News


22.60శాతం లాభంతో ముగిసిన జైన్‌ ఇరిగేషన్‌

Thursday 20th June 2019
Markets_main1561025336.png-26449

జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ షేరు విలువ గురువారం(జూన్‌ 20) ఇంట్రాడేలో 22.60శాతం లాభంతో రూ.24.35 వద్ద ముగిసింది. గత సెషన్‌లో 28శాతం నష్టపోయి జీవిత కాల కనిష్ఠాన్ని తాకిన ఈ షేరు ఇంట్రాడేలో లాభల్లో ట్రేడయ్యింది. ‘కంపెనీ సాధారణ కార్యకలాపాలతోనే ముందుకు సాగుతోందని పెట్టుబడిదారులకు, వాటాదారులకు హామి ఇస్తున్నాం. వేగంగా ఆస్థులను విక్రయించి కంపెనీ అప్పులను తీర్చి బ్యాలన్స్‌ సీట్‌లను కొనసాగించాడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’ అని బీఎస్‌ఈ ఫైలింగ్లో జైన్‌ ఇరిగేషన్‌ తెలిపడంతో కంపెనీ స్టాక్‌ నష్టాల నుంచి కోలుకుంది. ‘కంపెనీ షేర్లు గత సెషన్‌లో భారీగా పడిపోడానికి కంపెనీ ప్రస్తుత ప్రదర్శనకు, భవిష్యత్‌ ప్రదర్శనలకు సంబంధం లేదని ఎఫ్‌ అండ్‌ ఓ నుంచి కంపెనీ స్టాక్‌ బయటకి రావడం లేదా పుట్టుకొచ్చిన వదంతులు కారణాన ప్రతికూల భావనలు పుట్టాయి’ అని అభిప్రాయపడింది.  గురువారం ఇంట్రాడే ప్రారంభం‍లో 17 శాతం నష్టపోయిన షేరు ఆ తరువాత ఏడాది కనిష్ఠాల నుంచి షేరు 31 శాతం కోలుకుంది. అంతర్గత విలువ ఆధారంగా ముఖ్యమైన వ్యాపారాలన్నింటిని నడపటానికి కంపెనీ కట్టుబడి ఉందని, ముందుగా ప్రకటించినట్టు కంపెనీ అప్పులు రూ.2,000 కోట్లు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని కంపెనీ వివరించింది. ‘బ్యాలన్స్‌ సీట్లను సరిగ్గా నిర్వహించే వ్యూహంలో ఆస్థులను విక్రయించి అప్పులను తీర్చడం కూడా ఒక భాగం కానీ ఇప్పటికిప్పుడు కంపెనీ ఎటువంటి అప్పుల ఒత్తిడిలో లేదు. కం‍పెనీ వృద్ధి ఆధారంగా డబ్బు ప్రవాహం ఉంటుంది’ అని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడేందుకు కంపెనీ రుణదాతలకు అందుబాటులో ఉంటుందని ప్రమోటర్లు తెలిపారు. జైన్‌ ఇరిగేషన్‌లో ప్రమోటర్లకు 28.65 శాతం వాటాలున్నాయి. . You may be interested

అపోలో షేరును ఏంచేద్దాం!

Thursday 20th June 2019

అపోలో మ్యూనిచ్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌లో వాటాలను హెచ్‌డీఎఫ్‌సీకి విక్రయించాలన్న నిర్ణయం అపోలో హాస్పిటల్స్‌కు పాజిటివ్‌గా మారుతుందని బ్రోకింగ్‌సంస్థలు భావిస్తున్నాయి. డీల్‌పై, అపోలో షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు, అంచనాలు ఇలా ఉన్నాయి... 1. మోర్గాన్‌ స్టాన్లీ: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ ఇస్తూ రూ. 1667 టార్గెట్‌ ధరగా నిర్ణయించింది. ఈ డీల్‌ ప్రధానమైన లిక్విడిటీ ఈవెంట్‌అని, దీనివల్ల కంపెనీ రుణాలు తీర్చేందుకు వీలవుతుందని తెలిపింది. మేనేజ్‌మెంట్‌ గైడెన్స్‌కు అనుగుణంగానే డీల్‌ ఉందని, తనఖాలు

ఐటీ షేర్లకు హెచ్‌ 1 వీసా కష్టాలు

Thursday 20th June 2019

హెచ్‌1బీ వీసాలపై జారీని మరింత పరిమితం చేసేందుకు అమెరికా యోచిస్తుందనే వార్తలు వెలుగులోకి రావడంతో గురువారం ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2శాతం నష్టపోయింది. భారత్‌ స్థానికంగా డాటా నిల్వలు చేసుకునే విదేశీ కంపెనీలపై పరిమితులు విధించేందుకు ప్రయత్నిస్తుందని అమెరికా ఆరోపించింది. డాటా నియమాలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో అమెరికా హెచ్‌1బీ వీసాల జారీలపై పరిమితులను

Most from this category