News


29.59శాతం నష్టపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌

Friday 21st June 2019
Markets_main1561096323.png-26460

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు శుక్రవారం(జూన్‌ 21) 29.59శాతం నష్టపోయి రూ. 43.60 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో షార్ట్‌ కవరింగ్‌ల దన్నుతో ఇంట్రాడేలో ఏకం‍గా 150 శాతం లాభపడి రూ.62.85 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. స్టేట్‌ బ్యాం‍క్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌పై వేసిన దివాలా పిటీషన్‌ను గురువారం ఎన్‌సీఎల్‌టీ స్వికరించడంతో కంపెనీ షేరు విలువ 10 శాతం మేర పతనమై రూ.56.60 వద్ద శుక్రవారం ప్రారంభమైంది. ‘సంస్థపై చాలా అప్పులున్నాయి. రుణదాతలు, లీజర్లు, ఉద్యోగులు, అద్దెకు ఉన్న విమానాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు సంస్థలో పెద్ద పరిణామాలు జరుగుతాయని మేం ఊహించడం లేదు. ఇది ఒక పెద్ద ఉచ్చులాంటిది. ఇలాంటి సందర్భాలను ఇది వరకు చూశాం. జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా అలాంటి సంస్థేనని తెలిసే సమయం వచ్చింది’అని ఎపిక్‌ రిసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు.  వీపీ సింగ్‌, రవికుమార్‌ దురైసమి ఆధ్వర్యంలోని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ ఎస్‌బీఐ ప్రతిపాదించిన థార్న్‌టన్‌కు చెందిన ఆశిష్‌ చౌచారియాను రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌గా(ఆర్‌పీ) దివాలా పక్రియను పరిశిలించటానికి నియమించింది. దివాలా పక్రియ పూర్తికావడానికి ఆర్‌పీకి సాధరణంగా 6 నెలల సమయం పడుతుందని కానీ జాతియ ప్రాధాన్యం కలిగిన జెట్‌ఎయిర్‌వేస్‌ విషయంలో 3 నెలలో పూర్తిచేయాలని వీపీ సింగ్‌ అన్నారు. తక్షణమే జెట్‌ ఎయిర్‌వేస్‌ మొత్తం ఆస్తులను ఆర్‌పీ తన నియంత్రణలోకి తీసుకోని ప్రతి 15రోజులకోకసారి పరిణతి నివెదికను అందించాలని మొదటి నివేదికను జులై 5న అందించాలని కోర్టు తెలిపింది. అంతేకాకుండా నెదర్లాండ్‌ రుణదాతల పిటీషన్‌లను ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలాకు ఆదేశాలిచ్చే అధికారం డచ్‌ డిస్ట్రిక్‌ కోర్టులకు లేదని వివరించింది. ఈ స్టాక్‌ను ఎఫ్ అండ్ ఓ విభాగం నుంచి జూన్‌ 28 తర్వాత మినహాయించి ట్రేడ్‌ ఫర్‌ ట్రేడ్‌ విభాగానికి మార్చనున్నారు.



You may be interested

1400డాలర్లు పైకి పసిడి ధర

Friday 21st June 2019

ఐదేళ్ల సుధీర్ఘకాలం తర్వాత పసిడి ధర 1400డాలర్ల స్థాయిని అందుకుంది. క్రితం ట్రేడింగ్‌లో 50డాలర్లు ర్యాలీ చేసిన 5ఏళ్ల గరిష్టాన్ని అందుకున్న పసిడి ధర, నేటి ట్రేడింగ్‌లో మరో 18డాలర్లు లాభపడింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రికత్తలు, కీలక వడ్డరేట్లపై పలు దేశాల కేంద్ర బ్యాంకులు మెతక వైఖరి, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత తదితర ఇందుకు కారణమయ్యాయి. అమెరికా తెరలేపిన వాణిజ్య యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థివృద్ధి మందగించింది. ఆర్థిక వృద్ధిని

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 21st June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఎన్‌టీపీసీ:- ఎనర్జీ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 160 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను దక్కిచుకుంది. అలాగే 750 మెగావాట్ల ప్రాజెక్ట్‌ కొరకు టెండర్‌ను ధాఖలు చేసింది. ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌:- కంపెనీ రుణ సమీకరణ పరిమితులపై క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ ధీర్ఘకాలికానికి ఎఎ-(స్థిరత్వం) రేటింగ్‌ను. స్వల్పకాలికానికి ఎ1(+) రేటింగ్‌ కేటాయించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌:- ఎస్‌బీఐ ఆధ్వర్యంలోనిక బ్యాంకుల కూటమి ధాఖలు

Most from this category