News


ఏడాది ‍కనిష్ఠానికి జైన్‌ ఇరిగేషన్‌

Wednesday 19th June 2019
Markets_main1560924823.png-26401

జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ షేరు విలువ బుధవారం 23.72 శాతం నష్టపోయి ఏడాది కనిష్ఠమైన రూ.20.90ను తాకింది. బకాయిలను చెల్లించలేకపోతుందనే కారణాన ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌,, సంస్థ రేటింగ్‌ను ‘ఐఎన్‌డీ ఏ-’ నుంచి  ‘ఐఎన్‌డీ బీబీబీ’ కి తగ్గించి రేటింగ్‌ వాచ్‌ నెగిటివ్‌(ఆర్‌డబ్యూఎన్‌)లో చేర్చింది. దీంతో వరుసగా నాలుగవ రోజు కూడా నష్టాల్లోనే ట్రేడవుతోంది. జైన్‌ ఇరిగేషన్‌ షేరు విలువ గత ఏడాది కాలంలో 73 శాతం నష్టపోయింది. మంగళవారం ట్రేడింగ్‌లో 21.15 శాతం నష్టపోయి రూ. 27.40 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. అప్పులను తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని, సంస్థ అప్పులను రూ.2,000 కోట్ల మేర తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని కంపెనీ తెలిపింది. కంపెనీ మొత్తం అప్పులు రూ.4,900 కోట్లు  ఉండగా ఇందులో రూ.1,400 కోట్లు దీర్ఘకాలిక బాండ్‌ల రూపంలో ఉన్నాయి కాగా వీటి కాల వ్యవధి 2020 ఫిబ్రవరిలో తీరనుంది. సంస్థ పైపులు లేదా పుడ్‌ బిజినెస్‌లను విక్రయించి అప్పులు తీర్చేందుకు ప్రణాళికలు వేస్తోందని సమాచారం. 



You may be interested

ఫెడ్‌ నిర్ణయం కోసం పసిడి నిరీక్షణ

Wednesday 19th June 2019

కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం కోసం పసిడి ధరలు నిరీక్షిస్తున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,349 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ రెండు-వారాల గరిష్టానికి చేరుకోవడం కూడా పసిడి ర్యాలీకి ప్రతిరోధకంగా నిలిచింది. ప్రస్తుత పరిస్థితులు పసిడి ధరకు పెరిగేందుకు అనుకూలంగా ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి, మధ్యతూర్పు దేశాల్లో రాజకీయ సంక్షోభాలు,

4 శాతం లాభపడిన టాటాస్టీల్‌

Wednesday 19th June 2019

గత నాలుగు సెషన్‌లలో నష్టపోయిన టాటా స్టీల్‌ బుధవారం ట్రేడింగ్‌ 4శాతం లాభపడింది. రూ.480.20 వద్ద ప్రారంభమైన కంపెనీ షేరు రూ.492 ఇంట్రా‍డే  గరిష్ఠాన్ని రూ.480.20 ఇంట్రాడే కనిష్ఠాన్ని చూసింది. అంతర్జాతీయంగా వృద్ధి మందగమనంలో ఉండడంతో స్టీల్‌కు డిమాండ్‌ తగ్గినప్పటికి గోల్డ్‌మాన్‌ స్టాక్‌ ఈ షేరు కొనుగోలు టార్గెట్‌ను రూ.570 గా నిర్ణయించింది. వాణిజ్య యుద్ద భయాల ప్రభావం టాటా స్టీల్‌కు యూరప్‌లో ప్రతికూల ప్రభావం చూపిందని, ఇండియాలో దీని

Most from this category