News


జెట్‌ ఎయిర్‌- స్టెరిలైట్‌ టెక్‌కు షాక్‌

Thursday 16th January 2020
Markets_main1579156971.png-30963

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నాయి. వాణిజ్య వివాదాల పరిష్కారానికి వీలుగా అమెరికా, చైనా మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బుధవారం అమెరికా మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. అయితే దేశీయంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. విభిన్న వార్తల కారణంగా ప్రయివేట్‌ రంగ కంపెనీలు.. జెట్‌ ఎయిర్‌వేస్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా ఈ రెండు కౌంటర్లూ మధ్యాహ్నం 12 ప్రాంతంలో నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

జెట్‌ ఎయిర్‌వేస్‌ లిమిటెడ్‌
కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం చేసేందుకు(ఈవోఐ) నిర్ణయించిన గడువు ముగిసిన నేపథ్యంలో విమానమాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. కొనుగోలుదారులు కరవుకావడంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 2.5 నష్టంతో రూ. 47 దిగువన ఫ్రీజయ్యింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకి తొలుత ఆసక్తి చూపిన హిందుజా గ్రూప్‌ చివరికి వెనకడుగు వేసినట్లు వెలువడిన వార్తలు ఈ కౌంటర్‌ను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. మరోవైపు దుబాయ్‌కు చెందిన ఫండ్‌ హౌస్‌ సైతం అనాసక్తత వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే దక్షిణమెరికా కంపెనీ సినర్జీ గ్రూప్‌, ఢిల్లీ సంస్థ ప్రుడెంట్‌ ఏఆర్‌సీ ఈవోఐను దాఖలు చేసినట్లు సంబంధివర్గాలు పేర్కొన్నాయి.

స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌
ఆప్టికల్‌ ఫైబర్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సొల్యూషన్స్‌ అందించే స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. దీంతో ఈ కౌంటర్‌ అమ్మకాలతో డీలా పడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పతనమై రూ. 125 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 123 దిగువన కనిష్టానికి చేరింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో స్టెరిలైట్‌ నికర లాభం 38 శాతం క్షీణించి రూ. 91 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 10 శాతం నీరసించి రూ. 1203 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 22.8 శాతం నుంచి 20.5 శాతానికి బలహీనపడ్డాయి.You may be interested

ఫ్లాట్‌గా పసిడి ధర

Thursday 16th January 2020

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ఫ్యూచర్ల ధర ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ఫ్యూచర్ల ధర రూ.30ల స్వల్పలాభంతో 39640.00 వద్ద కదలాడుతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతుండటం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి లాభంతో ట్రేడ్‌ అవుతుండటం దేశీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గిస్తున్నాయి. అమెరికా చైనాల మధ్య కుదిరిన తొలి దశ ఒప్పందం ఇరు దేశాల మధ్య

ఎల్‌ఐసీ హౌసింగ్‌- డెన్‌ నెట్‌వర్క్స్‌ అప్‌

Thursday 16th January 2020

స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ గృహ రుణ విభాగంలో 2020 పేరుతో సరికొత్త ఆఫర్లను ప్రకటించడంతో మార్టిగేజ్‌ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఉదయం 11.40 ప్రాంతంలో

Most from this category