News


ఐటీసీ టార్గెట్‌ ధరను తగ్గించిన సీఎల్‌ఎస్‌ఏ

Monday 17th June 2019
Markets_main1560757806.png-26350

ఎఫ్‌ఎమ్‌జీసీ దిగ్గజం ఐటీసీ కంపెనీ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 1శాతం నష్టపోయాయి. ప్రముఖ రేటింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సిగరెట్‌ వ్యాపారంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐటీసీ షేరు టార్గెట్‌ ధరను తగ్గించడం ఇందుకు కారణమైంది. ‘‘2019-19 ఆర్థిక సంవత్సరంలో నిధుల ప్రవాహం తగ్గడంతో ఆదాయ నిష్పత్తిలో పెరుగుదల తగ్గముఖం పట్టింది. అధిక పన్నుల కారణంగా సిగరెట్ వ్యాపారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. అయితే ఎఫ్‌ఎంజీసీ రంగం మాత్రం ఆశించిన స్థాయిలో రాణించింది’’ అని రీసెర్చ్‌ సంస్థ తెలిపింది. ఆదాయాల పెరుగుదలో ఎలాంటి వృద్ధి లేకపోవడంతో సిగరెట్‌ వ్యాపారపు వాల్యూవేషన్స్‌ తగ్గుముఖం పట్టినట్లు సీఎల్‌ఎస్‌ఏ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో తాము ఐటీసీ షేర్లకు కేటాయించిన టార్గెట్‌ ధరను రూ.400 నుంచి రూ.365కు తగ్గిస్తున్నట్లు తెలిపింది.
అయితే సిగరెట్ వ్యాపారం మూలధనంపై రాబడి అంచనాలకు మించి పెరుగుతుందనే అశాభావాన్ని సీఎల్‌ఎస్‌ఏ వ్యక్తం చేసింది. సీఎల్‌ఎస్‌ఏ షేరు కొనుగోలు ధరను తగ్గించడంతో ఇన్వెస్టర్లు ఐటీసీ షేర్ల అమ్మకాలకు ‍తెరలేపారు. ఫలితంగా షేరు 1శాతం నష్టపోయి రూ.274.95ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం 1:00గం.లకు షేరు గతముగింపు(రూ.277.95)తో పోలిస్తే 0.67శాతం నష్టంతో రూ.276.10ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 258.90 రూ.322.70లుగా నమోదయ్యాయి. 
ఇదే సమయానికి సెన్సెక్స్‌ 316.88 పాయింట్ల నష్టంతో 39135.19 వద్ద, నిఫ్టీ 96.65 పాయింట్లను కోల్పోయి 11726.65ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

3వారాల కనిష్టానికి యాక్సిస్‌ బ్యాంక్‌

Monday 17th June 2019

యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు సోమవారం 2.46శాతం నష్టపోయి రూ.781,50 వద్ద ట్రేడవుతోంది.  గత నెల 27 తర్వాత ఈ షేరుకి ఇదే కనిష్ఠ స్థాయి. ఏప్రిల్‌ 27,2018 కనిష్ఠ స్థాయి నుంచి జూన్‌ 4, 2019 గరిష్ఠ స్థాయి మధ్య గల 7శాతం ఫైబోనాక్కి రిట్రాస్‌మెంట్‌ స్థాయి  రూ. 803.48 వద్ద ఈ షేరుకు మద్ధతు ఉంది.  తాజాగా ఈ మద్దతు కోల్పోయింది. దీంతోపాటు 20రోజుల డీఎంఏ స్థాయి దిగువకు

కార్వీ ముఖ్యాధికారులపై కేసు నమోదు!

Monday 17th June 2019

పెట్టుబడిదారులను నమ్మించి మోసం చేశారనే ఆరోపణల మీద కొంత మంది కార్యీ గ్రూప్‌ ముఖ్యధికారులపై బెంగుళూరు పోలిసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఇందులో కార్వీ ప్రై. వెల్త్‌ సీఈఓ అబిజిత్‌ బావే కూడా ఉన్నారు. పెట్టుబడి దారులకు 18-20శాతం లాభాలొస్తాయని నమ్మించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో కార్వీ స్టాక్‌ బ్రోకర్స్‌, కార్వీ రియాల్టీ ఇండియా, కార్వీ క్యాపిటల్‌ డైరక్టర్లపై కేసును నమోదు చేశారు.  ఇప్పటి వరకు తొమ్మిదిమంది

Most from this category