News


ఆల్‌టైమ్‌ కనిష్టాలకు జెట్‌ షేరు

Friday 14th June 2019
Markets_main1560493819.png-26284

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు విలువ శుక్రవారం ఇంట్రాడేలో 13శాతం దిగజారి రూ.79.65కు పడిపోయింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి కీలక అనుమతులను డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) రద్దుచేయడంతో షేరు భారీగా నష్టపోయింది. అప్పుల బాధతో కంపెనీ కార్యనిర్వహణ మూతపడింది. దీంతో కంపెనీ విమానసర్వీసులను నడపడం లేదు. అయితే విమానాలు తిరగక పోయిన వాటి నిర్వహణ చాలా అవసరం. కానీ తాజాగా డీసీఏ నిర్ణయం కంపెనీ విమానాల నిర్వహణపై ప్రభావం చూపనుంది. ఈ నిర్ణయంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇతర ఎయిర్‌ లైన్‌లకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ పనులను కూడా నిర్వహంచే అవకాశం లేదు. మరోవైపు జెట్‌ దివాలా కేసుపై తదుపరి విచారణను నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) జూన్‌20 కి వాయిదా వేసింది. ఇంకోసారి జెట్‌ఎయిర్‌ వేస్‌కు లిగల్‌ నోటిసులు పంపించాలని రుణదాతలైన షామన్‌ వీల్స్, గాగర్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు సూచించింది. ప్రస్తుతం కంపెనీ షేరు బీఎస్‌ఈలో 10 శాతం నష్టంతో రూ.81.90 వద్ద  ట్రేడవుతోంది.   



You may be interested

జెట్‌పై ఇప్పటికీ ఆసక్తిగానే ఉన్నాం

Friday 14th June 2019

 బ్రిటన్ సంస్థ ఆదిగ్రో వెల్లడి ఎతిహాద్‌తో కలిసి కొనుగోలు యోచన ఎన్‌సీఎల్‌టీ విచారణ 20తేదీకి వాయిదా న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుపై ఇప్పటికీ ఆసక్తిగానే ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన ఆదిగ్రో ఏవియేషన్‌ సంస్థ స్పష్టం చేసింది. చెక్కుతో తాము సిద్ధంగా ఉన్నామని, అయితే భారీ మొత్తం వెచ్చించే పరిస్థితి లేనందువల్ల వేరే సంస్థతో కలిసి కొనుగోలు చేయాలని భావిస్తున్నామని వివరించింది. ఇందులో భాగంగా ఎతిహాద్‌

భారత మార్కెట్ కీలకం

Friday 14th June 2019

భారీ మార్కెట్‌ కాబట్టి ప్రయోగాలు చేయొచ్చు కొత్త ఉత్పత్తులకు బాగా తోడ్పాటునిస్తోంది ఆ తరవాత ప్రపంచమంతటా తేవొచ్చు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచయ్‌ వ్యాఖ్యలు వాషింగ్టన్‌: టెక్‌ దిగ్గజం గూగుల్‌ కొంగొత్త ఉత్పత్తులు ఆవిష్కరించడంలోనూ, అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో వాటిని ప్రవేశపెట్టడంలోనూ భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణం పరంగా భారత్‌ చాలా భారీ మార్కెట్‌ కావడంతో ఇక్కడిలాంటి ప్రయోగాలు చేయటం గూగుల్‌కు సాధ్యమవుతోంది. అమెరికా, ఇండియా వ్యాపార మండలి (యూఎస్‌ఐబీసీ) నిర్వహించిన ‘ఇండియా ఐడియాస్‌’

Most from this category