకేశ్ జున్‌జున్‌వాలా ఫార్మా రంగంలో జుబిలంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పట్ల ఎంతో ఆశాభావంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా ఈ కంపెనీలో అదనంగా మరికొంత ఇన్వెస్ట్ చేసి వాటా పెంచుకోవడం గమనార్హం. ఈ మంగళవారం (జూలై 30న) జున్‌జున్‌వాలా జుబిలంట్ లైఫ్‌లో 1.10 శాతం వాటాను అంటే 17.5 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. రేర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో 20,13,626 షేర్లను కొన్న ఆయన అదే రోజు 2,66,626 షేర్లను విక్రయించారు. రేర్ ఎంటర్ప్రైజెస్ అన్నది జున్‌జున్‌వాలా పెట్టుబడుల సంస్థ. అయితే, జుబిలంట్ లైఫ్ సైన్సెస్‌లో జున్‌జున్‌వాలా ఇన్వెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. కంపెనీలో ఇన్వెస్టర్‌గా ఆయన ఇప్పటికే కొంత వాటా కలిగి ఉన్నారు. ఆయన పేరిటే (రాకేశ్ రాధేశ్యామ్ జున్‌జున్‌వాలా పేరుతో) 1.9 శాతం వాటా జూన్ త్రైమాసికం చివరికి ఉండడం గమనార్హం. రాకేశ్ రాధేశ్యామ్ జున్‌జున్‌వాలా ఇక్కడ గణాంకాలను పరిశీలిస్తే... 2018 సెప్టెంబర్ త్రైమాసికం నుంచి జున్‌జున్‌వాలా క్రమంగా వాటాలు పెంచుకుంటూ వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా జున్జున్వాలాతోపాటు ఈస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ మాస్టర్ ఫండ్ సైతం జుబిలంట్ లైఫ్ సైన్సెస్‌లో 12.50 లక్షల షేర్లను ఒక్కో షేరుకు రూ.435 చొప్పున కొనుగోలు చేసింది. జూన్ త్రైమాసికంలో జుబిలంట్ లైఫ్ సైన్సెస్ లాభం 7.68 శాతం తగ్గి రూ.185 కోట్లుగా ఉండడం గమనార్హం. వ్యయాల పెరుగుదల ప్రభావంతో లాభాలు తగ్గిపోయాయి. బ్రోకరేజీ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ ఈ స్టాక్‌కు రెడ్యూస్ రేటింగ్ ఇచ్చి, రూ.433 టార్గెట్‌గా పేర్కొనడం గమనార్హం.
1.90 (2019 జూన్ నాటికి)
1.63 (2019 మార్చి నాటికి)
1.88 (2018 డిసెంబర్ నాటికి)
1.57 (2018 సెప్టెంబర్ నాటికి)
1.26 (2018 జూన్ నాటికి)
1.26 (2018 మార్చి నాటికి)
2017 డిసెంబర్ నాటికి ఒక శాతానికి పైగా వాటాల్లేవు.
You may be interested
జీ డీల్‌కు ఇన్వెస్కో సై
Thursday 1st August 2019మరిన్ని పెట్టుబడులకు ఇన్వెస్కో అంగీకారం మరో 11 శాతం వాటాల కొనుగోలు డీల్ విలువ రూ. 4,224 కోట్లు ఇప్పటికే 7.74 శాతం వాటా ముంబై: నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జీ గ్రూప్‌నకు ఊరటనిచ్చేలా అమెరికాకు చెందిన ఇన్వెస్కో ఓపెన్‌హైమర్ ఫండ్ మరింత ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎ౾ంటర్‌ప్రైజెస్ (జీ)లో ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ డీల్ విలువ రూ. 4,224 కోట్లుగా ఉండనుంది.
ఈ స్థాయిల్లోనూ పెట్టుబడులకు సౌకర్యమే...: విలియం ఓనీల్
Thursday 1st August 2019బ్రోడర్ మార్కెట్‌ను పరిశీలిస్తే ప్రస్తుతానికి నిఫ్టీలో 19 కంపెనీలు 200డీఎంఏకు పైన ట్రేడ్ అవుతుంటే... నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 కంపెనీల్లో 35 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 కంపెనీల్లో 27 శాతం వాటి 200 డీఎంఏకు దిగువన ట్రేడ్ అవుతున్నాయని విలియం ఓ నీల్ ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ విపిన్ ఖరే తెలిపారు. కేవలం కొన్ని స్టాక్స్ మాత్రమే మార్కెట్ల మొత్తం వ్యాల్యూషన్‌ను నడిపిస్తున్న దానికి ఇది సంకేతమన్నారు. మార్కెట్