News


ఝున్‌ఝున్‌వాలా వాటాను పెంచుకున్న షేర్లివే!

Wednesday 23rd October 2019
Markets_main1571812767.png-29080

   బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా సెప్టెంబర్‌ నెలలో 5 కంపెనీలలో తన వాటాను పెం‍చుకోగా, 15 కంపెనీలలో తన వాటాను స్థిరంగా ఉంచుకున్నారని ఏసీఈ ఈక్విటీ డేటా పేర్కొంది. ఫెడరల్ బ్యాంక్, వీఐపీ ఇండస్ట్రీస్, అగ్రో టెక్ ఫుడ్స్, ఎన్‌సీసీ, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్ కంపెనీలలో ఈ సీనియర్‌ ఇన్వెస్టర్‌ తన వాటాను పెంచుకున్నారు. కాగా ఈ కంపెనీల షేరు విలువ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 9-40 శాతం మేర పడిపోవడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం 2020 క్యూ2కి సంబంధించి, 25 కంపెనీల షేర్లతో కూడిన రాకేష్‌ఝున్‌ఝున్‌ వాలా పోర్టుఫోలియో హోల్డింగ్స్‌ డేటాను ఏసీఈ ఈక్విటీ అక్టోబర్‌ 18న విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం ఆయన పోర్టుపోలియోలోని 80 శాతం స్టాకులు ఈ ఏడాది ఇప్పటి వరకు నెగిటివ్‌ రిటర్న్‌లనే ఇచ్చాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు 90 శాతం పతనమవ్వగా, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌ 60 శాతం, ఎడెల్వీస్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ 52 శాతం మేర పతనమయ్యాయి. 
   క్రిసిల్‌, లుపిన్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యుషన్స్‌, టైటాన్‌ కంపెనీ, ఐయాన్‌ ఎక్సేంజ్‌ కంపెనీలలో తన వాటాను ఈ ఇన్వెస్టర్‌ తగ్గించుకున్నారు. సెప్టెంబర్‌ చివరినాటికి  5,77,51,220 టైటాన్‌ షేర్లను(7.82 శాతం వాటా) రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా, ఆయన భార్య కలిగివున్నారు. కానీ జూన్‌ చివరినాటికి  ఇది 6,26,51,220 షేర్లుగా ఉంది. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో టైటాన్‌ కంపెనీ అమ్మకాలు జులై నెలలో భారీగా పడిపోయాయి. అంతేకాకుండా ఈ సీనియర్‌ ఇన్వెస్టర్‌ ఫోర్టిస్ హెల్త్‌కేర్, ఎస్కార్ట్స్, ఆప్టెక్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వంటి 15 కంపెనీలలో తన వాటాను స్థిరంగా ఉంచుకోవడం గమనార్హం. ఈ ఇన్వెస్టర్‌ తన పోర్టుఫోలియోలోని ఓరియంట్‌ సిమెంట్‌, ఎంసీఎక్స్‌ స్టాకుల రేట్‌ను స్థిరంగా ఉంచారు. ఈ షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పాజిటివ్‌ రిటర్న్‌లనే ఇచ్చాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఫలితాలలో ఓరియంట్ సిమెంట్ రూ .7.70 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ నష్టం రూ. 16.74 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 71.75 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 35.93 కోట్లుగా ఉందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఝున్‌ఝున్‌వాలా రాకేష్‌ రాధేష్యామ్‌, ఝున్‌ఝున్‌వాలా రేఖా రాకేష్‌, రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా, రేఖా రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా అండ్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా వంటి పేర్లతో ఇండియా కంపెనీలలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తున్న విషయం తెలిసిందే.



You may be interested

కోటక్‌ బ్యాంకుపై బ్రోకరేజ్‌ల మిశ్రమ స్పందన

Wednesday 23rd October 2019

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం కోటక్‌ మహీంద్రా బ్యాంకుపై బ్రోకరేజ్‌లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నాయి. క్యు2లో బ్యాంకు బలమైన ప్రాఫిట్‌గ్రోత్‌ నమోదు చేసినా, ఆస్తుల నాణ్యత మాత్రం క్షీణించింది. ఈ నేపథ్యంలో బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి... - క్రెడిట్‌ సూసీ: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1450. బ్యాంకు ఎర్నింగ్స్‌ వృద్ధి మందగించింది. ఎన్‌ఐఎం పెరగడం పాజిటివ్‌ అంశం. ప్రస్తుతం తన ఫార్వర్డ్‌ పీబీ విలువకు

పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

Wednesday 23rd October 2019

గత కొన్ని నెలల నుంచి దిద్దుబాటుకు గురవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లకు కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోలు మద్ధతు లభిస్తోంది. దీంతో పాటు ఈ వారంలో ఎస్‌బీఐ క్యూ2 ఫలితాలు వెలువడడనుండడంతో ఎస్‌బీఐ షేరు పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఫలితంగా బుధవారం సెషన్‌లో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌​ ఉదయం 10.58 సమయానికి 1.54 శాతం లాభపడి 2,295.90 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఇండియన్‌ బ్యాంక్‌ 4.24

Most from this category