News


నిఫ్టీ మునుముందుకే!

Thursday 24th October 2019
Markets_main1571910998.png-29115

రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా అంచనా
ప్రస్తుత మార్కెట్‌ గమనం చూస్తే నిఫ్టీ వెనక్కు రావడం కన్నా, ముందుకు కొనసాగేందుకే ఇష్టపడుతుందని ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా అభిప్రాయపడ్డారు. నిఫ్టీ ముందు 12వేల పాయింట్లను చేరవచ్చన్నారు. మార్కెట్లో పరిస్థితులు అంతా అనుకునేంత అధ్వాన్నంగా ఏమీలేవన్నారు. ప్రస్తుత బలహీనదశ క్రమంగా ముగిసిపోతుందన్నారు. నిఫ్టీ కార్పొరేట్‌ టాక్స్‌ కట్‌ అనంతరం రెండ్రోజుల్లో దాదాపు వెయ్యిపాయింట్ల ర్యాలీ చేసిందని, సూచీలు ఈ ర్యాలీని జీర్ణించుకోవాలని, అందుకే కన్సాలిడేషన్‌ జరుగుతోందని చెప్పారు. రాబోయే ఆర్థిక సంవత్సరం నంచి దేశ ఎకానమీ 9-10 శాతం వృద్ధి తప్పక సాధిస్తుందన్నారు. నిఫ్టీకి 11వేల పాయింట్ల వద్ద బలమైన బాటమ్‌ ఏర్పడిందని చెప్పారు. ఎకానమీలో రికవరీకి సంకేతంగా విక్రయాల్లో మెరుగుదల కనిపిస్తోందని, పెట్టుబడులు పెరిగేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. బ్యాంకుల ఎన్‌పీఏ సమస్యలు సైతం చివరకు వచ్చినట్లు కనిపిస్తున్నాయన్నారు. ఇటీవల కాలంలో భారీ డిఫాల్టులేవీ బయటకురాకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. బ్యాంకుల ఆస్తుల నాణ్యత క్రమంగా మెరుగుపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్స్‌ మంచి అవకాశాలు సొంతం చేసుకుంటాయన్నారు.
పీఎస్‌యూలు బెటర్‌
కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపుతో ప్రభుత్వ రంగ కంపెనీలకు బాగా లబ్ది చేకూరుతుందని, దీనికితోడు పలు పీఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ వాటి మెరుగుదలకు అవకాశాలనిస్తుందని, అందువల్ల రాబోయే రోజుల్లో పీఎస్‌యూలు మంచి పనితీరు కనబరుస్తాయని రాకేశ్‌ చెప్పారు. భారత ఎకానమీలో వినిమయ షేర్లు ఎప్పుడూ మంచి ఫలితాలే ఇస్తాయన్నారు. ఉదాహరణకు హెచ్‌యూఎల్‌ షేరు 2001లో రూ. 324 ఉందని, దాదాపు 9 ఏళ్లు ఈ స్థాయి వద్దే కదలాడిందని, కానీ గత పదేళ్లలో దాదాపు 700 శాతం పెరిగిందని చెప్పారు. పైగా ప్రస్తుతం దేశీయ ఎకానమీలో వినిమయం మరింత జోరందుకోనుందన్నారు. ఇన్ఫీపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ ఇలాంటి ఫిర్యాదుల పట్ల సెబి కఠినంగా వ్యవహరించాలని, ఇలాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత జరిగే ట్రేడ్లపై విచారణ జరపాలని ఆయన సూచించారు. ఒక ఫిర్యాదు చేస్తే, అది బాధ్యతాయుతంగా ఉండాలని, ఊరికే హడావుడి కోసం ఇలాంటివి చేయకూడదని విమర్శించారు. 2018నుంచి ఆరంభమైన బేర్‌ మార్కెట్‌ ముగింపునకు వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కమోడిటీల్లో బ్రెంట్‌ క్రూడ్‌ 50- 60 డాలర్ల రేంజ్‌లోకదలాడవచ్చని, బంగారంపై బుల్లిష్‌గా ఉన్నానని చెప్పారు. రంగాలవారీగా ఓఎంసీలపై పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. You may be interested

టెల్కోలకు సుప్రీం కోర్టు షాక్‌..!

Thursday 24th October 2019

టెలికమ్యూనికేషన్ విభాగం నిర్దేశించిన విధంగా అడ్జెస్టెట్‌ గ్రాస్‌ రెవెన్యూ (ఏజీఆర్‌) నిర్వచనాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో గురువారం ట్రేడింగ్‌లో టెలికాం కంపెనీల (టెల్కోలు) షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీలు, ఇతర టెలికాం సంబంధిత ఆదాయాల ద్వారా సమకూరిన స్థూల ఆదాయం నుంచి కొంత శాతం టెలికాం కంపెనీలు...టెలికాం శాఖకు చెల్లించాలన్న వివాదం 14 సంవత్సరాలుగా కోర్టుల్లో నలుగుతోంది. కొన్ని సేవలపైనే వచ్చే ఆదాయాన్ని ఏజీఆర్‌గా పేర్కొంటూ వాటిపైనే లెవీలు

ఇండియన్‌ బ్యాంక్‌ 11% క్రాష్‌!

Thursday 24th October 2019

 క్యూ2 ఫలితాలను ప్రకటించక ముందు భారీగా పెరిగిన ఇండియన్‌ బ్యాంక్‌ షేరు, గురువారం లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో సెషన్లో నష్టాల్లో ట్రేడవుతోంది. మధ్యాహ్నం 2.51 సమయానికి ఈ బ్యాంక్‌ షేరు విలువ 11.83 శాతం నష్టపోయి రూ. 126.00 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 142.90 వద్ద పాజిటివ్‌గా ముగిసిన ఈ షేరు, గురువారం ట్రేడింగ్‌లో రూ. 141.95 వద్ద ప్రారంభమై, రూ. 125.25 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని

Most from this category