News


జీవిత కనిష్ఠానికి జెట్‌ఎయిర్‌వేస్‌ షేరు

Tuesday 18th June 2019
Markets_main1560851792.png-26386

జెట్‌ ఎయిర్‌ వేస్‌ మంగళవారం తీవ్రంగా నష్టపోయింది. ఇంట్రాడేలో 53 శాతం నష్టపోయి రూ. 32.25 జీవిత కాల కనిష్టానికి పడిపోయింది. ఈ షేరు గత 7రోజుల్లో  73శాతం నష్టపోయింది. అప్పులను రికవరి చేయడానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేషనల్‌ కం‍పెనీ లా ట్రెబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెం‍చ్‌లో దివాలా పిటిషన్‌ వేసిందనే వార్తల నేపథ్యంలో షేరు భారీగా పడిపోయింది.  లెండర్స్‌ కన్సార్టియం తరపున ఎస్‌బీఐ దివాలా పిటిషన్‌ను దాఖాలు చేసి, గ్రాంట్‌ తొర్నంటన్‌ ప్రొఫెషనల్‌ ఆశిష్‌ ఛ్చవచ్చారియా ను రిజల్యూషన్‌ ప్రొపెషనల్‌గా ప్రతిపాదించింది. ‘రుణాలు తీర్చేందుకు కంపెనీ నుంచి షరతులతో కూడిన ఒక బిడ్‌  మాత్రమే రావడంతో దివాలా చట్టానికి అనుగుణంగా అప్పుల రికవరి జరగాలని లెండర్స్‌ కన్సార్టియం కోరుకుంటుంది’ అని ఎస్‌బీఐ తెలిపింది. కంపెనీలో కొత్తగా పెట్టుబడులు పెట్టలనుకునేవారు(బిడ్డర్లు) సెబి నుంచి కొన్ని విషయాల్లో మినహాయింపులు కోరుకుంటున్నారని, ఈ మినహాయింపులు కావాలంటే తప్పక ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాల్సిఉందని, అందుకే ఈ చర్య తీసుకోవలసివచ్చిందని వివరించింది. గత ఏడాది జులై నుంచి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 17న తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఇది జరిగిన రెండు నెలల తర్వాత అప్పులు ఇచ్చిన వారు ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్‌ను వేయాలని నిర్ణయించారు. ఎతిహాద్‌-హిందుజా కన్సార్టియం జెట్‌ఎయిర్‌వేస్‌పై ఆసక్తి చూపించినప్పటికి లెండర్స్‌ నుంచి భారీ హెయిర్‌ కట్‌ను కోరుకోవడం లెండర్స్‌ కన్సార్టియంకు నచ్చలేదు. అందుకే ఈ కన్సార్టియం ఎన్‌సీఎల్‌టిని ఆశ్రయించింది. కార్యచరణ రుణదాతల పిటిషన్‌ను జూన్‌ 20న ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ విచారించనుంది. ఎస్‌బీఐ నాయకత్వంలో ఉన్న 26బ్యాంక్‌ల రుణదాతల కన్సార్టియంకు జెట్‌ఎయిర్‌వేస్‌ రూ.8,000కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు ఈ కన్సార్టియం ఆధినంలోనే జెట్‌ ఎయిర్‌ లైన్‌ నడుస్తోంది. భారీ మొత్తంలో పేరుకుపోయిన జెట్‌ఎయిర్‌ వేస్‌ రుణాలలో సేకరించిన అప్పులు రూ.13,000 కోట్లు కాగా, వ్యాపార బకాయిలు రూ.10,000కోట్లు, జీత బకాయిలు రూ.3,000 కోట్లున్నాయి.  ప్రస్తుతం జెట్‌ఎయిర్‌వేస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ.41.05గా , బీఎస్‌ఈలో రూ.40.85గా ట్రేడవుతోంది.You may be interested

వేదాంత హోల్డ్‌ చేయవచ్చు: ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌

Tuesday 18th June 2019

వేదాంత లిమిటెడ్‌ కంపెనీ షేర్లని రూ.175ల టార్గెట్‌ ధర వద్ద హోల్డ్‌ చేయవచ్చని ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ సూచించింది. షేరు టార్గెట్‌ను చేరుకునేందుకు ఏడాది కాలపరిమితిని నిర్దేశించింది. ఖర్చును తగ్గించుకునేందుకు వ్యయ నియంత్రణ కార్యక్రమాలు, నాన్‌ ఇంటిగ్రేటెడ్ వ్యాపార నమూనా నుండి అల్యూమినియం వ్యాపారం ప్రయోజనం పొందుతుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. వేదాంత ఏప్రిల్‌లో అల్యూమినియం ఉత్పత్తి రికార్డుస్థాయిలో 152 కిలో టన్నులు నమోదు చేసింది. వ్యయనియంత్రణ, అధికంగా ఉత్పత్తి

ఐఐఎఫ్‌ఎల్‌ నుంచి 3 మల్టీ బ్యాగర్లు

Tuesday 18th June 2019

వచ్చే నెలలో మోదీ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్‌కు కీలకం కానునందని ఐఐఎఫ్‌ఎల్‌ వైస్‌ ఛైర్మన్‌ సంజీవ్‌ భాసిన్‌ అభిప్రాయపడుతున్నారు. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ వినియమ, అటో రంగాలకు పెద్ద పీట వేసే అవకాశం ఉన్నందున ఈ రంగాలకు చెందిన షేర్లు పోర్ట్‌ఫోలియోలో చేరుకోవచ్చని భాసిన్‌ సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనీకంట్రో‍ల్‌ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.  పలు దేశాలతో అమెరికా వాణిజ్య యుద్ధాలకు

Most from this category