News


ఐటీఐ, మిధానీ, యాస్టర్‌ డీఎం- లాభాల్లో

Tuesday 7th January 2020
Markets_main1578373237.png-30726

అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లలో సెంటిమెంటు బలపడటంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 500 పాయింట్లు జంప్‌చేయగా.. నిఫ్టీ 150 పాయింట్లు ఎగసింది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా కొన్ని మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ జాబితాలో టెలికం పీఎస్‌యూ ఐటీఐ లిమిటెడ్‌, ఆరోగ్య పరిరక్షణ కంపెనీ యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌, ఇంజినీరింగ్‌ పీఎస్‌యూ మిశ్రధాతు నిగమ్‌(మిధానీ) చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

ఐటీఐ లిమిటెడ్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో క్వార్టర్‌లో రూ. 168 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు టెలికం రంగ పీఎస్‌యూ ఐటీఐ లిమిటెడ్‌ వెల్లడించింది. ఇది గతేడాది(2018-19) క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నమోదైన రూ. 13.6 కోట్లతో పోలిస్తే..12 రెట్లు అధికమని తెలియజేసింది. దీంతో 16 ఏళ్ల తదుపరి కంపెనీ నష్టాల నుంచి బయటపడినట్లు వివరించింది. నిర్వహణ ఆదాయం, ఇతర ఆదాయం సహాయంతో పాజిటివ్‌ నెట్‌వర్త్‌ను సాధించినట్లు తెలియజేసింది. ఈ క్యూ3లో ఆదాయం 47 శాతం ఎగసి రూ. 828 కోట్లను తాకినట్లు టెలికం పీఎస్‌యూ ఐటీఐ లిమిటెడ్‌ తెలియజేసింది. ఈ బాటలో ఇతర ఆదాయం రూ. 73 కోట్ల నుంచి రూ. 151 కోట్లకు జంప్‌చేసినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉదయం 10.15 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో ఐటీఐ షేరు దాదాపు 13 శాతం దూసుకెళ్లి రూ. 103 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 106 వరకూ పెరిగింది.

మిధానీ లిమిటెడ్‌
ఇస్రో గగన్‌యాన్‌ ప్రాజెక్టులో వినియోగించగల అత్యంత పటిష్టమైన(అల్ట్రా హై స్ట్రెంగ్త్‌) స్టీల్‌ తొలి కన్‌సైన్‌మెంట్‌ను విడుదల చేసినట్లు పీఎస్‌యూ దిగ్గజం మిశ్రధాతు నిగమ్‌ పేర్కొంది. తద్వారా త్రోట్‌ సెటింగ్స్‌ రింగ్స్‌ తయారీ కోసం ఇగ్నిటర్‌ బాక్స్‌, కోబాల్డ్‌ అలాయ్‌లో వినియోగించే స్టీల్‌ను సరఫరా చేస్తున్నట్లు వివరించింది. అంతేకాకుండా జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 కోసం టైటానియం అలాయ్‌ మెటీరియల్స్‌ను సైతం సరఫరా చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో మిధానీ షేరు 2.5 శాతం లాభపడి రూ. 157 వద్ద ట్రేడవుతోంది. 

యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 9న సమావేశంకానున్నట్లు ఆరోగ్య పరిరక్షణ రంగ కంపెనీ యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ షేరు 2 శాతం బలపడి రూ. 169 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 175కు చేరువైంది. ఇది 16 నెలల గరిష్టంకాగా.. గత మూడు నెలల్లో ఈ కౌంటర్‌ 47 శాతం ర్యాలీ చేయడం విశేషం!



You may be interested

దీర్ఘకాలానికి బుల్లిష్‌!

Tuesday 7th January 2020

మార్కెట్‌పై మొబియస్‌ భారత ఈక్విటీలపై పాజిటివ్‌గా ఉన్నానని, దీర్ఘకాలానికి దేశీయ మార్కెట్లు బుల్లిష్‌గానే ఉంటాయని ప్రముఖ ఇన్వెస్టర్‌ మార్క్‌మొబియస్‌ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో పెట్టుబడులకు ఇదే సరైన తరుణమన్నారు. భారత మార్కెట్లో అవకాశం వచ్చినప్పుడల్లా పొజిషన్లు పెంచుకుంటూ పోతామని చెప్పారు. ప్రభుత్వం వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టడం పాజిటివ్‌ చర్యని, ఇదే సమయంలో ప్రభుత్వం ఇన్‌ఫ్రా వ్యయాలపై దృష్టి ఎక్కువగా పెట్టాలని సూచించారు. ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు పెంచితే ప్రజలకు పని దొరుకుతుందన్నారు. బడ్జెట్లో

పసిడి: ఏడేళ్ల గరిష్టం నుంచి వెనక్కి..!

Tuesday 7th January 2020

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్స్‌ ధర మంగళవారం ఏడేళ్ల గరిష్టం నుంచి వెనక్కి వచ్చాయి. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర దాదాపు 8డాలర్లు(అరశాతం) నష్టపోయి 1,560.95డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గరిష్ట స్థాయి వద్ద ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం పరిస్థితులు కొంత చల్లబటం తదితర కారణాలు పసిడి ఫ్యూచర్ల డిమాండ్‌ను తగ్గించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో నిన్నటి ట్రేడింగ్‌లో

Most from this category