News


బడా ఇన్వెస్టర్ల అమ్మకాలు, కొనుగోళ్లు...

Friday 12th April 2019
Markets_main1555092016.png-25099

రిటైల్‌ ఇన్వె‍స్టర్లలో ఎక్కువ మంది అనుసరించే రాకేశ్‌ జున్‌జున్‌వాలా, ఆశిష్‌ కచోలియా, డాలీ ఖన్నా, అనిల్‌కుమార్‌ గోయల్‌ తమ పోర్ట్‌ఫోలియోలో మార్చి త్రైమాసికంలో పలు మార్పులు చేర్పులు చేసుకున్నారు. వీటిని ఓ సారి గమనిస్తే...

 

ఫస్ట్‌ సోర్స్‌ సొల్యూషన్స్‌ అనే బీపీవో కంపెనీలో జున్‌జున్‌వాలా తన వాటాలను మార్చి త్రైమాసికంలో పెంచుకున్నారు. డిసెంబర్‌ క్వార్టర్‌ నాటికి కంపెనీలో 2.89 శాతం వాటాలు ఉండగా (జున్‌జున్‌వాలా, ఆయన భార్య రేఖ పోర్ట్‌ఫోలియోను ఒక్కటిగానే చూస్తారు), అది 3.26 శాతానికి పెరిగింది. 2017 మార్చి త్రైమాసికంలో ఇదే కంపెనీలో జున్‌జున్‌వాలాకు 3.67 శాతం వాటా ఉండగా, ఆ తర్వాత తగ్గించుకున్నారు. తిరిగి మళ్లీ పెంచుకోవడం కంపెనీ భవిష్యత్తు వృద్ధి అవకాశాలను సూచిస్తోందని విశ్లేషకుల అంచనా. స్పైస్‌జెట్‌, మ్యాన్‌ ఇన్‌ఫ్రా, ఎన్‌సీసీ, క్రిసిల్‌లో జున్‌జున్‌వాలా, రేఖ వాటాల్లో మార్పుల్లేవు. ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌లో మాత్రం 2.71 శాతానికి వాటా తగ్గింది. డిసెంబర్‌ త్రైమాసికంలో 3.77 శాతం మేర ఉండడం గమనార్హం. అయితే, షేర్ల సంఖ్యలో మార్పు లేదు.

 

ఆశిష్‌ కచోలియా జీటీపీఎల్‌ హాత్‌వే షేర్లను తన పోర్ట్‌ఫోలియోకు యాడ్‌ చేసుకున్నారు. 2.06 శాతం వాటా ఉన్నట్టు షేర్‌ హోల్డింగ్‌ వివరాల ఆధారంగా తెలుస్తోంది. అలాగే బీటా డ్రగ్స్‌లోనూ 1.06 శాతం వాటాలు కొనుగోలు చేశారు. అలాగే డీఎఫ్‌ఎం ఫుడ్స్‌లో వాటా 1.89 శాతానికి, మెజెస్కోలో 2.35 శాతానికి, నోసిల్‌లో 4.3 శాతానికి వాటాలు పెంచుకున్నారు. వైభవ్‌ గ్లోబల్‌, జీహెచ్‌సీఎల్‌, వీ2 రిటైల్‌, విష్ణు కెమికల్స్‌లో వాటాల్లో మార్పుల్లేవు. డిసెంబర్‌ త్రైమాసికంలో పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌లో 1.49 శాతం వాటా ఉండగా, తాజా షేర్‌ హోల్డింగ్‌లో ఆయన పేరు లేదు. పూర్తిగా వాటాలు విక్రయించారా లేక ఒక శాతం లోపునకు తగ్గించుకున్నారా అన్నది స్పష్టత లేదు.

 

డాలీఖన్నా రెయిన్‌ ఇండస్ట్రీస్‌లో 0.44 శాతం వాటా తగ్గించుకుని 2.22 శాతానికి పరిమితం చేసుకున్నారు. నోసిల్‌లో 2.14 శాతానికి తగ్గించుకున్నారు. అసోసియేటెడ్‌ ఆల్కహాల్‌ బ్రెవరీస్‌, ఎన్‌ఆర్‌ అగర్వాల్‌ ఇండస్ట్రీస్‌లో వాటాలు ఒక శాతం లోపునకు తగ్గిపోయాయి. అనిల్‌ కుమార్‌ గోయల్‌ మెజెస్కోలో వాటాను 2.13 శాతం నుంచి 1.92 శాతానికి తగ్గించుకున్నారు. ఓపీ చైన్స్‌, శ్రీకాళహస్తి పైప్స్‌ కంపెనీల్లో ఒక శాతానికి పైగా వాటాలున్న వారి పేర్లలో  గోయల్‌ పేరు అదృశ్యమైంది. పూర్తిగా వైదొలగడం లేదా ఒక శాతం లోపునకు తగ్గించుకోవడం జరిగి ఉంటుంది. ద్వారికేష్‌ షుగర్‌, తిరుమలై కెమికల్స్‌, స్టెర్లింగ్‌ గూల్స్‌, జేబీఎం ఆటో, ఐజీ పెట్రోకెమికల్స్‌, పనామా పెట్రోకెమ్‌, ఆస్టిన్‌ ఇంజనీరింగ్‌, సర్లా పెర్‌ఫార్మెన్స్‌ ఫైబర్స్‌లో ఆయన వాటాల్లో మార్పుల్లేవు. 



You may be interested

ఐహెచ్‌ఎఫ్‌, ఎల్‌వీబీకి అమ్మకాల ఒత్తిళ్లు

Friday 12th April 2019

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐహెచ్‌ఎఫ్‌), లక్ష్మీ విలాస్‌ బ్యాంకు (ఎల్‌వీబీ) ప్రతిపాదిత విలీనంపై బ్రోకరేజీ సంస్థలు సానుకూలంగానే ఉన్నప్పటికీ... ఈ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. విలీన నిర్ణయం తర్వాత ఈ రెండు స్టాక్స్‌ సుమారు 10 శాతం నష్టపోయాయి. విలీన ప్రతిపాదన ప్రకారం చూస్తే ప్రతీ 100 ఎల్‌వీబీ షేర్లకు 14 ఇండియాబుల్స్‌ షేర్లు లభిస్తాయి. ఈ ప్రకారం చూస్తే ఎల్‌వీబీ 30 శాతం తక్కువకే అందుబాటులో ఉంది.

మార్కెట్‌ను గట్టిక్కించిన మిడ్‌సెషన్‌ కొనుగోళ్లు

Friday 12th April 2019

మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ శుక్రవారం లాభంతో ముగిసింది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 160 పాయింట్ల లాభంతో 38767 వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 11,643 వద్ద స్థిరపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం లాభపడి 29,938 వద్ద స్థిరపడింది. ప్రపంచమార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ నేడు లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 85 పాయింట్ల లాభంతో 38,692 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు

Most from this category