STOCKS

News


ఐటీఐ ఎఫ్‌పీఓ ఇష్యూ గడువు పొడగింపు

Wednesday 29th January 2020
Markets_main1580282354.png-31304

ప్రభుత్వరంగ ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీస్‌(ఐటీఐ) కంపెనీ ఎఫ్‌పీఓ(ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఇష్యూను మరో 3రోజుల పాటు పొడిగించారు. జనవరి 24న మొదలైన ఇష్యూ ఇదే నెల 28న ముగియాల్సి ఉంది. ఇష్యూకు ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ముగింపు తేది జనవరి 31 వరకు పొడిగించారు.  అలాగే ప్రైజ్‌ బాండ్‌ ధరను సైతం తగ్గించారు. అలాగే రూ.72–77 ఉన్న ప్రైస్‌బాండ్‌ను రూ.71-77గా కుదించారు. జవవరి 28 తేదిన ఎఫ్‌పీఓ కమిటీ సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. 

జవవరి 28 సాయంత్రం 5గంటలకు... ఇష్యూ జారీ చేసిన మొత్తం 18.18 కోట్ల ఈక్విటీ షేర్లకు కేవలం 8.8 కోట్ల బిడ్లు మాత్రమే ధాఖలయ్యాయి. క్యూఐపీ కోటాలో 49శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 15శాతం సబ్‌స్క్రిబ్షన్‌ అయ్యింది. ఎంప్లాయిస్‌ పోర్షన్‌లో 65శాతంగానూ, రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో 65శాతం సబ్‌స్క్రైబ్ అయ్యింది.

ఎఫ్‌పీఓ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ రూ.1,600 కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను రుణాల చెల్లింపునకు, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని యోచిస్తోంది. దాదాపు 16ఏళ్ల తర్వాత కంపెనీ తొలిసారి ఒక క్వార్టర్‌లో నికరలాభాన్ని ప్రకటించింది. డిసెంబర్‌ క్వార్టర్‌లో కంపెనీ రూ.168.25 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. అంతకు ముందే ఇదే ఏడాది నికర లాభం కేవలం రూ.13.58 కోట్లుగానే ఉంది. 

ఎఫ్‌పీఓ గడువు మరో 3రోజుల పొడిగించిన నేపథ్యంలో ఉదయం గం.12:15ని.లకు షేరు మునుపటి ముగింపు(రూ.83.25)తో పోలిస్తే 3.72శాతం లాభంతో రూ.86.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎఫ్‌పీఓ ఇష్యూ పొడగింపు తర్వాత చివరి ఏడురోజుల్లో షేరు 19శాతం నష్టాన్ని చవిచూసింది. You may be interested

ఎస్‌బీఐ ఓకే- బీమా షేర్లు వ్యయభరితం?!

Wednesday 29th January 2020

ప్రస్తుతానికి ఎయిర్‌లైన్స్‌ షేర్లను విస్మరించవచ్చు ఎయిర్‌ ఇండియా కొనుగోలుకి ప్రాధాన్యం ఎన్‌బీఎఫ్‌సీలలో మణప్పురం ఫలితాలు గుడ్‌ - దీపక్‌ షినాయ్‌, కేపిటల్‌ మైండ్‌ వ్యవస్థాపకులు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ షేరుని తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చునంటున్నారు కేపిటల్‌ మైండ్‌ వ్యవస్థాపకులు దీపక్‌ షినాయ్‌. బ్యాంకింగ్‌, ఐటీ రంగాల ఫలితాలు, ర్యాలీ చేస్తున్న బీమా రంగ కౌంటర్లు తదితర పలు అంశాలపై ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు చూద్దాం..  దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

మెటల్‌ షేర్లు అప్‌

Wednesday 29th January 2020

పుంజుకున్న మెటల్‌ షేర్లు అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ ప్రభావంతో గత రెండురోజులుగా పతనమైన మెటల్‌ షేర్లు బుధవారం ఇన్వెస్టర్ల మద్దతు లభించడంతో పుంజుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.7 శాతం పెరుగుదలతో 2,686.20 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. మొయిల్‌ 3.7 శాతం పెరుగుదలతో 154.30 వద్ద, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ 2.74 శాతం పెరుగుదలతో 262.25 వద్ద, సెయిల్‌ 2.44 శాతం పెరుగుదలతో 48.20 వద్ద, టాటాస్టీల్‌ 2.36

Most from this category