News


కోటక్‌ బ్యాంక్‌కు బ్రోకరేజ్‌ సంస్థల బూస్ట్‌

Tuesday 23rd July 2019
Markets_main1563869334.png-27255

  • 4.50శాతం ర్యాలీ చేసిన షేరు 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ..,  పలు బ్రోకరేజ్‌ సంస్థలు కోటక్‌ బ్యాంక్‌ షేర్లపై రేటింగ్‌ను పెంచాయి.  బ్రోకరేజ్‌ సంస్థల్లో ప్రధానమైన సీఎల్‌ఎస్‌ఏ, జెఫ్పారీస్‌ సంస్థలు ఏడాది కాలానికి ఈ షేర్లపై ‘‘బై’’ రేటింగ్‌ కేటాయింపుతో పాటు షేర్ల టార్గెట్‌ ధరను పెంచాయి. ఫలితంగా ఈ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఇంట్రాడే షేరు 4శాతం ర్యాలీ చేసి రూ.1510.55ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:20ని.లకు షేరు గత ముగింపుధర(రూ.1453.65)తో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.1507ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  ప్రైవేట్‌ రంగంలో సేవలు అందిస్తున్న ఈ బ్యాంకు నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం క్యూ1 ఫలితాలను ప్రకటించింది. 
ఈ క్యూ1లో స్టాండ్‌లోన్‌ ప్రాతిపదికన క్వార్టర్‌ టు క్వార్టర్‌ బ్యాంకు రూ.1,360.2కోట్ల నికరలాభాన్ని ఆర్జించినట్లు తెలిపింది. గతేడాది ఇదే తొలి త్రైమాసికంలో కంపెనీ కంపెనీ ఆర్జించిన రూ.1,052 కోట్లతో పోలిస్తే ఇది 33శాతం అధికం. ఇక ఆదాయం రూ.6,644 కోట్ల నుంచి రూ.7,945 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అయితే విశ్లేషకులు ఈ క్వార్టర్‌లో రూ.1,410 కోట్ల నికరలాభాన్ని అంచనా వేశారు. నికర వడ్డీ ఆదాయం 23శాతం పెరిగి రూ.3173 కోట్లుగా నమోదైంది. విశ్లేషకుల అంచనాలు మాత్రం రూ.3250 కోట్లుగా ఉన్నాయి. మొండిబకాయిలకు ప్రోవిజన్‌ కేటాయింపులు తగ్గడం, అధిక నికర వడ్డీ ఆదాయం పెరగడం వృద్ధికి కారణమని బ్యాంకు చెప్పుకొచ్చింది. 
సీఎల్‌ఎస్‌ఏ:- షేర్లకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. షేర్ల కొనుగోలు ధరను రూ.1665 నుంచి రూ.1750లకు పెంచింది. వ్యయాలకు తక్కువ నిధులను కేటాయించడం వృద్ధికి కారణమవుతోంది. అయితే వాల్యూయేషన్లు మాత్రం ఇప్పటికీ అధికంగా ఉన్నాయి. సీఏఎస్‌ బలంగా పెరిగింది. ఇటీవల సేవింగ్‌ డిపాజిట్లపై రేటు కోత విధింపు నికర వడ్డీ మార్జిన్లు పెరిగేందుకు దోహదపడచ్చు. వ్యక్తిగత రుణాలు నాణ్యతతో స్థిరమైన ట్రెండ్‌ కొనసాగుతున్నాయిని మేనేజ్‌మెంట్‌ ప్రకటించడం కలిసొచ్చే అంశమని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. 
జెఫ్పారీస్‌ బ్రోకరేజ్‌ సంస్థ:- గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించింది. అయితే టార్గెట్‌ ధరను మాత్రం రూ.1,175 నుంచి రూ.1225లకు పెంచింది. రుణాల కేటాయింపులో వృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో క్యూ1 ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఎన్‌ఐఐలు అంచనాలను నిరుత్సాహరిచాయి. కన్సాలిడేషన్‌ స్లిపేజ్‌ నిష్పత్తి 1.7శాతానికి పెరగడంతో ఆస్తి నాణ్యత క్షీణించింది. You may be interested

అధ్వాన్న పరిస్థితులలో మార్కెట్‌ను విడిచిపెట్టకూడదు: ధీరేంద్ర కుమార్‌

Tuesday 23rd July 2019

‘మిడ్‌ క్యాప్‌లన్నీ చిన్న కంపెనీలు కావు. నిలదొక్కుకునే సామర్ధ్యం ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి. అలాంటి మిడ్‌ క్యాప్‌ కంపెనీలను ఎంచుకోవడం మంచిది’ అని వాల్యు రీసెర్చ్‌ సీఈఓ ధీరేంద్ర కుమార్‌ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.... దీర్ఘకాల దృక్పథం మంచిది... మ్యూచువల్‌ ఫండ్‌ సహీ హై ప్రచారం 2017లో ప్రారంభమైనప్పుడు చాలా మంది మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడం, ఎస్‌ఐపీ(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లను ప్రారంభించారు. కానీ

స్పైస్ జెట్, టైటాన్‌లో వాటాలు పెంచుకున్న ఝున్‌ఝున్‌వాలా

Tuesday 23rd July 2019

వాటాలు తగ్గించుకున్న వాటిలో నాలుగు స్టాకులు 14 కంపెనీలలో ఎటువంటి మార్పులేదు    రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 2019 మార్చి  త్రైమాసికంతో పోల్చితే జూన్ త్రైమాసికంలో రెండు కంపెనీలలో తన వాటాను పెంచుకోగా,  నాలుగు కంపెనీలలో ఉన్న తన హోల్డింగ్‌ను తగ్గించుకున్నారు. ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్, ఫెడరల్ బ్యాంక్, లుపిన్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్‌లలో తన వాటాను తగ్గించుకోగా స్పైస్ జెట్, టైటాన్ కంపెనీలో వాటాను పెంచుకున్నారు.     జూలై 2019 నాటికి ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో ఉన్న

Most from this category