News


ఐటీసీ 9.5 శాతం అప్‌

Monday 23rd September 2019
Markets_main1569214334.png-28488

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఐటీసీ సోమవారం ప్రారంభంలోనే 9శాతానికి పైగా లాభపడింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.249.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గతవారంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పొగాకు ఉత్పత్తులపై శ్లాబ్‌ను పెంచవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. కౌన్సిల్‌ పొగాకు ఎలాంటి రేటును పెంచకపోవడంతో పాటు హోటల్‌ గదులపై జీఎస్‌టీ తగ్గించింది. ఇక కేంద్రం ప్రకటించిన కంపెనీలపై కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కూడా ఐటీసీ కంపెనీకి భారీగా కలిసొచ్చే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో నేడు మార్కెట్‌ ప్రారంభంలోనే ఐటీసీ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఒక దశలో 9.50శాతం ర్యాలీ చేసి రూ.260.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఉదయం గం.9:50ని.లకు షేర్లు క్రితం ముగింపు(రూ.238.15)తో పోలిస్తే 7.50శాతం లాభంతో రూ.255.60 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక ఈ ఏడాదిలో ఈ కంపెనీ షేర్లు రూ.234.10 వద్ద ఏడాది కనిష్టాన్ని, రూ.310.00 వద్ద ఏడాది గరిష్టాన్ని నమోదు చేశాయి. 
కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో సూచీలు రెండోరోజూ లాభాల బాట పట్టాయి. నేడు సెన్సెక్స్‌ ఆర్జించిన 771 పాయింట్లలో ఐటీసీ షేర్ల వాటా 200 పాయింట్లుగానూ, నిఫ్టీ ఆర్జించిన 231.50 పాయింట్లకు గానూ 50 పాయింట్లు ఐటీసీ షేర్లవి కావడం విశేషం. 



You may be interested

బలగాలను మోహరించిన యుఎస్‌..పెరిగిన చమురు

Monday 23rd September 2019

సౌదీ నుంచి చమురు సరఫరాకు అంతరాయం కలగడంతోపాటు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త వాతవరణం వలన చమురు ధరలు సోమవారం పెరిగాయి. ఉదయం 9.39 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 1.03 శాతం లాభపడి బ్యారెల్‌ 63.85 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1.02 శాతం లాభపడి బ్యారెల్‌ 58.68 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.     డ్రోన్‌ దాడి జరిగడంతో సౌదీ చమురు కేంద్రాల నుంచి క్రూడ్‌ ఉత్పత్తి సగానికి పైగా తగ్గింది. ఈ

బ్యాంక్‌ నిఫ్టీ లాభం 1000 పాయింట్లు

Monday 23rd September 2019

కేంద్ర ప్రభుత్వం, కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి శుక్రవారం తగ్గించిన విషయం తెలిసిందే. దీని ఫలితంగా శుక్రవారం దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు ఆల్‌టైం గరిష్ఠాలకు చేరుకున్నాయి. బుల్స్‌ సోమవారం ట్రేడింగ్‌లో కూడా తమ పట్టును బిగిస్తున్నారు. ట్రేడింగ్‌ ప్రారంభంలో దేశీయ సూచీలు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.49 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1060.20 పాయింట్లు లాభపడి 30 వేల మార్కును(30051.35 పాయింట్ల వద్ద

Most from this category