News


ఇది సెంటిమెంట్‌ను మార్చే దీపావళి కాదు: యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌

Friday 25th October 2019
Markets_main1571996249.png-29144

-అమితాబ్ చౌదరి, యాక్సిస్ బ్యాంక్
‘ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న నెగిటివ్‌ సెంటిమెంట్‌, పండుగ సీజన్‌ వలన తొలుగుతుందని అనుకోవడం లేదు’ అని యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌ అమితాబ్‌ చౌదరి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌)లు ఆస్తి నాణ్యత సమస్యలను, లిక్విడిటీ కొరతను ఎదుర్కొం‍టున్నాయని, ఈ రంగలో 12-18 నెలల లోపు చెప్పుకోదగ్గ మార్పులను అంచనావేయోద్దని సూచించారు. మిగిలిన ముఖ్యమైన విషయాలు ఆయన మాటల్లోనే...
వ్యవస్థలో మార్పు రాలేదు..
ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మెరుగుదల కనిపించడంలేదు. రంగాల వారిగా గమనిస్తే..వినియోగ రంగం బాగలేదు, ఆటో సెక్టార్‌ పరిస్థితి తెలిసిందే, స్టీల్‌ కూడా అధ్వాన్న స్థితిలోనే ఉంది. చెల్లింపులు సరియైన సమయంలో జరగడంలేదు. ఫలితంగా చిన్న, మధ్యతరహా కంపెనీలు(ఎస్‌ఎంఈ) భారీగా ప్రభావితమవుతున్నాయి. మాల్స్‌లో అమ్మకాలు తగ్గాయి. ఈ కామర్స్‌ సైట్‌లలో అమ్మకాలు 30 శాతం పెరిగినప్పటికి ఇది దీనికన్నా అధికంగా ఉండాలి. మొత్తంగా దిగువ స్థాయిల వద్ద పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు. 
  ఆర్థిక మందగమనాన్ని తొలగించేందుకు ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంది. కానీ వీటి ఫలితం కనిపించడానికి ఇంకో రెండుమూడు త్రైమాసికాలు వేచి చూడక తప్పదు. ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించింది. దీని ఫలితం వ్యవస్థలో కనిపించడానికి ఇంకొంత సమయం పడుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం జీఎస్‌టీ బకాయిలను క్లియర్‌ చేస్తుందనే అంచనాలను మార్కెట్‌ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు రుణ మేళాలను ప్రారంభించాయి. కానీ రుణ మేళాలలో ఇచ్చే రుణాలు ముందుగానే అనుమతి పొందిన రుణాలయివుంటాయని నా నమ్మకం. వ్యవస్థలో దిగువ స్థాయిల వద్ద మెరుగుదల కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడే అది జరుగుతుందని కూడా అంచనా వేయడం లేదు.
ప్రభుత్వం వ్యయం పెరిగింది కానీ..
సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వం చేసే వ్యయం పెరిగింది. కానీ ప్రైవేట్‌ సెక్టార్‌ చేసే వ్యయం మాత్రం భారీగా తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల వలన దేశీయ వాణిజ్యవేత్తలు ఖర్చు పెట్టడానికి సుముఖంగా లేరు. వీరి నిధుల లభ్యత తక్కువగా ఉండడంతో పాటు, ప్రస్తుతం వ్యవస్థలోని పరిస్థితుల వలన ఖర్చు పెట్టడంలో వెనకడుగేస్తున్నారు. ఈ ఎంటర్‌ప్రెన్యుర్‌లు తిరిగి వ్యవస్థలోకి రాడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది.
పండుగ సీజన్‌లోను అంతే..
   ప్రస్తుత పండుగ సీజన్‌లో వ్యవస్థలో గొప్ప మార్పు వస్తుందని అనుకోవడంలేదు. గతేడాది పండుగ సీజన్‌లో కూడా అమ్మకాలు ఆశించినంతగా నమోదు కాలేదు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్‌లో నెంబర్లు పెరగొచ్చేమో, కానీ వీటి పరిమాణంలో గొప్ప తేడా ఉంటుందని అనిపించడంలేదు. మరోవైపు జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులకు మేము అధికంగా రుణాలిచ్చాం. కానీ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడంతో పాటు, వ్యవస్థలోని ప్రతికూల వార్తలను వింటుండడంతో వారు ఖర్చు పెట్టడానికి వెనకడుగేస్తున్నారు. ఈ దీపావళి సెంటిమెంట్‌ను మార్చే రికార్డు దీపావళి అవుతుందని అనుకోవడంలేదు.
కొనసాగుతున్న ఎన్‌బీఎఫ్‌సీ సమస్యలు.. 
  ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఇప్పటికి కూడా అధ్వాన్న పరిస్థితులు వెంటాడుతున్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ తన రుణాలలో కేవలం రూ. 20,000 కోట్లను మాత్రమే తీర్చగలిగింది. ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం ప్రారంభమైన తర్వాత చాలా కంపెనీలు డిఫాల్ట్‌కు దారి తీశాయి. మొదట నిధుల కొరతతో ప్రారంభమైన ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం తర్వాత ఆస్తి నాణ్యత సమస్యలు చుట్టుముట్టడంతో మరింతగా దారుణంగా తయారైంది.
  ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం ప్రారంభమైతే, ఆస్తి నాణ్యత పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రభుత్వం ఏదైన మ్యాజిక్‌ బుల్లెట్‌ను విడిచిపెడుతుందేమోనని మార్కెట్‌ వర్గాలు ఆశిస్తున్నప్పటికి, అటువంటి బుల్లెట్లేవి లేవనేది నా అభిప్రాయం. యుఎస్‌లో కొనసాగిన టార్ప్‌(ట్రబుల్డ్‌ అసెట్‌ రిలిఫ్‌ ప్రోగ్రాం) లాంటి ప్రోగ్రాన్ని ఇండియాలో కూడా ప్రవేశ పెట్టాలనే డిమాండ్‌ వినిపిస్తున్నప్పటికి, నువ్వు ఎవరిని బెయిల్‌ ఔట్‌ చేయాలనేది ఎలా నిర్ధారిస్తావు? ఒక వేళ కొన్నింటిని ఎన్నుకున్నా రాజకీయ సమస్యలు చుట్టుముట్టడం ఖాయం.You may be interested

ఇంకా భారీ డిస్కౌంట్‌లోనే చాలా షేర్లు!

Friday 25th October 2019

నిఫ్టీ వాల్యూషన్లు మాత్రం చాలా ఎక్కువ అందువల్ల మరికొంత కాలం ఆటు పోట్లు తప్పవు సిద్ధార్ధ కేమ్కా అంచనాలు నిఫ్టీలో ఇంకా పలు స్టాకులు తమతమ దీర్ఘకాలిక సరాసరి వాల్యూషన్ల కన్నా 30- 40 శాతం తక్కువకు ట్రేడవుతున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ రిటైల్‌ రిసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్ధ కేమ్కా చెప్పారు. అయితే నిఫ్టీ మాత్రం 20 రెట్లు పీఈతో ట్రేడవుతూ అధిక వాల్యూషన్ల వద్ద ఉందన్నారు. అందువల్ల స్వల్పకాలానికి సూచీలు ఒడిదుడుకులను చూస్తాయన్నారు. ఎకనమిక్‌

సుప్రీం తీర్పుతో టెలికాంలో కన్సాలిడేషన్‌!

Friday 25th October 2019

వొడాఫోన్‌ ఐడియాకు చిక్కులు తప్పవని నిపుణుల అంచనా ఏజీఆర్‌(అడ్జస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూ)కు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో టెలికం రంగంలో మరింత కన్సాలిడేషన్‌ జరుగుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. కన్సాలిడేషన్‌లో చివరకు ఎయిర్‌టెల్‌, జియో మాత్రమే మిగులుతాయని, వొడాఫోన్‌ ఐడియా భవితవ్యం అనుమానాస్పదంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. వొడాఫోన్‌ఐడియా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం బకాయిలు 400 కోట్ల డాలర్లుంటాయని, ఇది కంపెనీవద్ద ఉన్న మొత్తం నగదు రిజర్వుల కన్నా చాలా

Most from this category