News


బీమా రంగంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..?

Tuesday 10th December 2019
Markets_main1575918751.png-30135

దేశీయ బీమా రంగ లిస్టెడ్‌ కంపెనీలు ఇప్పటి వరకు మంచి ర్యాలీ చేశాయి. ముఖ్యంగా ఈ ఏడాది బీమా కంపెనీల స్టాక్స్‌ గణనీయంగా పెరిగాయి. సంప్రదాయ సాధనాలతో పోలిస్తే అధిక రాబడులను ఆఫర్‌ చేయడం ద్వారా బీమా కంపెనీలు అధికంగా వ్యాపారం చేసుకున్నాయని.. ఒక్కసారి వడ్డీ రేట్ల సైకిల్‌ పెరుగుదల మొదలైందంటే బ్యాంకు డిపాజిట్లు ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మారతాయని గ్లోబల్‌ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ అంటోంది. ఈ రంగం పట్ల జెఫరీస్‌ అప్రమత్త ధోరణితో ఉంది. స్టాక్స్‌ వ్యాల్యూషన్లు అధిక స్థాయికి చేరడం, మార్జిన్లు తగ్గే రిస్క్‌లను దృష్టిలో ఉంచుకుని, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు అండర్‌ పెర్‌ఫార్మ్‌ రేటింగ్‌ ఇచ్చింది. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌కు అండర్‌ పెర్‌ఫార్మ్‌ రేటింగ్‌ను కొనసాగించింది. 

 

బీమా కంపెనీల పట్ల ఉన్న సానుకూల సెంటిమెంట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ స్టాక్స్‌ను 50 శాతానికి పైగా పెరిగేందుకు దోహదపడినట్టు జెఫరీస్‌ పేర్కొంది. గ్యారంటీతో కూడిన రాబడులను ఆఫర్‌ చేసే ఉత్పత్తుల అమ్మకంతో మార్జిన్లను పెంచుకోవడం ఇందుకు తోడ్పడిందని తెలిపింది. మార్కెట్‌ విలువ పరంగా ఎస్‌బీఐ లైఫ్‌ 61 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 50 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ 40 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరగడం గమనార్హం. ‘‘బ్యాంకు డిపాజిట్ల రేట్లు కనిష్ట స్థాయికి చేరిన సమయంలో అవకాశాన్ని ఇవి సొంతం చేసుకోవడం అన్నది సైక్లికల్‌. పాలసీదారులకు నికర రాబడుల హామీ ఇందులో 4-5.5 శాత మేరే ఉంది. బ్యాంకు డిపాజిట్లతో వీటి ఆకర్షణీయత అస్థిరతమే. బ్యాంకు రేట్లు పెరగడం మొదలైతే ఇది నిలబడదు’’అని జెఫరీస్‌ తన నివేదికలో వివరించింది. అందుకే బీమా స్టాక్స్‌కు అండర్‌ పెర్‌ఫార్మ్‌ రేటింగ్‌ ఇచ్చింది.You may be interested

రియల్టీ కుబేరులు!

Tuesday 10th December 2019

రూ.31,960 కోట్ల సంపదతో అగ్ర స్థానంలో లోధా టాప్‌ -100 మందిలో 8 మంది మహిళలు యువ కుబేరులిద్దరూ హైదరాబాద్‌ నుంచే రూ.740 కోట్లతో మై హోమ్‌ రాము, శ్యామ్‌ రావులకు చోటు ‘హురున్‌- గ్రోహె’ ఇండియా–2019 నివేదికలో వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలోని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో అత్యంత ధనికుడిగా మాక్రోటెక్‌ డెవలపర్స్‌ (గతంలో లోధా డెవలపర్స్‌) అధినేత మంగళ్‌ ప్రభాత్‌ లోధా నిలిచారు. ఈయన సంపద విలువ రూ.31,960 కోట్లు. దేశంలోని రియల్టీ

12న ఆరంభం కానున్న బాండ్‌ ఈటీఎఫ్‌

Tuesday 10th December 2019

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు సెబీ సోమవారం అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 12న ఈటీఎఫ్‌ ఇష్యూ ప్రారంభమవుతుంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గత వారమే కేంద్ర ప్రభుత్వం భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ప్రారంభానికి అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే.    భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ మార్గంలో 12 వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిధులు సమీకరించొచ్చని తెలుస్తోంది.

Most from this category