News


మిడ్‌క్యాప్‌ నామ సంవత్సరం!

Thursday 9th January 2020
Markets_main1578508927.png-30773

గడిచిన ఏడాది ఏం జరిగింది..? లార్జ్‌క్యాప్‌లు.. మరింత పెద్దవిగా మారాయి. కొనుగోళ్ల మద్దతుతో నాణ్యమైన, అధిక వ్యాల్యూషన్‌ కలిగిన స్టాక్స్‌ మరింత ర్యాలీ చేశాయి. కానీ, స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ మాత్రం బాగా దెబ్బతిన్నాయి. కొన్ని అయితే 50 శాతానికి పైగా నష్టపోయాయి. మరి 2020 ఎలా ఉండబోతోంది? గతేడాదితో పోలిస్తే మార్కెట్లలో ధోరణి మారుతుందనే నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌ క్యాప్‌ను పట్టించుకోకుండా, ఒక్కో కంపెనీని విడిగా చూడడం ద్వారా మంచి నాణ్యమైన కంపెనీలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. 

 

ఈ ఏడాది మిడ్‌క్యాప్‌ విభాగం నుంచి ఎంపిక చేసిన స్టాక్స్‌ గణనీయమైన రాబడులను ఇవ్వగలవని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలను ఇచ్చిందని, ప్రభుత్వ, ప్రైవేటు వినియోగం పెరగడం ఆరంభమైందని పేర్కొంటూ, కంపెనీల ఎర్నింగ్స్‌ 2020-21లో రికవరీ అవుతాయని అంచనా వేస్తున్నారు. 2019లో నిఫ్టీ 12 శాతం పెరిగితే, మిడ్‌క్యా్ప్‌ ఇండెక్స్‌ 4.3 శాతం నష్టపోవడం గమనార్హం. గత రెండేళ్లలో అదే పనిగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలో ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు 2020లో మంచి పనితీరు చూపిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

 

‘‘లిక్విడిటీకితోడు రిస్క్‌ తీసుకునే సామర్థ్యం తిరిగి నెలకొనడం, కంపెనీల ఎర్నింగ్స్‌ వృద్ధి చెందుతాయన్న అంచనాలతో ఈ ర్యాలీ.. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలో సహేతుక వ్యాల్యూషన్లు కలిగిన నాణ్యమైన స్టాక్స్‌కు విస్తరిస్తుంది. పెట్టుబడులు భారీ, అధిక నాణ్యత కలిగిన కంపెనీల వైపే వెళ్లడంతో వ్యాల్యూషన్ల పరంగా అంతరం నెలకొంది. బాగా నష్టపోయిన రంగాలు, స్టాక్స్‌ ఉన్నాయి. వ్యాపార మూలాలు బలంగా ఉన్నవి కూడా భారీగా నష్టపోయాయి’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌హెడ్‌ వినోద్‌ నాయర్‌ వివరించారు. ఆర్థిక వ్యవస్థలో రికవరీ మొదలైతే, లిక్విడిటీ దన్నుతో నాణ్యమైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ర్యాలీ మొదలవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, స్వల్ప కాలం కోసం కాకుండా దీర్ఘకాలం కోసమే ఈ స్టాక్స్‌ను ఎంచుకుని ఇన్వెస్ట్‌ చేయాలని సూచిస్తున్నారు.

 

కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీ సిఫారసులు: బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌, సీఈఎస్‌సీ, ఎస్కార్ట్స్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఫెడరల్‌ బ్యాంకు, కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌, నారాయణ హృదయాలయ, ప్రెస్టీజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌, టాటా పవర్‌, థర్మాక్స్‌. 
యాంటిక్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ సిఫారసులు: ఆల్కెమ్‌ ల్యాబ్‌, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌, హానీవెల్‌ ఆటోమేషన్‌ ఇండియా, గుజరాత్‌ గ్యాస్‌, బేయర్‌ క్రాప్‌ సైన్సెస్‌, ఫోనిక్స్‌ మిల్స్‌, సోలార్‌ ఇండస్ట్రీస్‌, కజారియా సిరామిక్స్‌, టిమ్‌కెన్‌ ఇండియా, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, శోభ, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌. You may be interested

క్యూ3, క్యూ4లలో బ్యాంకింగ్‌కు వెలుగురేఖలు!

Thursday 9th January 2020

- భారీ మొండిబకాయిల పరిష్కారం నేపథ్యం - ఎస్‌బీఐ చైర్మన్‌ రజ్‌నీష్‌ కుమార్‌ విశ్లేషణ - నిత్యావసరాలపై అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తత ప్రభావం ముంబై: భారత్‌ బ్యాంకింగ్‌ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో (అక్టోబర్‌ 2019 - మార్చి2020)లో చక్కటి ఫలితాలు నమోదుచేసుకునే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టే్‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ రజ్‌నీష్‌ కుమార్‌ విశ్లేషించారు. భారీ మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారం దీనికి ప్రధాన

మిశ్రధాతుకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌

Thursday 9th January 2020

మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని)కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు కంపెనీకి విస్తృతమైన వ్యాపార అవకాశాలను తెచ్చిపెడతాయని ఈ సంస్థ పేర్కొంది.    ప్రభుత్వరంగ మిశ్రధాతు కంపెనీ సూపర్‌ అలాయ్‌, టైటానియం అలాయ్‌ తయారీలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సూపర్‌ అలాయ్‌ స్టీల్‌ విభాగంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ‘‘భారత అంతరిక్ష రంగానికి బడ్జెట్‌లో పెరుగుతున్న కేటాయింపులు మిధానికి కీలకమైన వనరు. అంతరిక్ష విభాగానికి గణనీయంగా పెరుగుతున్న కేటాయింపులు

Most from this category