News


టైటాన్‌ రేటింగ్‌ తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ

Thursday 4th July 2019
Markets_main1562231328.png-26795

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్‌ షేరుగా పిలువబడే టైటాన్‌ షేర్లపై విదేశీ బ్రోకరేజ్‌ హౌసింగ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. గతంలో తాము కేటాయించిన ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌ నుంచి ఈక్విల్‌ వెయిట్‌ రేటింగ్‌కు తగ్గిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. అయితే రూ.1300 షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను  మాత్రం యథాతథంగా ఉంచుతున్నట్లు తెలిపింది. ధీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఈ కంపెనీ షేర్లు ప్రయోజనకరం. అయితే ప్రస్తుత స్థాయి మించి లాభాలను ఆర్జించడటం తేలికైన విషయం కాదు. షేరు ప్రస్తుత ధర వద్ద సమతుల్య రిస్క్ - రివార్డ్‌ను కనబరుస్తుంది. రాబోయే త్రైమాసికాల్లో కంపెనీ ఫలితాలు కూడా పెద్దగా ఆశ్చర్యపరిచేంతగా నమోదు కాకపోవచ్చని మోర్గాన్‌స్టాన్లీ భావిస్తోంది. ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్లు 50శాతం లాభాల్ని ఇన్వెస్టర్లకు పంచాయి. రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా, అతని భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాలకు ఈ కంపెనీలో 7.04శాతానికి సమానమైన ఈక్విటీ షేర్లు కలిగి ఉన్నారు. షేర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలను మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 3శాతం నష్టపోయి రూ.1288.30ల స్థాయికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:15ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.1288.30)తో పోలిస్తే 2.50శాతం నష్టంతో రూ.1290.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.731.70 రూ.1340.75లుగా నమోదయ్యాయి. 



You may be interested

ఎఫ్‌పీఐల పెట్టుబడులు మరింత సరళం: ఆర్థిక సర్వే

Thursday 4th July 2019

ప్రతి ఏడాది ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు రోజు ఆర్థిక శాఖ ఎకనామిక్‌ ఎఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది. రేపు బడ్జెట్‌ వెలువడనున్న నేపథ్యంలో ఆర్థిక సర్వే విడుదలయ్యింది. ఇందులోని ముఖ్యమైన అంశాలు.. -స్థిరమైన స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం 2020 ఆర్థికసంవత్సరపు(ఎఫ్‌వై) జీడీపీ రేటును 7 శాతంగా అంచనా వేసింది. - ఎఫ్‌వై20లో వ్యవసాయ, అటవి, మత్య్స రంగాల వృద్ధి రేటును 2.9 శాతంగా ఊహించింది. -ఎఫ్‌వై 2018లో

బడ్జెట్‌ రోజున కొత్త గరిష్ఠాలకు ఛాన్స్‌?!

Thursday 4th July 2019

గణాంకాల విశ్లేషణ దేశీయ మార్కెట్లు బడ్జెట్‌ సమయంలో తమ ఆల్‌టైమ్‌ హైకి దగ్గర్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌రోజు బ్రేకవుట్‌తో మరో ఆల్‌టైమ్‌ హైని మార్కెట్‌ చవిచూసే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత పదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే బడ్జెట్‌రోజు తీవ్ర కదలికలు చూపినా, చివరకు ఫ్లాట్‌గా మార్కెట్‌ ముగియడం ఎక్కువసార్లు కనిపిస్తుంది. పదేళ్లలో బడ్జెట్‌ రోజున బుల్స్‌ పట్టు బిగించిన సందర్భాలు ఐదు సార్లున్నాయని, ఈ ఐదు

Most from this category