News


జెట్‌ఎయిర్‌ వేస్‌ షేరు క్రాష్‌లాండింగ్‌

Wednesday 20th March 2019
Markets_main1553068343.png-24712

ముంబై:- ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ఎయిర్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో  పడిపోయింది. నేడు బీఎస్‌ఈలో ఎయిర్‌వేస్‌ షేర్లు రూ.215.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇప్పటికే పీకల్లోతు అప్పుల కూరుకుపోయిన కంపెనీ నుంచి వైదొలగించేందుకు తన భాగస్వామ్య సంస్థ ఎతిహాత్‌  ప్రయత్నాలు చేస్తుంది. జెట్‌ ప్రివిలెజ్‌ వ్యాపార విభాగంలో తనకున్న 50.1 శాతం వాటాలను కూడా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు ఆఫర్‌ చేసినట్లు సమాచారం. షేరు ఒక్కింటికి రూ. 150 చొప్పున జెట్‌లో తమకున్న 24 శాతం వాటాలను రూ. 400 కోట్లకు అమ్మేసేందుకు ఎస్‌బీఐకి ఎతిహాద్‌ ఆఫర్‌ చేసినట్లు మంగళవారం వార్తలు వెలువడ్డాయి. ఫలితంగా నేడు జెట్‌ ఎయిర్‌వేస్‌ ధర గత ముగింపు(రూ.229) తో పోలిస్తే దాదాపు 6శాతం నష్టంతో రూ.215  వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు షేర్ల అ‍మ్మకాలకే మొగ్గుచూపడంతో షేరు 7శాతం నష్టపోయి రూ.213.95ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:40ని.లకు షేరు గత ముగింపు(రూ.229.05) ధరతో పోలిస్తే షేరు ధర 5శాతం నష్టపోయి రూ.217.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.163.00 రూ.708.15లుగా నమోదయ్యాయి.



You may be interested

రూపాయి ర్యాలీకి బ్రేక్‌: లాభాల్లో ఐటీ షేర్లు

Wednesday 20th March 2019

నష్టాల మార్కెట్లో ఐటీ ర్యాలీ చేస్తున్నాయి. రూపాయి ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడటం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ బుధవారం 1.50శాతం పెరిగింది. డాలర్‌ మారకం రూపాయి విలువ ఆరు ట్రేడింగ్‌ సెషన్‌లో 161 పైసలు బలపడింది. అయితే రూపాయి భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌

ఓపెన్‌ ఆఫర్‌ ఉన్నప్పుడు బైబ్యాక్‌ కుదరదు!

Wednesday 20th March 2019

 మైండ్‌ట్రీ నిర్ణయంపై నిపుణుల అంచనా ఎల్‌అండ్‌టీ నుంచి ముంచుకొస్తున్న టేకోవర్‌ ముప్పును తప్పించుకునేందుకు మైండ్‌ట్రీ ప్రమోటర్లు నానా యత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధబారం బోర్డు మీటింగ్‌ జరగనుంది. ఇందులో బైబ్యాక్‌ ఆఫర్‌పై చర్చిస్తారని గతవారం కంపెనీ వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ మీటింగ్‌లో బైబ్యాక్‌ గురించిన ప్రకటన రాకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెబి నియమావళి ప్రకారం ఒక కంపెనీ షేర్లకు ఓపెన్‌ ఆఫర్‌  నడుస్తున్నప్పుడు బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించకూడదని

Most from this category