News


జనవరి సిరీస్‌ ఎలా ఉండొచ్చు?!

Friday 27th December 2019
Markets_main1577428055.png-30475

నేడు(శుక్రవారం) ప్రారంభమైన జనవరి డెరివేటివ్‌ సిరీస్‌లో మార్కెట్ల నడక ఎలా ఉండవచ్చన్న అంశంపై సాంకేతిక నిపుణులు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుండటంతో రానున్న రెండు నెలలు మార్కెట్లకు కీలకంగా నిలిచే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సాంకేతిక విశ్లేషణలు ఎలా ఉన్నాయంటే..

బడ్జెట్‌ ఎఫెక్ట్‌
జనవరి సిరీస్‌పై బడ్జెట్‌ అంచనాలు ప్రభావం చూపనున్నట్లు పలువురు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం నిలుపుకునే అంశంతోపాటు.. మందగిస్తున్న ఆర్థిక వృద్ధికి బలాన్నిచ్చే చర్యలపైనా మార్కెట్లు దృష్టిపెడతాయని తెలియజేశారు. గురువారం(26)తో ముగిసిన డిసెంబర్‌ సిరీస్‌లో ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ స్వల్పంగా 0.2 శాతం వెనకడుగు వేసింది. అయితే సెన్సెక్స్‌ 0.1 శాతం బలపడటం గమనార్హం. సిరీస్‌లో ఒకే రోజు సెన్సెక్స్‌ 41,810 వద్ద, నిఫ్టీ 12,294 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకడం విశేషం! 

షార్ట్‌ పొజిషన్లు కట్‌
ట్రేడర్లు షార్ట్‌ పొజిషన్లను కట్‌ చేసుకున్నారని డెరివేటివ్‌ నిపుణులు తెలియజేశారు. దీంతో గత మూడు నెలల సగటుతో పోలిస్తే జనవరి రోలోవర్లు 61 శాతం తగ్గినట్లు వివరించారు. నిఫ్టీలో 1.13 కోట్ల షేర్ల ఓపెన్‌ ఇంట్రస్ట్‌ నమోదైందని, ఇది గత ఐదేళ్లలోనే కనిష్టమని ఐసీఐసీఐ డైరెక్ట్‌ నిపుణులు అమిత్‌ గుప్తా వెల్లడించారు. యూకే ఎన్నికల ఫలితాలు, అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి ప్రాథమిక ఒప్పందం వంటి అంశాల నేపథ్యంలో దేశీయంగా ట్రేడర్లు షార్ట్‌ పొజిషన్లను తగ్గించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. అంతర్జాతీయంగా సెంటిమెంటు బలపడటం ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. రోలోవర్‌ వ్యయాలు 0.6 శాతానికి పెరిగినట్లు వెల్లడించారు. ఇది మూడు నెలల సగటు 0.4 శాతంకంటే అధికంకాగా.. లాంగ్‌సైడ్‌ పొజిషన్లను రోలోవర్‌ చేసుకున్నట్లు వివరించారు. డిసెంబర్‌ సిరీస్‌లో వొలాటిలిటీని సూచించే ఇండియా విక్స్‌ 13.99 నుంచి 11.12కు నీరసించింది. గ్లోబల్‌ మార్కెట్‌ లిక్విడిటీ మార్కెట్లకు మద్దతిస్తున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ నిపుణులు చందన్‌ తపారియా పేర్కొన్నారు. ఇది హెవీవెయిట్స్‌లో కొనుగోళ్లకు దారిచూపినట్లు తెలియజేశారు. మధ్యకాలానికి నిఫ్టీ 11,900- 12,300 రేంజిలో కదలవచ్చని తపారియా అంచనా వేశారు. 

మెటల్‌ స్టాక్స్‌కు డిమాండ్‌
వాణిజ్య ఆందోళనలు తగ్గడంతో మెటల్‌ స్టాక్స్‌లో లాంగ్‌ పొజిషన్లు రోలోవర్‌కాగా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌లోనూ ఈ ట్రెండ్‌ కనిపించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కేపిటల్‌ గూడ్స్‌, సిమెంట్‌ స్టాక్స్‌లో షార్ట్‌ పొజిషన్లు రోలోవర్‌ అయినట్లు చెబుతున్నారు. కాగా.. నిఫ్టీ 12,000 పాయింట్లను దాటే అంశం బడ్జెట్‌పై ఆధారపడి ఉన్నట్లు అమిత్‌ గుప్తా భావిస్తున్నారు. నిఫ్టీ పుట్‌ ఆప్షన్ల విషయంలో 12,000 స్థాయిలో అధిక ఓపెన్‌ ఇంట్రస్ట్‌ కనిస్తున్నట్లు చెప్పారు. కాల్‌ ఆప్షన్లలో అయితే 12,200 స్ట్రైక్‌లో గరిష్ట ఓపెన్‌ ఇంట్రస్ట్‌ ఉన్నట్లు తెలియజేశారు. ఆపై 12,500 స్ట్రైక్‌లోనూ ఆసక్తి కనిపిస్తున్నట్లు వివరించారు.You may be interested

ప్రపంచ మార్కెట్ల తీరు... టాప్‌లో బ్రెజిల్‌...దిగువన ఇండియా

Friday 27th December 2019

ఈ కేలండర్‌ ఏడాది(2019)లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్ల పనితీరును పరిశీలిస్తే.. వర్ధమాన మార్కెట్‌ బ్రెజిల్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే దేశీ మార్కెట్లు రిటర్నుల జాబితాలో టాప్‌-10లో దాదాపు అట్టడుగున నిలిచాయి. ఇందుకు పలు అంశాలు కారణమైనట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఏడాది ప్రారంభం‍లో 2018 ఒడిదొడుకులు కొనసాగగా.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, బ్రెక్సిట్‌పై కొనసాగిన అనిశ్చితి, సరిహద్దు ఉద్రిక్తతలు వంటి అంశాలు తొలుత మార్కెట్లకు సవాళ్లు

పసిడి.....8వారాల గరిష్టం

Friday 27th December 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 8వారాల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌ ఔన్స్‌ పసిడి ధర 4డాలర్లు పెరిగి 1,518.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాల మధ్య కుదిరిన తొలి దఫా ఒప్పందంపై అనుమాలు రేకత్తడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడటం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఇప్పటికే గరిష్టస్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో

Most from this category