News


ఐటీఐ ఎఫ్‌పీఓ: తొలిరోజు 6శాతం సబ్‌స్ర్కిప్షన్‌

Saturday 25th January 2020
Markets_main1579935764.png-31199

ప్రభుత్వ రంగ ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీస్‌(ఐటీఐ) ఫాలో ఆన్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ) బిడ్డింగ్‌ ప్రక్రియలో భాగంగా తొలిరోజు 6శాతం సబ్‌స్క్రైబ్‌ అ‍య్యింది. కంపెనీ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ శుక్రవారం(24న) మొదలైంది. ఆఫర్‌లో భాగంగా మొత్తం జారీ చేసిన 18.18 కోట్ల షేర్లకు గానూ శుక్రవారం ఇష్యూ ముగింపు సమయానికి 1.01 కోటి ఈక్విటీ షేర్లకు బిడ్‌ ధాఖలయ్యాయి. ఇందులో రిటైల్‌ వ్యక్తిగత ఇన్వెస్టర్ల కోసం కోసం కేటాయించిన మొత్తం 32 లక్షల ఈక్విటీ షేర్లకు 18శాతం సబ్‌స్క్రైబ్‌ లభించింది. ఎన్‌ఐఐ వాటాలో ఆశించిన స్థాయిలో బిడ్‌ ధాఖలు కాలేదు కేవలం 1.01లక్షలు మాత్రమే బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐటీ కోటాలో 66లక్షల షేర్లకు బిడ్లు ధాఖలవ్వగా, ఎంప్లాయిస్‌ కోటాలో 3శాతం సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. రూ.1,600 కోట్ల సమీకరణ లక్ష్యంతో మార్కెట్‌ వచ్చిన ఇష్యూ ఈ నెల 28న ముగుస్తుంది. సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. 

‘‘ఎస్‌బీఐ ప్రాతినిథ్యం వహించే బ్యాంక్ కన్సార్షియం నుండి కంపెనీకి సుమారు రూ. 936 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణం ఉంది. టెలికాం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం శాఖ నుండి సుమారు రూ.300 కోట్ల రూపాయల రుణం ఉంది. ఎఫ్‌పీఓ నుంచి వచ్చే రూ.642 కోట్లు వివిధ ప్రాజెక్టులకు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ.607 కోట్లు రుణాలకు చెల్లింపునకు వినియోగిస్తాము.’’ - మేనేజింగ్ డైరెక్టర్ ఆర్‌ఎం అగర్వాల్


ఫాల్‌ ఆఫ్‌ ఆఫర్‌ నడుస్తున్న క్రమంలో షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో 2.04శాతం నష్టంతో రూ.91.05 వద్ద స్థిరపడింది. You may be interested

మొబైల్స్‌, విడిభాగాల తయారీకి బడ్జెట్లో రాయితీలు?

Saturday 25th January 2020

 ప్రత్యేక కేటాయింపులు మరో వారం రోజుల్లో (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టబోయే కేం‍ద్ర బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం డిజిటల్‌ టెక్నాలజీకి పెద్ద పీట వేయనుంది. ప్రస్తుత ప్రపంచమంతా డిజిటల్‌ టెక్నాలజీతో పరుగులు పెడుతుండడంతో... ఈ రంగంలో పెట్టుబడులు పెడుతూ.. అమెరికా, చైనా, జపాన్‌ ,దక్షిణ కొరియా వంటి దేశాలు ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌, మొబైల్‌ తయారీకి కావాల్సిన విడిభాగాల  ఉత్పత్తి యూనిట్లను ప్రారంభించి,

క్యూ4లో సిమెంట్‌ కౌంటర్లకు డిమాండ్‌!

Saturday 25th January 2020

మిడ్‌, స్మాల్‌ కం‍పెనీలపై క్యూ3 ఎఫెక్ట్‌? ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌, చోళమండలం భేష్‌ - సర్థీ గ్రూప్‌ ఎండీ, సీఐవో కుంజ్‌ బన్సల్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక(అక్టోబర్‌- డిసెంబర్‌) ఫలితాల సీజన్‌ వేగమందుకుంది. ఇప్పటివరకూ పలు లార్జ్‌ క్యాప్‌ కంపెనీల పనితీరు వెల్లడైంది. అయితే ఇకపై మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల ఫలితాలు వెలువడవలసి ఉంది. ఇటీవల ఈ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఫలితాల కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నట్లు సర్థీ

Most from this category