News


జెట్‌ ఎయిర్‌వేస్‌ : లోయర్‌ సర్క్యూట్‌!

Tuesday 13th August 2019
Markets_main1565680730.png-27735

రుణ సంక్షోభంలో కూరుపోయిన్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు మంగళవారం లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్‌ దాఖలు చేయడం లేదని వేదాంతా రిసోర్సెస్‌ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ స్పష్టం చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ. 44.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ కోసం వోల్కన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ఈఓఐ అంశాన్ని సహజంగానే పరిశీలించాం. వాల్యూవేషన్లు, ఇతర ప్రాధాన్యత అంశాలను పరిగణలోకి తీసుకోని బిడ్‌ను వేసేందుకు మేము సిద్ధంగా లేమని అనిల్‌ అగర్వాల్‌ వివరణ ఇచ్చారు. వోల్కాన్‌ బిడ్‌ ఉపసంహరణతో ఇప్పుడు పనామా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అవంతులో గ్రూప్‌, మరో రష్యా కంపెనీ మాత్రమే జెట్‌ కోసం ఈఓఐ దాఖలు చేసే రేసులో ఉన్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌లో 24శాతం వాటా కలిగిన ఉన్న ఈతిహాద్‌ కూడా ఈఓఐని సమర్పణకు దూరంగా ఉన్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రతికూలాంశాలతో నేడు బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు మార్కెట్‌ ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. చివరికి 5శాతం నష్టంతో రూ.44.55 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ను తాకి ఫ్రీజ్‌ అయ్యాయి. ఇక షేర్ల ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 27.00 రూ.357.00 గా నమోదయ్యాయి. 



You may be interested

నష్టాల్లో మారుతి, ఎం అండ్‌ ఎం షేర్లు

Tuesday 13th August 2019

అంతర్జాతీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతుండడంతో దేశియ మార్కెట్లు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. మధ్యాహ్నం 1.09 సమయానికి భారత్‌ ఫోర్జ్‌ (5.25 శాతం), మహింద్రా అండ్‌ మహింద్రా (ఎం అండ్‌ ఎం)(4.79 శాతం), మారుతి(2.95 శాతం) షేర్లు నష్టపోయాయి. మొత్తంగా నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 2.26 శాతం నష్టపోయి 6,976.10 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఇతర కంపెనీలయిన అమర్‌రాజా బ్యాటరీస్‌ 1.62 శాతం, బజాజ్‌ ఆటో

రిలయన్స్‌పై విదేశీ బ్రోకరేజిల మాట!

Tuesday 13th August 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ఆయిల్‌ టూ కెమికల్స్‌(ఓటీసీ) వ్యాపారంలో, 20 శాతం వాటాను సౌదీ ఆరాంకో కొనుగోలుచేయడంతో ఆర్‌ఐఎల్‌ జీరో డెట్‌ కంపెనీగాగా మారెందుకు  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత మూడు నెలలో రుణాలు, ప్రతికూల నిధుల ప్రవాహాం వలన ఇబ్బందులు పడిన ఆర్‌ఐఎల్‌, సౌదీఆరాంకోతో కుదుర్చుకున్న రూ. లక్ష కోట్ల డీల్‌తో మంగళవారం సానుకూలంగా  ట్రేడవుతోంది. ఈ స్టాకుపై రాత్రికి రాత్రే అనేక విదేశి బ్రోకరేజిలు సానుకూల రేటింగ్‌లను ఇవ్వడం

Most from this category