పది కంపెనీల్లో రాకేశ్ వాటా మార్పులు!
By D Sayee Pramodh

సెప్టెంబర్‌లో ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పోర్టుఫోలియోలోని పది స్టాకుల్లో వాటాలు మార్పులు పొందాయి, మరో 15 కంపెనీల్లో వాటాలు స్థిరంగా ఉన్నాయి. సెప్టెంబర్‌లో రాకేశ్ ఐదు కంపెనీల్లో వాటాలను పెంచుకున్నాడు మరో ఐదింటిలో వాటాలు తగ్గించుకున్నాడని గణాంకాలు చెబుతున్నాయి. ఫెడరల్ బ్యాంక్, వీఐపీ ఇండస్ట్రీస్, ఆగ్రోటెక్ ఫుడ్స్, ఎన్సీసీ, టీవీ18 బ్రాడ్కాస్ట్ షేర్లను సెప్టెంబర్‌లో రాకేశ్ కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఇంతవరకు ఈ షేర్లు దాదాపు 9- 40 శాతం వరకు నష్టపోయాయి. అక్టోబర్ మధ్య నాటికి రాకేశ్ పోర్టుఫోలియోలోని దాదాపు 25 కంపెనీలు త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. వీటిలో 80 శాతం కంపెనీల షేర్లు ఏడాది కాలపరిమితిలో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. వీటిలో అత్యధికంగా డీహెచ్ఎఫ్ఎల్ దాదాపు 90 శాతం కుంగింది. సెప్టెంబర్‌లో రాకేశ్ ఐదు కంపెనీల్లో వాటాలు తగ్గించుకున్నారు. క్రిసిల్, లుపిన్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, టైటాన్, ఐయాన్ ఎక్చేంజ్‌ల్లో వాటాలను రాకేవ్ తగ్గించుకున్నాడు. ఇక ఫోర్టిస్, ఎస్కార్ట్స్, జియోజిత్, అప్టెక్, ఎడెల్వీజ్ తదితర 15 కంపెనీల్లో వాటాలు యథాతధంగా ఉన్నాయి.
అక్టోబర్ 18నాటికి రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పోర్టుఫోలియోలో ఫలితాలు ప్రకటించిన కంపెనీలు, వాటి వాటాలు, వాటి ధరలో మార్పులు....
You may be interested
బంగారం ఈటీఎఫ్‌ల్లో అమ్మకాలు
Tuesday 12th November 2019బంగారం ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు ఈ అక్టోబర్‌లో రూ.31కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు రెండునెలల్లో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి దాదాపు రూ.200 కోట్ల నికర పెట్టుబడులు ప్రవహించగా, అక్టోబర్‌లో మాత్రం కొంతమేర పెట్టుబడులు వెనక్కువెళ్లాయి. సెప్టెంబర్‌లో రూ.44.11 కోట్ల నికర పెట్టుబడులు రాగా, ఆగస్ట్‌లో ఏకంగా రూ.145.29 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. సాధారణంగా అనిశ్చితి సమయాల్లో బంగారం సంబంధిత పెట్టుబడులను రక్షణాత్మక ఆస్తులుగా భావిస్తారు. బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం, అమెరికా-చైనాల
పెరిగిన స్టీల్ ధరలు..ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందా?
Tuesday 12th November 2019దేశీయ అతి పెద్ద స్టీల్ కంపెనీలయిన టాటా స్టీల్, జేఎస్‌డబ్యూ స్టీల్, గత ఆరు నెలల్లో మొదటి సారిగా ప్రాధమిక స్టీల్ అయిన హెచ్ఆర్సీ(హాట్ రోల్డ్ కాయిల్) ధరలను పెంచాయి. కాగా వ్యవస్థలో ధరలు, డిమాండ్ పరంగా ఉన్న మందగమనం బాటమ్ ఔట్ అవుతోందనే సంకేతాలను ఇది ఇస్తోందని విశ్లేషకులు తెలిపారు. ఈ రెండు కంపెనీలు టన్ను హెచ్ఆర్సీపై రూ. 500 నుంచి రూ. 750 వరకు ధరలను పెంచాయి. గత